OTT Time Travel: ఓటీటీలోకి సరికొత్త టైమ్ ట్రావెల్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Time Travel Web Series Gyaarah Gyaarah OTT Streaming: ఓటీటీలోకి సరికొత్తగా టైమ్ ట్రావెల్ వెబ్ సిరీస్ గ్యారా గ్యారా వచ్చేయనుంది. సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో 3 విభిన్నమైన టైమ్ లైన్స్‌లో జరిగే కథతో తెరకెక్కిన ఈ గ్యారా గ్యారా వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో రిలీజ్ కానుందనే వివరాల్లోకి వెళితే..
OTT Time Travel Web Series Release Date: ఓటీటీ అనే మహాసముద్రంలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు దర్శనం ఇస్తూనే ఉంటాయి. ప్రతి వారం కుప్పలుతెప్పలుగా సినిమాలు వచ్చి చేరుతుంటాయి. వాటిలో అనేకరకాలైన జోనర్స్ ఉంటాయి. అయితే ఓటీటీతోపాటు నార్మల్ ఆడియెన్స్ సైతం కొన్ని రకాల జోనర్ సినిమాలను మాత్రమే చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
అవే హారర్, క్రైమ్ సస్పెన్స్, కామెడీ జోనర్స్. వీటితోపాటు సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కే మూవీస్, వెబ్ సిరీసులకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. గ్రిప్పింగ్ టేకింగ్, ఉత్కంఠత కలిగించే ట్విస్టులతో తెరకెక్కిస్తే ఈ జోనర్ సినిమాలకు ఫిదా అవుతుంటారు. అయితే, ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమాలు కానీ వెబ్ సిరీసులు రావడం చాలా అరుదుగా జరుగుతుంటాయి.
ఈ నేపథ్యంలో ఓటీటీలోకి నేరుగా సరికొత్తగా ఓ టైమ్ ట్రావెల్ వెబ్ సిరీస్ రానుంది. సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ అంశాలతో మిళితం చేస్తూ రూపొందించిన లేటెస్ట్ వెబ్ సిరీసే గ్యారా గ్యారా (11:11). హిందీలో తెరకెక్కిన ఈ గ్యారా గ్యారా వెబ్ సిరీస్ ట్రైలర్‌ను ఇటీవల విడుదల రిలీజ్ చేశారు. 2 నిమిషాల 28 సెకన్లపాటు సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.
గ్యారా గ్యారా ట్రైలర్ ప్రకారం చూస్తే 1990 సంవత్సరంలోని ఓ పోలీస్ అధికారి 2001లో ఉన్న మరో పోలీస్‌తో వాకీ టాకీ ద్వారా మాట్లాడుతుంటాడు. అది కూడా ప్రతిరోజు రాత్రి 11 గంటల 11 నిమిషాలకు మాత్రమే సాధ్యం అవుతుంది. ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ అప్పుడు జరుగుతున్న మర్డర్ మిస్టరీలను సాల్వ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రమాదాలు ఎదుర్కొంటుంటారు.
ఇలా భవిష్యత్, గతం కాలాల్లో జరుగుతున్న క్రైమ్స్ పరిష్కరిస్తున్న వాళ్లకు చివరికీ ఏమైంది, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనే కథాంశంగా గ్యారా గ్యారా వెబ్ సిరీస్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక గ్యారా గ్యారా వెబ్ సిరీస్ కథ మొత్తంగా 1990, 2001, 2016 మూడు టైమ్ లైన్స్‌లలో జరుగుతుంది. ఇలా ఆసక్తిగా సాగే ఈ టైమ్ ట్రావెల్ సిరీస్ త్వరలో ఓటీటీలోకి వచ్చేయనుంది.
గ్యారా గ్యారా వెబ్ సిరీస్ ఆగస్ట్ 9 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ విషయంపై ఇదివరకే జీ5 ఓటీటీ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ సిరీస్ చూస్తుంటే హాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ వెబ్ సిరీస్ డార్క్ తరహాలో ఉన్నట్లు కనిపిస్తోంది. డార్క్ వెబ్ సిరీస్‌ను ఇన్‌స్ఫైర్‌గా తీసుకుని గ్యారా గ్యారా తెరకెక్కించారేమో అని నెటిజన్స్ ట్రైలర్ కింద కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన గ్యారా గ్యారా వెబ్ సిరీస్‌కు ఉమేష్ బిస్త్ దర్సకత్వం వహించారు. ఇందులో రాఘవ్ జుయల్, క్రితికా కమ్రా , ధైర్య కర్వా ప్రధాన పాత్రలు పోషించారు.
1990లో పోలీస్ అధికారి శౌర్య పాత్రలో ధైర్య కర్వా నటిస్తే.. మరో పోలీస్ యుగ్ ఆర్యగా రాఘవ్ జుయెల్ చేశాడు. వీరితోపాటు గౌతమి కపూర్, హర్ష్ ఛయ, ఆకాష్ దీక్షిత్, వివేక్ జమనా, విదుషి మనదులి, ఖుషి భరద్వాజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.