OTT Telugu Releases This week: ఈ వారం ఓటీటీల్లోకి మూడు తెలుగు చిత్రాలు.. ఓ మూవీ నేరుగా..
OTT Telugu Releases This week: ఈ వారం ఓటీటీల్లోకి మూడు సినిమాలు స్ట్రీమింగ్‍కు వచ్చేస్తున్నాయి. ఓ ఫ్యామిలీ డ్రామాతో పాటు మరో యాక్షన్ మూవీ రానుంది. ఓ చిత్రం నేరుగా ఓటీటీలోకే అడుగుపెడుతోంది. ఈ సినిమాల వివరాలివే..
ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో గత వారం సినిమాల పండుగే జరిగింది. మిస్టర్ బచ్చన్ (నెట్‍ఫ్లిక్స్), ఆయ్ (నెట్‍ఫ్లిక్స్), కమిటీ కుర్రోళ్ళు (ఈటీవీ విన్) సహా మరిన్ని ముఖ్యమైన చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. ఈ వారం (సెప్టెంబర్ మూడో వారం) ఓటీటీల్లోకి మూడు తెలుగు సినిమాలు అడుగుపెట్టనున్నాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మారుతీ నగర్ సుబ్రమణ్యంతో పాటు రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఓ మూవీ కూడా స్ట్రీమింగ్‍కు రానుంది. మరో చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఇలా ఈ వారం ఓటీటీల్లోకి రానున్న మూడు తెలుగు చిత్రాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
మారుతీ నగర్ సుబ్రమణ్యం
మారుతీ నగర్ సుబ్రమణ్యం చిత్రం ఈ శుక్రవారం (సెప్టెంబర్ 20) ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ప్రముఖ నటుడు రావు రమేశ్ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రానికి థియేటర్లలో పాజిటివ్ టాక్ దక్కింది. ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా ఆగస్టు 23న థియేటర్లలో విడుదలైంది. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మారుతీ నగర్ సుబ్రమణ్యం చిత్రంలో ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి కూడా ముఖ్యమైన పాత్రలు చేశారు.
మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమాను డైరెక్టర్ లక్ష్మణ్ కార్య తెరకెక్కించారు. పీబీఆర్ సినిమాస్, లోక్‍మాత్రే క్రియేషన్స్ బ్యానర్లు నిర్మించాయి. ఉద్యోగం లేదని తల్లీకొడుకులకు అనుకోకుండా బ్యాంక్ ఖాతా ద్వారా రూ.5లక్షలు దక్కడం, వాటిని వారు ఖర్చు చేయడం, ఆ తర్వాత సవాళ్లు ఎదురవడం చట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. మారుతీ నగర్ సుబ్రమణ్యం చిత్రాన్ని సెప్టెంబర్ 20 నుంచి ఆహాలో చూసేయవచ్చు.
తిరగబడరా సామీ
తిరగబడరా సామీ చిత్రం సెప్టెంబర్ 19వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ యాక్షన్ రొమాంటిక్ డ్రామా చిత్రంలో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా హీరోహీరోయిన్లుగా నటించారు. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన తిరగబడరా సామీ ఆగస్టు 2వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ గురువారమే ఆహా ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయింది.
సోపతులు
సోపతులు చిత్రం నేరుగా ఓటీటీలోకే స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. సెప్టెంబర్ 19న ఈ రూరల్ కామెడీ డ్రామా మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలంగాణ రూరల్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు అనంత్ వర్దన్. భాను ప్రకాశ్, శృజన్, మోహన్ భగత్, అనూష రమేశ్, మణి అయిగుర్ల, అంజయ్య మిల్కూరి ప్రధాన పాత్రలు చేశారు. చిన్ననాటి స్నేహితులు, కరోనా లాక్‍డౌన్ వల్ల వారిపై పడిన ప్రభావం, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారన్న విషయాలపై ఈ చిత్రం రూపొందింది.
‘ది మిస్టరీ మోక్ష ఐల్యాండ్’ అనే తెలుగు వెబ్ సిరీస్ కూడా ఇదే వారం స్ట్రీమింగ్‍కు రానుంది. సెప్టెంబర్ 20వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ అడుగుపెట్టనుంది. అనీశ్ కురువిళ్ల దర్శకత్వం వహించిన ఈ సిరీస్‍లో తేజస్వి మదివాడ, నందు, పావని రెడ్డి, అషుతోష్ రానా లీడ్ రోల్స్ చేశారు.
తంగలాన్ రానుందా?
స్టార్ హీరో విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ చిత్రం ఈ వారమే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 20వ తేదీన ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుందని రూమర్లు వస్తున్నాయి. ఈ తమిళ చిత్రం తెలుగు డబ్బింగ్‍లోనూ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుంది. స్ట్రీమింగ్ డేట్‍పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రంజిత్ దర్శకత్వం వహించిన తంగలాన్ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చి.. మోస్తరు కలెక్షన్లు దక్కించుకుంది. ఈ చిత్రం ఈ వారమే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తుందేమో చూడాలి.