OTT Releases this week: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న టాప్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..-ott releases this week bhimaa hanuman lambasingi farrey family aaj kal parasite in prime video netflix sonyliv hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases This Week: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న టాప్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..

OTT Releases this week: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న టాప్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..

Hari Prasad S HT Telugu

OTT Releases this week: ఈ వారం ఓటీటీల్లోకి రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ ఏవో చూడండి. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జీ5, సోనీలివ్, హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లోకి ఈ మూవీస్, సిరీస్ రానున్నాయి.

ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న టాప్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..

OTT Releases this week: ఏప్రిల్ తొలి వారంలోనే ఓటీటీల్లోకి కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 7 మధ్య వివిధ ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్ ఏంటో ఇక్కడ చూడండి. వీటిలో వివిధ భాషలకు చెందినవి ఉన్నాయి. తెలుగులో హిట్ అయిన భీమా సినిమాతోపాటు లంబసింగిలాంటివి ఈ వారం ఓటీటీలోకి వస్తున్నాయి.

ఏప్రిల్ తొలి వారంలో ఓటీటీల్లోకి రానున్న సినిమాలు

లంబసింగి - హాట్‌స్టార్

గత నెలలో రిలీజైన లంబసింగి మూవీ 20 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ మంగళవారం (ఏప్రిల్ 2) నుంచే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బిగ్ బాస్ ఫేమ్ దివి నటించిన సినిమా ఇది. ఓ పోలీస్ కానిస్టేబుల్.. నక్సలైట్ కూతురిపై మనసు పారేసుకునే ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చిన సినిమా.

భీమా - హాట్‌స్టార్

గోపీచంద్ నటించిన భీమా గత నెల 8వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర మరీ అంత సక్సెస్ సాధించని ఈ మూవీ నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ శుక్రవారం (ఏప్రిల్ 5) నుంచి హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

హనుమాన్ - హాట్‌స్టార్

హనుమాన్ మూవీ ఇప్పటికే రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ వెర్షన్లు జీ5, జియో సినిమాల్లో ఉండగా.. మిగిలిన కన్నడ, తమిళ, మలయాళ వెర్షన్లు శుక్రవారం (ఏప్రిల్ 5) నుంచి హాట్‌స్టార్ లోకి రాబోతున్నాయి.

ఫారీ - జీ5

గతేడాది థియేటర్లలో రిలీజైన మూవీ ఫారీ (Farrey). ఇప్పుడీ సినిమా జీ5 ఓటీటీలోకి వస్తోంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఫారీ స్ట్రీమింగ్ కానుంది. స్కూల్లో చీటింగ్ రాకెట్ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా మంచి థ్రిల్ పంచనుంది.

ఫ్యామిలీ ఆజ్ కల్ - సోనీలివ్

ఫ్యామిలీ ఆజ్ కల్ ఓ వెబ్ సిరీస్. ఈ సిరీస్ బుధవారం (ఏప్రిల్ 3) నుంచే సోనీలివ్ ఓటీటీలోకి రానుంది. ఓ ట్యాక్సీ డ్రైవర్ ను ప్రేమించే మధ్య తరగతి యువతి, ఆమె ఫ్యామిలీ చుట్టూ తిరిగే సరదా కథ ఇది.

యే మేరే ఫ్యామిలీ 3 - మినీ టీవీ

యే మేరే ఫ్యామిలీ నుంచి వచ్చిన రెండు సీజన్లు ఐఎండీబీలో అత్యధిక రేటింగ్స్ సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు మూడో సీజన్ రాబోతోంది. ఈ కొత్త సీజన్ గురువారం (ఏప్రిల్ 4) నుంచి అమెజాన్ మినీ టీవీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ కొత్త సీజన్ కూడా నవ్వులను పంచనుంది.

పారాసైట్ ద గ్రే - నెట్‌ఫ్లిక్స్

పారాసైట్ ద గ్రే ఓ వెబ్ సిరీస్. ఈ కొత్త సిరీస్ శుక్రవారం (ఏప్రిల్ 5) నుంచి నెట్‌ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కు రానుంది. హిటోషి ఇవాకీ కామిక్ పారాసైట్ ఆధారంగా తెరకెక్కిన యాక్షన్ సిరీస్ ఇది. నెట్‌ఫ్లిక్స్ లో ఇదే కాకుండా స్కూప్, క్రూక్స్, హనీమూనిష్ లాంటి మూవీస్ కూడా రాబోతున్నాయి.