April OTT Releases: ఈ నెలలో ఓటీటీల్లోకి రాబోతున్న సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే
April OTT Releases: ఏప్రిల్ నెలలో వివిధ ఓటీటీల్లోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. అందులో టాప్ తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లిష్, కొరియన్ డ్రామా మూవీస్, సిరీస్ ఉన్నాయి.
April OTT Releases: ఓటీటీల్లో ఈ సమ్మర్ లో సినిమాలు, వెబ్ సిరీస్ ల పండగ ఉండబోతోంది. ముఖ్యంగా పిల్లలకు సమ్మర్ హాలిడేస్ ప్రారంభమయ్యే ఈ ఏప్రిల్ నెలలో ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీలివ్ లాంటి ఓటీటీల్లో వివిధ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. వీటిలో ప్రేమలు, భీమా, గామి, హనుమాన్ (ఇతర వెర్షన్లు), సైరన్, మంజుమ్మెల్ బాయ్స్ లాంటి సినిమాలు ఉన్నాయి.
ఏప్రిల్లో ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్ ఇవే
ఏప్రిల్ నెలలో వివిధ ఓటీటీల్లో రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఏవో ఇక్కడ చూడండి..
లంబసింగి - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ఇక గత నెలలో థియేటర్లలో రిలీజైన లంబసింగి మూవీ మంగళవారం (ఏప్రిల్ 2) నుంచి హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. నక్సలైట్ కూతురిని ప్రేమించే ఓ కానిస్టేబుల్ చుట్టూ తిరిగే ఈ కథ ఆసక్తి రేపింది. 20 రోజుల్లోపే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.
భీమా - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
గోపీచంద్ నటించిన భీమా మూవీ కూడా ఈ నెలలోనే ఓటీటీలోకి రాబోతోంది. ఈ మూవీ రాబోయే శుక్రవారం (ఏప్రిల్ 5) నుంచే హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి కానుంది.
గామి - జీ5 ఓటీటీ
భీమాతోపాటే థియేటర్లలో రిలీజైన విశ్వక్ సేన్ గామి మూవీ కూడా ఈ నెలలోనే ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ డేట్ ఇంకా అనౌన్స్ చేయకపోయినా.. త్వరలోనే జీ5 ఓటీటీలో అడుగు పెట్టనుంది. దీనిపై అధికారిక ప్రకటన రిలీజ్ చేయనున్నారు.
ఓం భీమ్ బుష్ - ప్రైమ్ వీడియో
గత నెలలో రిలీజై సూపర్ హిట్ అయిన మరో తెలుగు మూవీ ఓం భీమ్ బుష్. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ నెలలోనే ఈ సినిమా అందులోకి రాబోతోంది.
అమర్‌సింగ్ చమ్‌కీలా - నెట్‌ఫ్లిక్స్
పంజాబ్ రెబల్ సింగర్, దివంగత అమర్‌సింగ్ చమ్‌కీలా బయోపిక్ అదే పేరుతో తెరకెక్కింది. ఈ మూవీ నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకే ఏప్రిల్ 12న అడుగుపెట్టనుంది.
హనుమాన్ - హాట్‌స్టార్
ఇప్పటికే హనుమాన్ తెలుగు, హిందీ వెర్షన్లు జీ5, జియో సినిమాల్లోకి వచ్చేశాయి. ఇక ఇప్పుడు కన్నడ, తమిళం, మలయాళం వెర్షన్లు ఈ శుక్రవారం (ఏప్రిల్ 5) నుంచి హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.
ఫారీ - జీ5
స్కూల్లో జరిగే అదిపెద్ద చీటింగ్ రాకెట్ చుట్టూ తిరిగే కథతో ఈ ఫారీ అనే హిందీ మూవీ రాబోతోంది. ఈ సినిమా జీ5 ఓటీటీలో ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మంజుమ్మెల్ బాయ్స్ - హాట్‌స్టార్
మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా మంజుమ్మెల్ బాయ్స్. ఫిబ్రవరిలోనే రిలీజైనా.. ఈ మధ్యే తెలుగులోకి కూడా రావడంతో ఓటీటీ రిలీజ్ ఆలస్యమైంది. ఈ నెల చివర్లో ఈ మూవీ హాట్‌స్టార్ లోకి కానుంది.
సైరన్ - హాట్‌స్టార్
జయం రవి, కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సైరన్ ఓటీటీలోకి వస్తోంది. హాట్‌స్టార్ లో ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఫ్యామిలీ ఆజ్ కల్ - సోనీలివ్
ఫ్యామిలీ ఆజ్ కల్ ఓ హిందీ వెబ్ సిరీస్. ఈ సిరీస్ బుధవారం (ఏప్రిల్ 3) నుంచే సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇదొక కామెడీ సిరీస్.
యే మేరీ ఫ్యామిలీ - అమెజాన్ మినీ టీవీ
సూపర్ హిట్ అయిన యే మేరీ ఫ్యామిలీ సీజన్ 3 వచ్చేస్తోంది. ఈ కొత్త సీజన్ గురువారం (ఏప్రిల్ 4) నుంచి అమెజాన్ మినీ టీవీలోకి కాబోతోంది.
అదృశ్యం - సోనీలివ్
అదృశ్యం ఓ టీవీ సిరీస్. ఈ కొత్త సిరీస్ ఏప్రిల్ 11 నుంచి ప్రతి గురు, శుక్రవారాల్లో రాత్రి 8 గంటలకు సోనీలివ్ ఓటీటీలోకి వస్తుంది.
చీఫ్ డిటెక్టివ్ - నెట్‌ఫ్లిక్స్
కొరియన్ డ్రామా అయిన చీఫ్ డిటెక్టివ్ ఏప్రిల్ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
పారాసైట్: ద గ్రే - నెట్‌ఫ్లిక్స్
పారాసైట్: ద గ్రే వెబ్ సిరీస్ ఏప్రిల్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది.
టాపిక్