OTT Movies: ఓటీటీలోకి ఒక్కరోజే వచ్చేసిన 10 సినిమాలు.. ఏకంగా 7 స్పెషల్.. ఇక్కడ చూసేయండి!
OTT Movies To Release On Friday: ఓటీటీలోకి ఒక్కరోజే 10 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. శుక్రవారం (సెప్టెంబర్ 20) పది ఓటీటీ రిలీజ్ కాగా.. నేడు (సెప్టెంబర్ 21) ఒక వెబ్ సిరీస్, రియాలిటీ షో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో 7 స్పెషల్‌గా ఉన్న సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.
Today OTT Releases: ఎప్పటిక్పప్పుడు ప్రతివారం సరికొత్త కంటెంట్‌తో ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీసులు ఎప్పుడు అలరిస్తూ సందడి చేస్తూనే ఉంటాయి. అలాగే ఈ వీక్ కూడా దాదాపుగా 20 వరకు సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీల్లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో సెప్టెంబర్ 20న పది ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అలాగే, ఇవాళ ఓ రియాలిటీ షో, ఓ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వేచ్చేశాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
హిజ్ త్రీ డాటర్స్ (ఇంగ్లీష్ సినిమా)- సెప్టెంబర్ 20
తంగలాన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సినిమా)- సెప్టెంబర్ 20
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 (హిందీ రియాలిటీ షో)- సెప్టెంబర్ 21
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ (తెలుగు వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 20
తలైవేట్టాయామాపాళ్యం (తమిళ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 20
ది జడ్జ్ ఫ్రమ్ హెల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 21
ఆహా ఓటీటీ
తిరగబడరా సామీ (తెలుగు సినిమా)- సెప్టెంబర్ 19
మారుతీనగర్ సుబ్రమణ్యం (తెలుగు మూవీ)- సెప్టెంబర్ 20
జియో సినిమా ఓటీటీ
జో తేరా హై వో మేరా హై (హిందీ సినిమా)- సెప్టెంబర్ 20
ది పెంగ్విన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 20
మత్స్యగంధ (కన్నడ యాక్షన్ డ్రామా మూవీ)- సినీ బజార్ ఓటీటీ- సెప్టెంబర్ 20
సీఐడీ రామచంద్రన్ రిటైర్డ్ ఎస్ఐ (మలయాళ క్రైమ్ థ్రిల్లర్)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- సెప్టెంబర్ 20
డోపమైన్@2.22 (తమిళ థ్రిల్లర్ మూవీ)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- సెప్టెంబర్ 20
ఒక్కరోజే పది ఓటీటీ రిలీజ్
ఇలా సెప్టెంబర్ 20న ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రాగా.. ఇవాళ్టీ (సెప్టెంబర్ 21) నుంచి రెండు మాత్రం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటన్నింటిలో తెలుగు హారర్ వెబ్ సిరీస్ ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్, తెలుగు కామెడీ మూవీ మారుతీనగర్ సుబ్రమణ్యం చాలా స్పెషల్ కానున్నాయి.
తమిళం, మలయాళం, కన్నడ సినిమాలు
అలాగే చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మూడింటితిపాటు రియాలిటీ కామెడీ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 కూడా ఇంట్రెస్టింగ్ కానుంది. వీటిటిపాటు కన్నడ యాక్షన్ సినిమా మత్స్యగంధ, తమిళ థ్రిల్లర్ మూవీ డోపమైన్@2.22, మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం సీఐడీ రామచంద్రన్ రిటైర్డ్ ఎస్ఐ కూడా ప్రత్యేకం కానున్నాయి.
అయితే, వీటిలో మత్స్యగంధ, డోపమైన్@2.22 రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇలా ఫ్రైడే రోజు 10 ఓటీటీ రిలీజ్ కాగా.. వాటిలో 7 చాలా స్పెషల్ కావడం విశేషం.