Spy Thriller OTT: నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న స్పై థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?-spy thriller movie berlin to stream directly in zee 5 ott aparshakti khurana ott news in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Spy Thriller Ott: నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న స్పై థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Spy Thriller OTT: నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న స్పై థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Hari Prasad S HT Telugu
Aug 19, 2024 03:53 PM IST

Spy Thriller OTT: ఓ స్పై థ్రిల్లర్ మూవీ ఇప్పుడు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. గతేడాది జియో మామీ ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ అయిన ఈ మూవీ.. థియేటర్లలో రిలీజ్ వద్దనుకొని నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైకే రానుండటం విశేషం. మరి ఈ సినిమాను ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న స్పై థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న స్పై థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Spy Thriller OTT: ఓటీటీలోకి ఓ స్పై థ్రిల్లర్ మూవీ రాబోతోంది. ఈ సినిమా పేరు బెర్లిన్. ఇప్పటికే ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రీమియర్ అయిన ఈ సినిమా.. తర్వాత థియేటర్లలో రిలీజ్ కాకుండా ఓటీటీని ఎంచుకుంది. బాలీవుడ్ నటులు అపర్‌శక్తి ఖురానా, రాహుల్ బోస్, ఇశ్వాక్ సింగ్ నటించిన ఈ మూవీ జీ5 ఓటీటీలో రానుంది.

జీ5 ఓటీటీలోకి స్పై థ్రిల్లర్ బెర్లిన్

జీ5 ఓటీటీలోకి నేరుగా వస్తున్న ఈ బెర్లిన్ సినిమాకు కథ అందించడంతోపాటు అతుల్ సబర్వాల్ డైరెక్ట్ చేశాడు. 2023లో ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ మూవీని ప్రదర్శించగా.. త్వరలోనే తమ ప్లాట్‌ఫామ్ పైకి రానున్నట్లు జీ5 ఓటీటీ సోమవారం (ఆగస్ట్ 19) ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేసింది.

బెర్లిన్ మూవీ పోస్టర్ లో ఇందులోని ప్రధాన పాత్రదారులైన అపర్‌శక్తి ఖురానా, రాహుల్ బోస్ ఇశ్వాక్ సింగ్ లను చూడొచ్చు. "అంతర్జాతీయంగా ఎన్నో ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రశంసలు అందుకున్న బెర్లిన్ మూవీ మొత్తానికి జీ5లోకి రాబోతోంది. బెర్లిన్ జీ5లో త్వరలోనే" అనే క్యాప్షన్ తో ఈ సినిమా స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది. ఈ మూవీలో కబీర్ బేడీ, అనుప్రియా గోయెంకాలాంటి వాళ్లు కూడా నటించారు.

బెర్లిన్ మూవీ ఇలా..

ఈ బెర్లిన్ మూవీలో అపర్‌శక్తి ఖురానా ఓ సైన్ లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్ పుష్కిన్ పాత్రలో నటించాడు. గతంలో ఈ సినిమా గురించి అతడు మట్లాడాడు. "అదంతా ఓ కొత్త ప్రపంచం. కానీ చాలా అందమైనది. కేవలం కళ్ల ద్వారానే ఎంతో చెప్పాల్సి వచ్చింది. సైన్ లాంగ్వేజ్ కు ఇది చాలా ముఖ్యం" అని అపర్‌శక్తి అన్నాడు.

ఇక మరో బాలీవుడ్ నటుడు ఇశ్వాక్ సింగ్ ఈ సినిమాలో మూగ వ్యక్తి అశోక్ పాత్రలో నటించాడు. అతడు తన పాత్ర గురించి మాట్లాడుతూ.. "మాట్లాడే భాష కంటే మూగ భాష నిర్మాణం పూర్తి భిన్నంగా ఉంటుంది. అందుకే ఇదొక సవాలుగా నిలిచింది" అని అన్నాడు. బెర్లిన్ మూవీ ఓ స్పై థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన మూవీ. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు ముందే ఎంతో ఆసక్తి రేపుతోంది. మూవీ స్ట్రీమింగ్ తేదీతోపాటు మరిన్ని వివరాలను కూడా త్వరలోనే జీ5 ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.