IB 71 OTT Release Date: స్పై థ్రిల్లర్ ‘ఐబీ 71’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే!-ib 71 movie ready to steam on disney plus hotstar ott platform from july 7 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ib 71 Ott Release Date: స్పై థ్రిల్లర్ ‘ఐబీ 71’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే!

IB 71 OTT Release Date: స్పై థ్రిల్లర్ ‘ఐబీ 71’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 25, 2023 05:17 PM IST

IB 71 OTT Release Date: సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఐబీ71 చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. వివరాలు ఇవే.

IB 71 OTT Release Date: స్పై థ్రిల్లర్ ‘ఐబీ 71’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. డేట్ ఖరారు
IB 71 OTT Release Date: స్పై థ్రిల్లర్ ‘ఐబీ 71’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. డేట్ ఖరారు

IB 71 OTT Release Date: తెలుగు డైరెక్టర్, 'ఘాజీ' ఫేమ్ సంకల్ప్ రెడ్డి.. బాలీవుడ్‍లో ‘ఐబీ 71’ స్పై థ్రిల్లర్ మూవీని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్ హీరోగా నటించగా.. అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం ఈ ఏడాది మే 12వ తేదీన థియేటర్లలో విడుదలైంది. మంచి టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్లు ఆకట్టుకున్నాయి. కాగా, ఈ ‘ఐబీ 71’ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఓటీటీ ప్లాట్‍ఫామ్, స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యాయి.

ఐబీ 71 చిత్రం డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. జూలై 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డిస్నీ+ హాట్‍స్టార్ అధికారికంగా ప్రకటించింది. ది అన్ ‍టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ స్పై మిషన్… జూలై 7న స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోందని ట్వీట్ చేసింది.

ఐబీ 71 చిత్రంలో ఐబీ ఏజెంట్ దేవ్ జమ్వాల్ పాత్ర పోషించాడు విద్యుత్ జమ్వాల్. సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్.. ముఖ్యమైన పాత్ర పోషించాడు. వీరితో పాటు విశాల్ జెత్వా, ఫైజాన్, అశ్వత్ భట్, డానీ సురా, దలిప్ తహిల్, సుర్వత్ జోషీ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించాడు.

టాలీవుడ్‍లో తెలుగులో ఘాజీ, అంతరిక్షం లాంటి ప్రయోగాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించిన సంకల్ప్ రెడ్డి.. 1971లో జరిగిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ హైజాక్ ఆధారంగా ఈ ఐబీ 71 చిత్రాన్ని తెరకెక్కించాడు. ఘాజీ సినిమాకు గాను బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ (తెలుగు) విభాగంలో జాతీయ అవార్డును కూడా అప్పట్లో సంకల్ప్ సాధించాడు. ఐబీ 71 చిత్రాన్ని కూడా పక్కా స్పై సస్పెన్స్ థ్రిల్లర్‌లా అతడు తీసుకొచ్చాడు. ఐబీ 71 చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి టాక్ వచ్చింది.

ఐబీ 71 సినిమాను భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, విద్యుత్ జమ్వాల్, అబ్బాస్ సయ్యద్ సంయుక్తంగా నిర్మించారు. ప్రశాంతి వి విహారీ, విక్రమ్ మంట్రోస్ మ్యూజిక్ డైరెక్టర్లుగా ఉన్నారు. సుమారు 117 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం.. ఆద్యంతం థ్రిల్లింగ్‍గా సాగుతుంది.

Whats_app_banner