NNS September 25th Episode: టెర్రరిస్ట్‌లకు ఎరగా భాగీ.. మిస్సమ్మ ప్రాణాలకు ప్రమాదం.. మనోహరి ఏడుపు.. మారు వేషంలో రాథోడ్
Nindu Noorella Saavasam September 25th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 25వ తేది ఎపిసోడ్‌లో భాగీని అమర్ బయటకు తీసుకెళ్తాడు. దానిని ఒప్పుకోనని భాగీతో అరుంధతి అంటుంది. ఎందుకు ఒప్పుకోరని భాగీ అడిగితే ఆరు కవర్ చేస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 25th September Episode) అమర్ బయటకు వెళ్దామనడంతో సంబరంగా తయారై కిందకు వస్తుంది. చుడీదార్ వేసుకున్న భాగీని చూసిన అమర్ షాకింగ్‌గా లేచి అచ్చం మీ అక్కలాగే ఉన్నావు మిస్సమ్మ అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు.
కంఫర్ట్‌గా ఉందిగా
మా అక్కలాగా ఉన్నానా..? అంటూ భాగీ అడగ్గానే అదే అరుంధతిని అక్కా అంటావు కదా? అందుకే అలా అన్నాను అని అమర్ కవర్ చేస్తాడు. ఇంతలో నీకు కంఫర్ట్‌గానే ఉందిగా పరిగెత్తడానికి అని అమర్ అడగగానే భాగీ షాకింగ్‌గా చూస్తుంది. నిజం చెప్పండి నన్ను బయటకు అని చెప్పి ఏ మిలటరీ క్యాంపుకో తీసుకెళ్లడం లేదుగా అంటూ అనుమానంగా అడుగుతుంది భాగీ.
ఏం లేదని అమర్ బయటకు వెళ్లిపోతాడు. భాగీ కూడా బయటకు వెళ్తుంది. ఎదురుగా వస్తు మిస్సమ్మ.. ఆగు.. అంటున్న అరుంధతితో అక్కా నేను మా ఆయన బయటకు వెళ్తున్నాం. ఈవెనింగ్ వచ్చాక కలుస్తాను. బై.. ఆ ఈవెనింగ్ కాదు కానీ నైట్ వచ్చాకా కలుస్తాను. ఆ నైట్ కూడా కాదు కానీ పొద్దున్నే కలుస్తాను అంటుంది మిస్సమ్మ.
అంటే రేపు పొద్దునే వరకు రారా? నువ్వెందుకు ఇంతలా సిగ్గుపడుతున్నావు అంటుంది అరుంధతి. అంటే ఆయన ఏం ప్లాన్ చేశారో తెలియదు కదా? రాత్రే రావొచ్చు. లేదా? రాత్రంతా కలిసి ఉండి పొద్దునే రావొచ్చు. నాకు మాత్రం ఏం తెలుస్తుంది చెప్పు అంటుంది మిస్సమ్మ. నో నేను ఒప్పుకోను.. అంటున్న అరుంధతితో నేను మా ఆయనతో కలిసి ఉంటానంటే మీరెందుకు ఒప్పుకోరు అక్కా..? అని అడుగుతుంది మిస్సమ్మ.
భయపడిన భాగీ
ఒప్పుకోను అంటే అది నువ్వు లేకుంటే ఇల్లు బోసి పోతుంది కదా? బాగోదు కదా? అంటున్నాను అంటుంది ఆరు. నాకు మాత్రం ఆయనతో వెళ్తుంటే అది తెలియకుండా వెళ్తుంటే చాలా బాగుంది అంటూ మెలికలు తిరుగుతుంది భాగీ. ఇంతలో ఆరు తల బాదుకుంటుంది. ఆరుకి భాగీ బై చెప్పి వెళ్తుంది. కారు దగ్గరకు వెళ్లగానే రాథోడ్ గన్ తీసి అమర్‌కు ఇస్తుంటాడు. అది చూసి భాగీ భయపడుతుంది.
రాథోడ్‌ను అడిగితే సేఫ్ సైడ్‌కు అని చెప్తాడు. అమర్, భాగీ వెళ్లిపోతారు. రాథోడ్ టెన్షన్‌తో అటూ ఇటూ తిరుగుతుంటాడు. నిర్మల, శివరామ్ వస్తారు. రాథోడ్ రైతు బజారుకు వెళ్లాలి కారు తీయ్.. రాథోడ్ ఉండవయ్యా రైతు బజారుకు వెళ్లాలి కారు తీయ్ అంటే తియ్యవేంటి? అంటాడు శివరామ్. అది అది నేను చెప్పలేను సార్ అంటాడు రాథోడ్.
ఎందుకు చెప్పలేవు.. అంటున్న శివరామ్‌తో మా సార్ చెప్పారు కాబట్టి.. డ్యూటీకి అన్యాయం చేయలేను కాబట్టి అంటాడు రాథోడ్. కోడల్ని బయటకు తీసుకుపోవడానికి డ్యూటీకి ఎంటయ్యా సంబంధం అంటాడు శివరామ్. నిజం చెప్పు రాథోడ్ అమర్, మిస్సమ్మను బయటకు ఎందుకు తీసుకెళ్లాడు అని నిర్మల అడగ్గానే రాథోడ్ జరిగింది మొత్తం చెప్తాడు.
మారు వేషంలో చెప్పు
దీంతో అరుంధతి బాధగా ఆయన భాగీని ఎరగా తీసుకెళితే భాగీ మాత్రం చాలా హ్యాపీగా వెళ్లిపోయిందా? అనుకుంటుంది. నిర్మల, శివరామ్ ఇద్దరూ కలిసి ఏదో ఒకటి చేసి విషయం మిస్సమ్మకు చెప్పండి అంటారు. అది కుదరదు అంటాడు రాథోడ్. మారు వేషంలో వెళ్లి భాగీకి నిజం చెప్పు అని శివరామ్ చెప్పగానే సరే అని రాథోడ్ వెళ్లిపోతాడు.
భాగీ సంతోషంగా అమర్‌తో పాటు కారులో వెళ్తుంది. కారును అరవింద్ ఫాలో చేస్తుంటాడు. మరోవైపు మనోహరి రూంలోకి వెళ్లిన అరుంధతి మనోహరిని తిడుతుంది. బాబ్జీ ఇంకా ఫోన్ చేయలేదని ఎదురుచూస్తుంది మను. ఇంతలో బాబ్జీ ఫోన్ చేసి అమర్, భాగీని రిసార్ట్స్‌కి తీసుకెళ్తున్నాడని చెప్పగానే మనోహరి ఏడుస్తుంది.
లోకేషన్ నాకు షేర్ చేయి నేను అక్కడకు వస్తాను అని చెప్తుంది మనోహరి. అరవింద్ ఏం చేయబోతున్నాడు? అమర్ మిస్సమ్మను ప్రమాదం నుంచి కాపాడతాడా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు సెప్టెంబర్ 25న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!