NNS 04th September Episode: మిస్సమ్మని అమ్మా అన్న అంజు.. పిక్నిక్‌కు వెళ్దామన్న అమర్.. గుప్త తెలిసిన షాకింగ్ విషయం
NNS 04th September Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 4) ఎపిసోడ్లో.. మిస్సమ్మను అంజు.. అమ్మ అని పిలుస్తుంది. అటు పిక్నిక్ కు వెళ్దామని అమర్ అనగా.. చిత్రగుప్తుడికి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది.
NNS 04th September Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (సెప్టెంబర్ 4) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. జాగింగ్‌కి వెళ్లిన అమర్ ఇంటికి రాగానే ఆరు పరుగెత్తుకెళ్లి పిల్లల్ని పిక్నిక్ కు తీసుకెళ్లండని చెప్తుంది. ఏదో వినబడినట్లు అమర్ కొద్దిసేపు ఆగి వెళ్లిపోతాడు. ఆరు హ్యాపీగా చూస్తుండిపోతుంది.
అరుంధతి ఆత్రం
ఇంతలో గుప్త దగ్గరకు రావడంతో చూశారా? గుప్త గారు మా ఆయనకు నేను ఏదైనా చెప్పాలనుకుంటే ఆయనకు వెంటనే అర్థం అయిపోతుంది అని చెప్తుంది. ఇంట్లోకి వెళ్తున్న అమర్ ను డోర్ దగ్గర ఆపి.. మనోహరి ఏదో చెప్పబోయి ఆగిపోతుంది. లోపలికి వెళ్లిన అమర్‌కు మిస్సమ్మ కాఫీ ఇస్తుంది.
ఏంటి గుప్త గారు లైబ్రరీ లాగా ఈ సైలెంట్ ఏంటి? ఎవరో ఒకరు ఆయనకు పిక్నిక్ గురించి గుర్తు చేయొచ్చు కదా అంటుంది అరుంధతి. నీకు అన్నింటికీ ఆత్రమే బాలిక. నువ్వు ఆగుము అంటాడు గుప్త.
పిక్నిక్‌కు అమర్ రెడీ
అమ్మా మిస్సమ్మా ఇవాళ ఆదివారం కదా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు గుడికి వెళ్లి రాకూడదూ అంటాడు శివరామ్. గుడికా ఇంత పొద్దున్నే పిల్లలు లేవరు మామయ్య. పిల్లలు లేచే టైంకు గుడికి వెళ్తే బాగుండదు. సాయంత్రం వెళతానులెండి అంటుంది మిస్సమ్మ. అవునండి అయినా గుడికేం వెళతారు.
ఇంకెక్కడికైనా వెళ్లండి అంటుంది నిర్మల. అందరూ రెడీ అవండి. పిక్నిక్ వెళ్దాం అని అమర్ చెప్పగానే మనోహరి షాక్ అవుతుంది. నిర్మల, శివరాం, మిస్సమ్మ హ్యాపీగా ఫీలవుతారు. అరుంధతి సంతోషిస్తుంటే గుప్త తిడతాడు.
మనోహరి కొత్త ప్లాన్
అందరూ పిక్నిక్కి వెళ్తున్నారనే మాట వినగానే మనోహరి ఇరిటేటింగ్ గా ఫీలవుతుంది. ఆరును కూడా ఇలాగే అడ్డు తొలగిద్దామని ఆలోచిస్తూ కూర్చుంటే.. వాళ్లిద్దరి పెళ్లి ప్రేమకు దారి తీసింది. విడదీయరాని బంధంగా మారింది.
ఇప్పుడు కూడా అలాగే పిక్నిక్ లు అని పోనిస్తే వాళ్లిద్దరి మధ్య గట్టి బంధం ఏర్పడుతుంది. ఎలాగైనా వాళ్లను ఆపాలి అని పిల్లలను ఎవరినైనా మెట్లపై నుంచి తోసేయాలని అనుకుంటుంది మనోహరి. అందరిలోకెళ్లా ఆకాష్‌ను కిందకు తోసేయాలనుకుంటుంది.
మిస్సమ్మను అమ్మ అన్న అంజూ
మిస్సమ్మ వెళ్లి పిల్లలను నిద్ర లేపుతుంది. మీ డాడ్ అందర్ని పిక్నిక్ కు తీసుకెళ్తామన్నారు అని మిస్సమ్మ చెప్పగానే పిల్లలు హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో అంజు థాంక్యూ అమ్మా అంటూ మిస్సమ్మను హగ్ చేసుకుంటుంది.
అంజు నువ్వు మిస్సమ్మను అమ్మా అన్నావు.. అనగానే అంజు మిస్సమ్మను వదిలి దూరంగా వెళ్తుంది. అవును అంజు నువ్వు నన్ను అమ్మా అని పిలిచావా? అని అడుగుతుంది మిస్సమ్మ. లేదు నేనేం అమ్మా అనలేదే.. మిస్సమ్మా అన్నాను. అయినా నిన్ను మా అమ్మ స్థానంలోకి ఎలా రానిస్తాను అనుకున్నావు అంటుంది అంజు.
ఏయ్ అంజు పిలవలేదంటే పిలవలేదని చెప్పు. దానికెందుకు ఎక్స్ ట్రా మాట్లాడుతున్నావు. పాపం మిస్సమ్మ ఎంత బాధపడుతుందో.. అంటుంది అమ్ము. ఎవరో బాధకు నన్ను కారణం చేయకండి. అయినా ఎందుకు అందరూ డల్ అయిపోయారు. మనం అన్ని రెడీ చేయాలి కదా అనుకుంటారు పిల్లలు.
డ్రీమ్స్‌లోకి మిస్సమ్మ
మీరు రెడీ అయితే చాలు నేను అన్ని రెడీ చేస్తాను అని మిస్సమ్మ అనగానే పిల్లలు మేము ఎలా రెడీ అవుతామో నీకు తెలియదు మిస్సమ్మ అంటూ తాము గేమ్స్ ఆడతామని డాడీ కూడా చాలా సరదాగా ఉంటారని చెప్తారు. దీంతో మిస్సమ్మ డ్రీమ్స్ లోకి వెళ్తుంద. పాత సినిమాల్లోలాగా పరుగెత్తుకుంటూ వచ్చి అమర్ ప్రపోజ్ చేసినట్టు కలగంటుంది.
బ్యాక్ గ్రౌండ్ లో లవ్ సాంగ్ ప్లే అవుతుంది. ఇంతలో అంజు, మిస్సమ్మ తలనొక్కి ఆ డ్రీమ్ లోంచి బయటకు రామ్మా.. అని వెటకారంగా మాట్లాడుతుంది. మెలికలు తిరిగిపోతూ మిస్సమ్మ డ్రీమ్‌లోంచి బయటకు వచ్చి త్వరగా రెడీ అవ్వండని చెప్పి వెళ్లిపోతుంది.
గుప్తకు తెలిసిన షాకింగ్ విషయం
అమర్ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు గుప్త. బయటకు వెళ్లేందుకు అమర్ ఎందుకు ఒప్పుకున్నాడు. ఏదో జరగబోతుంది.. ఏం జరగబోతుందో తెలుసుకుందామని మాయ దర్పణంలో చూసి గుప్త షాక్ అవుతాడు. ఏం జరుగుతుందో తెలిసిన గుప్త ఏం చేస్తాడు?
గుప్త హెచ్చరికతో అరుంధతి పిక్నిక్ ప్రోగ్రామ్ని చెడగొడుతుందా? పిక్నిక్లో మనోహరి ఏం చేయబోతోంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు సెప్టెంబర్ 04న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!