Netflix Malayalam Movies: నెట్‌ఫ్లిక్స్‌లోని టాప్ మలయాళం సినిమాలు ఇవే.. అన్నీ చూడదగినవే
Netflix Malayalam Movies: నెట్‌ఫ్లిక్స్‌లో కొన్ని టాప్ మలయాళం సినిమాలు ఉన్నాయి. వీటిలో ఈ మధ్యే రిలీజైన మూవీస్ తోపాటు గతంలో ఈ ఓటీటీలోకి వచ్చి సక్సెస్ సాధించిన మూవీస్ కూడా ఉండటం విశేషం.
Netflix Malayalam Movies: మలయాళ సినిమాలకు క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో ఓటీటీలన్నీ ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మూవీస్ హక్కులను పొందడానికి పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో చాలా వరకు హిట్ మలయాళం మూవీస్ ఉండగా.. నెట్‌ఫ్లిక్స్ లోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నాయి. అవేంటో మీరూ చూడండి.
నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ మలయాళం మూవీస్
నెట్‌ఫ్లిక్స్ లో ప్రస్తుతం కొన్ని క్రైమ్ థ్రిల్లర్ తోపాటు కామెడీ, మర్డర్ మిస్టరీ మలయాళ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరికొన్ని రిలీజ్ కాబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న వాటిలో టాప్ సినిమాలు ఇవే.
అన్వేషిప్పిన్ కండెతుమ్
టొవినో థామస్ నటించిన మర్డర్ మిస్టరీ మూవీ అన్వేషిప్పిన్ కండెతుమ్. ఈ ఏడాది రిలీజైన హిట్ మలయాళ సినిమాల్లో ఇదీ ఒకటి. ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ.. అక్కడ కూడా టాప్ ట్రెండింగ్స్ లో ఒకటిగా నిలుస్తోంది. రెండు హత్యలు, వాటి ఇన్వెస్టిగేషన్ చుట్టూ సాగే కథతో ఈ సినిమా ఉత్కంఠ రేపుతుంది.
తుండు
బిజు మేనన్ నటించిన తుండు ఓ కామెడీ మూవీ. ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. ఈగో కారణంగా ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ మధ్య ఏర్పడిన వైరం ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనే పాయింట్ తో ప్రారంభం నుంచి చివరి వరకు ఆడియెన్స్‌ను నవ్వించేందుకు ఈ తుండు మేకర్స్ ప్రయత్నించారు. ఇదొక మంచి టైంపాస్ మూవీ.
అంగమలీ డైరీస్
అంగమలీ డైరీస్ మూవీ 2017లో మలయాళంలో రిలీజైంది. అంగమలీ అనే పట్టణంలోని ఓ క్రైమ్ గ్యాంగ్ చుట్టూ తిరిగే కథ ఇది. తెలుగులోనూ విశ్వక్ సేన్ ఫలక్‌నుమా దాస్ పేరుతో ఈ మూవీని రీమేక్ చేశాడు. ఒకవేళ అది చూసి ఉండకపోతే మలయాళ ఒరిజినల్ చూసేయండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.
ఇరట్టా
జోజు జార్జ్ హీరోగా నటించిన క్రైమ్ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ఇరట్టా. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో మర్డర్ మిస్టరీ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్‌గా దర్శకుడు రోహిత్ ఎం.జి కృష్ణన్ ఇరాట్టా సినిమాను రూపొందించారు. సాధారణంగా ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాల్లో హత్యానేరాలకు సంబంధించిన చిక్కుముడులను పోలీసులు రివీల్ చేసినట్లుగా చూపిస్తుంటారు. కానీ ఓ పోలీస్ అది కూడా స్టేషన్‌లోనే మీడియా, ప్రజల సమక్షంలో చనిపోవడం అనే పాయింట్ చుట్టూ చివరి వరకు ఉత్కంఠభరితంగా నడిపించారు దర్శకుడు.
ఆర్‌డీఎక్స్ రాబర్ట్ డోనీ గ్జేవియర్
కొత్త డైరెక్టర్ నహాస్ హిదాయత్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో షేన్ నిగమ్, ఆంటోని వర్గీస్, నీరజ్ మాధవ్ మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. క్రైమ్, డ్రామా, అద్భుతమైన టేకింగ్, నటీనటుల పర్ఫామెన్స్, బీజీఎమ్ వంటి ఇతర అంశాలతో 'ఆర్‍డీఎక్స్: రాబర్ట్ డోని జేవియర్' సినిమాకు మంచి ఆదరణ లభించింది.
జన గణ మన
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ జన గణ మన. నకిలీ ఎన్‌కౌంటర్ల చుట్టూ తిరిగే కథతో మలయాళంలోనే కాదు.. అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా ఇది.