Manjummel Boys OTT: రూ.100 కోట్లు దాటిన మరో మలయాళం మూవీ.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే?-manjummel boys crossed 100 crores at box office this malayalam survival thriller ott streaming next month ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manjummel Boys Ott: రూ.100 కోట్లు దాటిన మరో మలయాళం మూవీ.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే?

Manjummel Boys OTT: రూ.100 కోట్లు దాటిన మరో మలయాళం మూవీ.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే?

Hari Prasad S HT Telugu
Mar 05, 2024 08:11 AM IST

Manjummel Boys OTT: మలయాళంలో మరో మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు దాటింది. సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మంజుమ్మెల్ బాయ్స్ మూవీ ఓటీటీ రిలీజ్ పై తాజాగా ఓ అప్డేట్ వస్తోంది.

బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు దాటిన మలయాళం మూవీ మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే..
బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు దాటిన మలయాళం మూవీ మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే..

Manjummel Boys OTT: ఈ ఏడాది మలయాళం సినిమా ఇండస్ట్రీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. రెండు నెలల్లోనే మూడు పెద్ద హిట్స్ ఆ ఇండస్ట్రీ సొంతం చేసుకుంది. అందులో ఒకటి మంజుమ్మెల్ బాయ్స్. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ రిలీజైన 12 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్ దాటడం విశేషం. ఫిబ్రవరి 22న రిలీజైన ఈ సినిమా సోమవారం (మార్చి 4) నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.

మంజుమ్మెల్ బాయ్స్ బాక్సాఫీస్

మంజుమ్మెల్ బాయ్స్ మూవీ రిలీజైన రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. కేరళ బాక్సాఫీస్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా కళ్లు చెదిరే వసూళ్లు సాధించింది. చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ మూవీ 11 మంది స్నేహితుల చుట్టూ తిరిగే ఓ సర్వైవల్ థ్రిల్లర్. 2006లో తమిళనాడులోని కొడైకెనాల్ లో ఉన్న గుణ గుహల్లో జరిగిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కించారు.

కేరళకు చెందిన 11 మంది స్నేహితులు 2006లో తమిళనాడులోని కొడైకెనాల్లో ఉన్న గుణ కేవ్స్ కు వెళ్లారు. అందులో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తూ ఓ లోతైన గుహలోకి పడిపోతాడు. అతన్ని రక్షించడానికి మిగిలిన స్నేహితులు ఏం చేశారన్నదే ఈ మంజుమ్మెల్ బాయ్స్ స్టోరీ.

అలాంటి సినిమాను కళ్లకు కట్టినట్లు, ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయేలా మూవీ తీయడంతో మలయాళ ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి ఎగబడుతున్నారు. దీంతో 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల కలెక్షన్లను దాటేసింది. మలయాళం ఇండస్ట్రీలో రూ.100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన నాలుగో సినిమా మంజుమ్మెల్ బాయ్స్ నిలిచింది.

గతంలో పులిమురుగన్, లూసిఫర్, 2018 సినిమాలు రూ.100 కోట్లకుపైగా వసూలు చేశాయి. వీటిలో 2018 మూవీ రూ.177 కోట్లతో అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళ సినిమాగా నిలిచింది. ఇప్పుడీ మంజుమ్మెల్ బాయ్స్ ఆ రికార్డుపై కన్నేసింది. కేరళలోనే కాదు తమిళనాడులో అది కూడా సోమవారం (మార్చి 4) రూ.5 కోట్లు వసూలు చేసిందంటే ఈ సినిమాకు ఏ రేంజ్ లో ఆదరణ లభించిందో అర్థం చేసుకోవచ్చు.

మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్

ఈ సూపర్ హిట్ మలయాళం మూవీ ఫిబ్రవరి 22న రిలీజైన విషయం తెలిసిందే. ఈ మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. 12 రోజుల్లోనే రూ.105 కోట్ల కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాను చూడాలని తెలుగు ప్రేక్షకులు కూడా ఆరాట పడుతున్నారు.

ఈ ఏడాది ఇదొక్కటే కాదు ప్రేమలు, అన్వేషిప్పిన్ కండెతుమ్ అనే మలయాళ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. వీటిలో టొవినో థామస్ నటించిన అన్వేషిప్పిన్ కండెతుమ్ మూవీ మార్చి 8న నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేస్తోంది. ప్రేమలు కూడా ఈ నెల చివర్లోగా రాబోతోంది. ఇక ఈ మంజుమ్మెల్ బాయ్స్ వచ్చే నెలలో రానుంది. దీంతో ఈ సినిమాను కనీసం ఓటీటీలో అయినా చూసేయాలని ఇక్కడి ప్రేక్షకులు భావిస్తున్నారు.

Whats_app_banner