2018 Collections: 2018 రికార్డు కలెక్షన్లు.. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీ ఇదే-2018 collections make it as highest grossing malayalam movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  2018 Collections Make It As Highest Grossing Malayalam Movie

2018 Collections: 2018 రికార్డు కలెక్షన్లు.. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీ ఇదే

Hari Prasad S HT Telugu
May 22, 2023 09:29 PM IST

2018 Collections: 2018 రికార్డు కలెక్షన్లు సొంతం చేసుకుంది. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీగా నిలవడం విశేషం. ఈ సినిమా తాజాగా తెలుగులోనూ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

 2018 మూవీ
2018 మూవీ

2018 Collections: మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో అద్భుతమైన మూవీ 2018. ఏడేళ్ల రికార్డును బ్రేక్ చేస్తూ.. ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 2018 నిలిచింది. రిలీజైన తర్వాత 17 రోజుల్లోనే ఆ సినిమా ఈ రికార్డును సొంతం చేసుకోవడం విశేషం. టొవినో థామస్ నటించిన ఈ మలయాళ సినిమా ఇప్పటి వరకూ రూ.137.60 కోట్లు వసూలు చేసింది.

ఇప్పటి వరకూ ఈ రికార్డు మోహన్ లాల్ నటించిన పులిముమరుగన్ పేరిట ఉండేది. ఆ సినిమా రూ.137.35 కోట్లు వసూలు చేయగా.. ఇప్పుడా రికార్డును 2018 బ్రేక్ చేసింది. ఈ సినిమా ఒక్క కేరళలోనే రూ.65.25 కోట్లు రాబట్టింది. ఇక మరో రూ.8.4 కోట్లు ఇండియాలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చాయి. ఓవర్సీస్ నుంచి ఏకంగా రూ.63.95 కోట్లు రావడంతో 2018 ఈ రికార్డు సాధించింది.

కేవలం కేరళ వరకూ చూసుకుంటే 2018 నాలుగో స్థానంలో ఉంది. ఈ లిస్టులో పులిమురుగన్ రూ.78.5 కోట్లతో టాప్ లో ఉంది. ఆ తర్వాత బాహుబలి 2 రూ.73 కోట్లు, కేజీఎఫ్ ఛాప్టర్ 2 రూ.68.5 కోట్ల వసూళ్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం 2018 జోరు చూస్తుంటే.. రానున్న వీకెండ్ లో ఈ సినిమాల రికార్డులన్నీ బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

2018 మూవీ అదే ఏడాది కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. ఆ వరదల్లో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ 2018 సినిమాకు జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. మలయాళంలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, హిందీల్లోనూ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ మధ్యే తెలుగు ట్రైలర్ కూడా రిలీజైంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం