2018 in Telugu: ఆ వంద కోట్ల మలయాళం సినిమా తెలుగులోనూ వస్తోంది-2018 in telugu as the 100 crores malayalam movie to release on may 18th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  2018 In Telugu: ఆ వంద కోట్ల మలయాళం సినిమా తెలుగులోనూ వస్తోంది

2018 in Telugu: ఆ వంద కోట్ల మలయాళం సినిమా తెలుగులోనూ వస్తోంది

Hari Prasad S HT Telugu
May 17, 2023 02:04 PM IST

2018 in Telugu: ఆ వంద కోట్ల మలయాళం సినిమా తెలుగులోనూ వస్తోంది. పది రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన 2018 మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ బుధవారం (మే 17) అనౌన్స్ చేశారు.

మలయాళ మూవీ 2018 తెలుగులోనూ రానుంది
మలయాళ మూవీ 2018 తెలుగులోనూ రానుంది

2018 in Telugu: మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 2018 మూవీలో తెలుగులోనూ రాబోతోంది. టొవినో థామస్ నటించిన ఈ సినిమా 10 రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీని తెలుగుతోపాటు మిగతా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. తాజాగా ఈ విషయాన్ని బుధవారం (మే 17) అనౌన్స్ చేశారు.

2018 మూవీ మే 26న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన తర్వాత మిగతా భాషల ప్రేక్షకుల నుంచి కూడా డిమాండ్లు రావడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళంలలో రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని టొవినో థామస్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు.

మే 18 సాయంత్రం 6 గంటలకు ఈ 2018 మూవీ ట్రైలర్ ఇతర భాషల్లో రిలీజ్ కానున్నట్లు టొవినో చెప్పాడు. అయితే మూవీ రిలీజ్ కు సంబంధించి ఇప్పటి వరకూ అధికారిక సమాచారం ఏదీ లేదు. మే 26న రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు బజ్ క్రియేటైంది. జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు.

IPL_Entry_Point