2018 Telugu Trailer: 2018 తెలుగు ట్రైలర్ రిలీజ్‌- థియేట‌ర్ల‌లో గూస్‌బంప్స్ ఖాయ‌మే-tovino thomas survival thriller 2018 telugu trailer out now ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tovino Thomas Survival Thriller 2018 Telugu Trailer Out Now

2018 Telugu Trailer: 2018 తెలుగు ట్రైలర్ రిలీజ్‌- థియేట‌ర్ల‌లో గూస్‌బంప్స్ ఖాయ‌మే

HT Telugu Desk HT Telugu
May 22, 2023 11:56 AM IST

2018 Telugu Trailer: మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 2018 మే 26న అదే పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు.

 2018 మూవీ
2018 మూవీ

2018 Telugu Trailer: ఈ ఏడాది మ‌ల‌యాళంలో హ‌య్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా 2018 నిలిచింది. 13 రోజుల్లోనే ఈ సినిమా 115 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. 2018 మూవీ అదే పేరుతో తెలుగులో మే 26న రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో ఈ సినిమాను బ‌న్నీ వాస్ రిలీజ్ చేస్తోన్నారు.

తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు. ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా ఇడుక్కి డ్యామ్ ఓపెన్ చేయ‌డంతో వ‌ర‌ద‌ల కార‌ణంగా కొంద‌రి జీవితాలు ఎలా అత‌లాకుత‌లం అయ్యాయ‌నే పాయింట్ ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా సాగింది. ఇందులో మిల‌ట్రీ నుంచి భ‌యంతో బ‌య‌ట‌కు వ‌చ్చిన వ్య‌క్తిగా టోవినో థామ‌స్ క‌నిపిస్తోన్నాడు. త‌న భార్య‌తో స‌మ‌స్య‌లు ఉన్న వ్య‌క్తిగా వినీత్ శ్రీనివాస‌న్ న‌టించాడు.

వ‌ర‌ద ముప్పు నుంచి ప్రాణాల‌తో కొంద‌రు ఎలాంటి పోరాటం సాగించారు. వ‌ర‌ద‌ల కార‌ణంగా తాగ‌డానికి నీరు కూడా లేక ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డార‌న్న‌ది ట్రైల‌ర్‌లో ఎమోష‌న‌ల్‌గా చూపించారు. వ‌ర‌ద‌ల కార‌ణంగా ఇళ్లు మొత్తం కొట్టుకుపోయి కేవ‌లం శిథిలాలు మాత్ర‌మే మిగిలే సీన్‌తో ట్రైల‌ర్ ముగియ‌డం ఉత్కంఠ‌ను పంచుతోంది. ఈ ట్రైల‌ర్ ఇంటెన్స్‌గా సాగింది.

2018 సినిమాలో టోవినో థామ‌స్‌, కుంచ‌కోబోబ‌న్‌, వినీత్ శ్రీనివాస‌న్‌, అప‌ర్ణ బాల‌మురళితోపాటు ప‌లువురు మ‌ల‌యాళ‌, త‌మిళ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు. 2018లో కేర‌ళ‌లో సంబంధించి వ‌ర‌దల నేప‌థ్యంలో వాస్త‌వ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీ తెర‌కెక్కింది. తెలుగుతో పాటు త‌మిళంలో మే 26న ఈ సినిమా రిలీజ్ కాబోతున్న‌ది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.