Mammootty- Mohanlal: మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహాద్ ఫాజిల్ కలయికలో ఆంథాలజీ సినిమా-mammootty mohanlal and fahadh faasil to join hands for anthology movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mammootty- Mohanlal: మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహాద్ ఫాజిల్ కలయికలో ఆంథాలజీ సినిమా

Mammootty- Mohanlal: మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహాద్ ఫాజిల్ కలయికలో ఆంథాలజీ సినిమా

HT Telugu Desk HT Telugu
Aug 28, 2022 02:51 PM IST

Mammootty- Mohanlal:పదిహేనేళ్లు సుదీర్ఘ విరామం తర్వాత మలయాళ అగ్ర హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానున్న ఆ సినిమా ఏదంటే...

<p>మమ్ముట్టి, మోహన్ లాల్</p>
మమ్ముట్టి, మోహన్ లాల్ (twitter)

Mammootty- Mohanlal: సుదీర్ఘ విరామం తర్వాత మ‌ల‌యాళ లెజెండ‌రీ హీరోలు మోహ‌న్‌లాల్‌, మ‌మ్ముట్టి క‌లిసి న‌టించ‌బోతున్నారు. వీరిద్ద‌రు కలయికలో గ‌తంలో యాభైకిపైగా సినిమాలు వచ్చాయి. 2008లో రూపొందిన ట్వంటీ సినిమా త‌ర్వాత మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్ కలిసి సినిమా చేయలేదు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత మోహన్ లాల్, మమ్ముట్టి క‌లిసి ఓ అంథాల‌జీ సినిమాలో న‌టించ‌బోతున్నారు. ఎం.టీ వాసుదేవ‌నాయ‌ర్ షార్ట్ స్టోరీస్ ఆధారంగా మలయాళంలో ఈ అంథాలజీ సినిమా తెరకెక్కుతోంది.

yearly horoscope entry point

ఇందులో మమ్ముట్లి, మోహన్ లాల్, ఫహాద్ ఫాజిల్, బీజు మీనన్ తో పాటు పలువురు ప్రముఖ మలయాళ నటీనటులు కనిపించబోతున్నట్లు సమాచారం. ఒక్కో ఎపిసోడ్ నిడివి నలభై నిమిషాల వరకు ఉంటుందని సమాచారం. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన కడుగన్నవ ఒరు యాత్ర ఎపిసోడ్ షూటింగ్ ఇటీవల పూర్తయినట్లు సమాచారం. మరో కథలో మోహన్ లాల్, మమ్ముట్టి కలిసి కనిపిస్తారని చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ తాలూకు షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయినట్లు సమాచారం.

ఫహాద్ ఫాజిల్ ఎపిసోడ్ కు మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఈ అంథాలజీ సినిమాలోని మిగిలిన కథలకు ప్రియదర్శన్, సంతోష్ శివన్ తో పాటు పలు జాతీయ అవార్డు గ్రహీతలు డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో అపర్ణ బాలమురళి, ఇంద్రజీత్ సుకుమారన్, నడిముడి వేణు తో పలువురు నటీనటులు కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. నెట్ ఫ్లిక్స్ ద్వారా వచ్చే ఏడాది ఈ అంథాలజీ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారీ ధరకు ఈ అంథాలజీ సినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది.

Whats_app_banner