Malayalam movies ott releases: ఈవారం ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ మలయాళం సినిమాలు ఇవే-malayalam movies releasing this week turbo guruvayoor ambalanadayil nadikar in prime video netflix hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malayalam Movies Ott Releases: ఈవారం ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ మలయాళం సినిమాలు ఇవే

Malayalam movies ott releases: ఈవారం ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ మలయాళం సినిమాలు ఇవే

Hari Prasad S HT Telugu
Jun 26, 2024 12:40 PM IST

Malayalam movies ott releases: ఈ వారం మరోసారి ఓటీటీల్లో మలయాళ సినిమాల జాతర ఉండనుంది. ఒకేసారి ఐదు హిట్ సినిమాలు ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, సోనీలివ్, హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లోకి రాబోతున్నాయి.

ఈవారం ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ మలయాళం సినిమాలు ఇవే
ఈవారం ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ మలయాళం సినిమాలు ఇవే

Malayalam movies ott releases: ఈ ఏడాది మలయాళం సినిమాలు ఏ స్థాయిలో సక్సెస్ సాధించాయో మనకు తెలుసు. కామెడీ నుంచి క్రైమ్, మిస్టరీ, థ్రిల్లర్ ఇలా అన్ని జానర్ల సినిమాలు వచ్చాయి. ఈ మధ్యే థియేటర్లలో రిలీజైన కొన్ని మలయాళం మూవీస్ త్వరలోనే ఓటీటీల్లోకి వస్తున్నాయి. అందులో కొన్ని ఈ వారమే ఉండగా.. మరికొన్ని వచ్చే వారం రానున్నాయి.

మలయాళం మూవీస్ ఓటీటీ రిలీజెస్

గురువాయూర్ అంబలనడయిల్ - హాట్‌స్టార్

కేరళలో ప్రముఖ కృష్ణుడి ఆలయం ఉన్న గురువాయూర్ లో తీసిన కామెడీ మూవీ ఈ గురువాయూర్ అంబలనడయిల్. వినూ రామచంద్రన్ (బేసిల్ జోసెఫ్), ఆనందన్ (పృథ్వీరాజ్ సుకుమారన్), అతని సోదరి అంజలి చుట్టూ తిరిగే కథ ఇది. చాలా సరదాగా సాగిపోయే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అనూహ్యంగా రూ.90 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా గురువారం (జూన్ 27) నుంచి హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

నడికర్ - నెట్‌ఫ్లిక్స్

టొవినో థామస్ నటించిన మూవీ నడికర్. సక్సెస్ తలకెక్కిన ఓ స్టార్ హీరో పతనమై మళ్లీ తన స్టార్‌డమ్ ను పక్కన పెట్టి నటుడిగా పునర్జన్మ ఎత్తడం ఈ సినిమాలో చూడొచ్చు. ఈ నడికర్ మూవీ కూడా గురువారం (జూన్ 27) నుంచే నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

టర్బో - సోనీలివ్

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన టర్బో మూవీ కూడా త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. ఈ యాక్షన్ డ్రామా జులై తొలివారం నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మలయాళీ ఫ్రమ్ ఇండియా - సోనీ లివ్

ఇదొక ఎమోషనల్ కామెడీ డ్రామా. నివిన్ పాలీ నటించిన ఈ సినిమా జులై 5 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్ రావడంతో ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇవే కాకుండా ఇప్పటికే ఓటీటీల్లో ఈ ఏడాది వచ్చిన ఎన్నో హిట్ మలయాళం సినిమాలు ఉన్నాయి. మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలులాంటి సినిమాలు హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఫహాద్ ఫాజిల్ నటించిన ఆవేశం మూవీ ప్రైమ్ వీడియోలో ఉంది.

WhatsApp channel