Mahesh Babu Voice: హాలీవుడ్ సింహానికి మహేష్ బాబు డబ్బింగ్.. కుటుంబమే సర్వస్వం అన్న సూపర్ స్టార్-mahesh babu voice to mufasa character official mufasa the lion king telugu trailer release date mahesh babu comments ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu Voice: హాలీవుడ్ సింహానికి మహేష్ బాబు డబ్బింగ్.. కుటుంబమే సర్వస్వం అన్న సూపర్ స్టార్

Mahesh Babu Voice: హాలీవుడ్ సింహానికి మహేష్ బాబు డబ్బింగ్.. కుటుంబమే సర్వస్వం అన్న సూపర్ స్టార్

Sanjiv Kumar HT Telugu
Aug 21, 2024 02:05 PM IST

Mahesh Babu Voice To Mufasa: హాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన యానిమేటెడ్ సిరీస్ లయన్ కింగ్ నుంచి కొత్తగా వస్తున్న మూవీ ముఫాస. ఈ మూవీలో తండ్రి సింహం అయిన ముఫాసకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ముఫాస తెలుగు ట్రైలర్ రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు.

హాలీవుడ్ సింహానికి మహేష్ బాబు డబ్బింగ్.. కుటుంబమే సర్వస్వం అన్న సూపర్ స్టార్
హాలీవుడ్ సింహానికి మహేష్ బాబు డబ్బింగ్.. కుటుంబమే సర్వస్వం అన్న సూపర్ స్టార్

Mahesh Babu Dubbing To Mufasa Telugu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. గుంటూరు కారం సినిమా తర్వాత ఆయన నుంచి వచ్చే మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్, తెలుగు ఆడియెన్స్. ఇప్పుడు అందరి దృష్టి మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కించే మూవీపైనే ఉంది.

ఎస్ఎస్ఎంబీ 29 సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అందులో మహేష్ బాబు ఎలా ఉంటారో అనే క్యూరియాసిటీ రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చింది. అది రాజమౌళి సినిమా నుంచి కాదు. ఓ సినిమాలో ప్రధాన పాత్రకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు.

యానిమేటెడ్ సినిమాలను చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారికి వరకు చాలా ఇష్టంగా చూస్తారు. అలా వరల్డ్ వైడ్‌గా చాలా పెద్ద హిట్ అయిన యానిమేటెడ్ సిరీస్ లయన్ కింగ్. ఈ సిరీస్ నుంచి త్వరలో రాబోతున్న కొత్త సినిమానే ముఫాస. ఈ సినిమాను ఇండియాలో భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇండియాలో స్టార్ సెలబ్రిటీలతో మూవీలోని మెయిన్ లీడ్ రోల్‌కు వాయిస్ ఇప్పిస్తున్నారు.

ముఫాసలో తండ్రి సింహం అయిన ముఫాస పాత్రకు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పనున్నారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్. మహేష్ బాబు వాయిస్ ఓవర్‌తో ఉన్న ముఫాస తెలుగు ట్రైలర్‌ను ఆగస్ట్ 26న ఉదయం 11. 07 గంటలకు విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ తెలిపారు. దీంతో ఆ ట్రైలర్ కోసం అభిమానులు, తెలుగు ఆడియెన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక "ముఫాస: ది లయన్ కింగ్" సినిమా డిసెంబర్ 20న వరల్డ్ వైడ్‌గా ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో భారీగా రిలీజ్ చేయనున్నారు. ఇదివరకే విడుదలైన ముఫాస ఇంగ్లీష్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఫాస పాత్రకు హిందీలో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ వాయిస్ ఇస్తున్నారు. అలాగే తెలుగులో మహేష్ బాబు డబ్బింగ్ చెబుతున్నారు.

ముఫాస సింహానికి వాయిస్ ఇస్తున్న మహేశ్ బాబుకు వాల్డ్ డిస్నీ సంస్థ భారీ రెమ్యునరేషన్ ముట్టజెప్పిందని రూమర్స్ వస్తున్నాయి. వాటిలో ఎంతనిజముందో తెలియదు. అయితే, మహేష్ బాబు ఇదివరకు పవన్ కల్యాణ్ జల్సా, జూనియర్ ఎన్టీఆర్ బాద్‌షా సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఇచ్చారు. కానీ, తొలిసారి ఓ పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు మహేష్ బాబు.

ముఫాస పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పడంపై మహేష్ బాబు మాట్లాడుతూ.. "డిస్నీ అందించే ఎంటర్టైన్‌మెంట్, స్టోరీలు చెప్పే విధానం, లెగసీ పాత్రలను అందించే తీరు నన్ను మంత్రముగ్దుడుని చేస్తాయి. ముఫాస పాత్ర ఓ మంచి తండ్రి. అటవీ సామ్రాజ్యంలో తన పిల్లకు మార్గదర్శిగా నిలిచే విధానం నన్ను ఆకట్టుకుంది. నాకు కూడా ఫ్యామిలీనే సర్వస్వం" అని అన్నారు.

"ముఫాస సినిమాకు డిస్నీతో అనుబంధం ఏర్పడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం నా పిల్లలకు కూడా సంతోషంగా ఉంది. డిసెంబర్ 20న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా విడుదల అవుతోంది. నేను డబ్బింగ్ చెప్పిన ముఫాస అందరిని మెప్పిస్తుందని అనుకుంటున్నాను" అని మహేష్ బాబు తెలిపారు.