Top Animated Movies on OTT: ఓటీటీల్లో మీ పిల్లలతో కలిసి కచ్చితంగా చూడాల్సిన యానిమేటెడ్ మూవీస్ ఇవే-must watch top animated movies on ott netflix prime video disney plus hotstar the boss baby despicable me the lion king ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Top Animated Movies On Ott: ఓటీటీల్లో మీ పిల్లలతో కలిసి కచ్చితంగా చూడాల్సిన యానిమేటెడ్ మూవీస్ ఇవే

Top Animated Movies on OTT: ఓటీటీల్లో మీ పిల్లలతో కలిసి కచ్చితంగా చూడాల్సిన యానిమేటెడ్ మూవీస్ ఇవే

Hari Prasad S HT Telugu
Apr 25, 2024 08:41 AM IST

Top Animated Movies on OTT: ఓటీటీల్లో సరదాగా సాగిపోయే యానిమేటెడ్ మూవీస్ కూడా చాలానే ఉన్నాయి. ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో మీ పిల్లలతో కలిసి ఈ సినిమాలను చూడొచ్చు.

ఓటీటీల్లో మీ పిల్లలతో కలిసి కచ్చితంగా చూడాల్సిన యానిమేటెడ్ మూవీస్ ఇవే
ఓటీటీల్లో మీ పిల్లలతో కలిసి కచ్చితంగా చూడాల్సిన యానిమేటెడ్ మూవీస్ ఇవే

Top Animated Movies on OTT: సమ్మర్ హాలిడేస్ (summer holidays) వచ్చేశాయి. మధ్యాహ్నం సమయంలో పిల్లలను బయటకు పంపకుండా ఓటీటీల్లోని ఈ యానిమేటెడ్ మూవీస్ వాళ్లకు చూపించండి. వాళ్లతో కలిసి మీరూ చూసేయండి. కాసేపు సరదాగా నవ్వుకోవడానికి యానిమేటెడ్ మూవీస్ కంటే బెస్ట్ ఛాయిస్ ఏముంటుంది చెప్పండి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కలిసి చూసే టాప్ యానిమేటెడ్ మూవీస్ లిస్ట్ ఇదే.

ఓటీటీల్లోని టాప్ యానిమేటెడ్ మూవీ ఇవే

ఓటీటీలు వచ్చిన తర్వాత సెన్సార్ పక్కకు పోయింది. బూతు కంటెంట్ నట్టింటికి చేరింది. ఇలాంటి కంటెంట్ మీ పిల్లల కంట పడకుండా వారి కోసమే రూపొందించిన యానిమేటెడ్ సినిమాలు బెస్ట్ ఛాయిస్ గా చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో ఉన్న ఈ మూవీస్ సమ్మర్ హాలిడేస్ లో చూడండి.

ఇన్‌సైడ్ ఔట్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ఇన్‌సైడ్ ఔట్ 2015లో వచ్చిన ఓ ఫ్యామిలీ మూవీ. యానిమేటెడ్ మూవీయే అయినా ఓ ఫ్యామిలీలో ఉండే అన్ని ఎమోషన్స్ ఇందులోనూ ఉంటాయి. పిల్లలతో కలిసి తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో చూడొచ్చు.

ది బాస్ బేబీ - అమెజాన్ ప్రైమ్

బెస్ట్ యానిమేటెడ్ మూవీస్ లో ది బాస్ బేబీ కూడా ఒకటి. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. అలెక్ బాల్డ్‌విన్ అనే బాస్ బేబీ క్యారెక్టర్, అతని మేనరిజాలు బాగా నవ్విస్తాయి. సినిమా అంతా సరదాగా సాగిపోతుంది.

డెస్పికబుల్ మి - నెట్‌ఫ్లిక్స్

14 ఏళ్ల కిందట రిలీజైన డెస్పికబుల్ మి మూవీ ఇప్పటికే యానిమేటెడ్ మూవీ లవర్స్ ను అలరిస్తూనే ఉంది. ఈ మూవీ సీక్వెల్స్ తర్వాత ఎన్నో రిలీజైనా.. ఈ తొలి పార్ట్ మాత్రం బాగా ఆకట్టుకుంది. చంద్రుడిని దొంగిలించాలని చూసే గ్రు అనే సైంటిస్టు చుట్టూ తిరిగే కథ ఇది. నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ చూడొచ్చు.

అప్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

కార్ల్ ఫ్రెడ్రిక్సన్ అనే ఓ బెలూన్లు అమ్మే వ్యక్తి ఇల్లు అదే బెలూన్ల సాయంతో ఎగిరి సౌత్ అమెరికాకు వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ అప్ మూవీ స్టోరీ. ఈ క్లాసిక్ యానిమేటెడ్ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది.

ది లయన్ కింగ్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

1994లో డిస్నీ అందించిన క్లాసిక్ యానిమేషన్ మూవీ ది లయన్ కింగ్. 2019లో ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింబా అనే ఓ సింహం చుట్టూ తిరిగే స్టోరీ ఇది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో చూడొచ్చు.

ఇవే కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలోని ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ పెట్స్, మినియన్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోని కొకొ, మొవానా, సిండ్రెల్లాలాంటి టాప్ యానిమేటెడ్ సినిమాలను ఈ సమ్మర్ హాలిడేస్ లో చూసి ఎంజాయ్ చేయండి.

IPL_Entry_Point