Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో దుమ్ము రేపుతున్న తెలుగు హారర్ కామెడీ మూవీ.. టాప్ ట్రెండింగ్ మూవీస్ ఇవే-amazon prime video top trending movies telugu horror comedy om bheem bush in second place see the full list ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో దుమ్ము రేపుతున్న తెలుగు హారర్ కామెడీ మూవీ.. టాప్ ట్రెండింగ్ మూవీస్ ఇవే

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో దుమ్ము రేపుతున్న తెలుగు హారర్ కామెడీ మూవీ.. టాప్ ట్రెండింగ్ మూవీస్ ఇవే

Hari Prasad S HT Telugu

Prime Video Top Trending Movies: అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్ మూవీస్ లో తెలుగు హారర్ కామెడీ మూవీ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ఇండియాలో రెండో స్థానంలో ఉండటం విశేషం.

ప్రైమ్ వీడియోలో దుమ్ము రేపుతున్న తెలుగు హారర్ కామెడీ మూవీ.. టాప్ ట్రెండింగ్ మూవీస్ ఇవే

Prime Video Top Trending Movies: థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే ప్రైమ్ వీడియోలోకి వచ్చిన తెలుగు హారర్ కామెడీ మూవీ ఓం భీమ్ బుష్.. ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. ఇప్పటికే ఈ ఓటీటీ టాప్ ట్రెండింగ్ మూవీస్ జాబితాలో రెండోస్థానంలో ఉండటం విశేషం. ఇక ఇండియాలో ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ ఏవో ఒకసారి చూద్దాం.

ప్రైమ్ వీడియోలో ఓం భీమ్ బుష్ దూకుడు

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓం భీమ్ బుష్ మూవీ దూసుకెళ్తోంది. థియేటర్లలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన ఈ హారర్ కామెడీ.. ప్రస్తుతం ప్రైమ్ వీడియో టాప్ ట్రెండింగ్ మూవీస్ లో రెండో స్థానంలో ఉంది. ఏప్రిల్ 12 నుంచి ఈ ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

తొలి రోజు నుంచే టాప్ ట్రెండింగ్ లిస్టులోకి వెళ్లిన ఈ సినిమా అలాగే కొనసాగుతోంది. మార్చి 22న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇందులోని లాజిక్ లేని కామెడీని ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేశారు. ఇండియాలో టాప్ ట్రెండిండ్ ప్రైమ్ వీడియో సినిమాల్లో తొలి రోజు నుంచే ఈ మూవీ రెండో స్థానంలో కొనసాగుతూ వస్తోంది.

ఈ టాప్ ట్రెండింగ్స్ లో మరో తెలుగు కామెడీ మూవీ చారి 111 కూడా ఉంది. వెన్నెల కిశోర్ నటించిన ఈ మూవీ 9వ స్థానంలో కొనసాగుతోంది.

ప్రైమ్ వీడియో టాప్ ట్రెండింగ్ మూవీస్ ఇవే

1. తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా - హిందీ మూవీ

2. ఓం భీమ్ బుష్

3. జే బేబీ - తమిళ డ్రామా

4. అంచక్కల్లకోక్కన్ - మలయాళ సస్పెన్స్ మూవీ

5. జోరమ్ - హిందీ సర్వైవల్ థ్రిల్లర్

6. రణం - తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ

7. యాత్ర 2 - తెలుగు పొలిటికల్ డ్రామా

8. 777 ఛార్లీ - హిందీలో డబ్ అయిన కన్నడ మూవీ

9. చారి 111 - తెలుగు కామెడీ మూవీ

10. మజిల్ - ఇంగ్లిష్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ

ప్రైమ్ వీడియో టాప్ ట్రెండింగ్ వెబ్ సిరీస్

1. ఫాలౌట్ - ఇంగ్లిష్ యాక్షన్ అడ్వెంచర్ సిరీస్

2. ఇన్స్‌పెక్టర్ రిషి - హారర్ సస్పెన్స్

3. యంగ్ షెల్డన్ - కామెడీ సిరీస్

4. మ్యారీ మై హజ్బెండ్ - కొరియన్ కామెడీ డ్రామా

5. ఫర్జీ - హిందీ సస్పెన్స్ సిరీస్

6. మీర్జాపూర్ - హిందీ క్రైమ్ థ్రిల్లర్

7. పంచాయత్ - హిందీ కామెడీ డ్రామా

8. ది ఫ్యామిలీ మ్యాన్ - హిందీ యాక్షన్ సిరీస్

9. ఇండియన్ పోలీస్ ఫోర్స్ - హిందీ యాక్షన్ సిరీస్

10. పోచర్ - హిందీ సస్పెన్స్ డ్రామా