Ashok Galla: హనుమాన్‌లా దేవుడుని చూపించం.. మురారి షేడ్స్ కనిపించవు: మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా-mahesh babu nephew ashok galla comments on devaki nandana vasudeva movie comparison with murari prashanth varma hanu man ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ashok Galla: హనుమాన్‌లా దేవుడుని చూపించం.. మురారి షేడ్స్ కనిపించవు: మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా

Ashok Galla: హనుమాన్‌లా దేవుడుని చూపించం.. మురారి షేడ్స్ కనిపించవు: మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా

Sanjiv Kumar HT Telugu
Nov 22, 2024 01:03 PM IST

Ashok Galla About Devaki Nandana Vasudeva Movie: మహేశ్ బాబు మేనల్లుడు హీరో అశోక్ గల్లా నటించిన రెండో సినిమా దేవకీ నందన వాసుదేవ. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ విడుదల అయింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా దేవకీ నందన వాసుదేవ మూవీ విశేషాలను చెప్పాడు అశోక్ గల్లా.

హనుమాన్‌లా దేవుడుని చూపించం.. మురారి షేడ్స్ కనిపించవు: మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా
హనుమాన్‌లా దేవుడుని చూపించం.. మురారి షేడ్స్ కనిపించవు: మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా

Ashok Galla About Devaki Nandana Vasudeva: సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో అశోక్ గల్లా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల అశోక్ గల్లా నటించిన రెండో సినిమా దేవకీ నందన వాసుదేవ. ఈ చిత్రానికి గుణ 369తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు.

హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దేవకీ నందన వాసుదేవ సినిమాకు కథ అందించడం విశేషం. ఈ సినిమాలో అశోక్ గల్లాకు జోడీగా మానస వారణాసి హీరోయిన్‌గా చేసింది. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. 

నవంబర్ 22 అంటే ఇవాళ దేవకీ నందన వాసుదేవ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో అశోక్ గల్లా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నాడు.

నిన్న మహేష్ బాబు గారిని కలిశారు కదా. ఆ విశేషాలు చెప్పండి ?

-లైవ్ సెషన్ చేసాం. ఈ రోజు (నవంబర్ 21) ఆయన (మహేశ్ బాబు) సినిమా చూస్తున్నారు. ఆయన రెస్పాన్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాము.

ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రశాంత్ వర్మ గారు కథతో వచ్చారా? లేదా డైరెక్షన్‌తో వచ్చారా ?

-ప్రశాంత్ గారు ఫస్ట్ నుంచి కథతోనే వచ్చారు. నా దగ్గర కథ, టీమ్ ఉంది వింటావా ? అని అడిగారు. కథ విన్నాక అద్భుతంగా అనిపించింది. డైరెక్టర్ అర్జున్ గారు, నిర్మాత బాల గారు, ప్రశాంత్ గారి జర్నీ ముందు నుంచే ఉంది.

అర్జున్ గారు కథలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి?

-మెయిన్‌గా సినిమా స్కేల్ బాగా పెరిగింది. అర్జున్ గారు ఇంకా ఇంపాక్ట్‌ఫుల్‌గా చేసి ప్రాపర్ కమర్షియల్ స్టయిల్‌లో మేకింగ్ చేశారు. ప్రశాంత్ గారి టచ్‌తో బోయపాటి గారు తీస్తే ఎలా ఉంటుందో ఆ టైపులో ఉంటుంది. యాక్షన్, ఎమోషన్ అద్భుతంగా ఉంటుంది. అర్జున్ గారు, ప్రశాంత్ వర్మ కథని చాలా ఎలివేట్ చేశారు. ప్రశాంత్ వర్మ గారు అనుకున్న దానికంటే అవుట్ పుట్ బెటర్‌గా వచ్చింది. సినిమా చూసి ప్రశాంత్ వర్మ గారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు.

ఇందులో డివైన్, మైథాలజీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి?

-ఈ కథలో హను-మాన్‌లా దేవుడ్ని చూపించం. ఇందులో హీరో పేరు కృష్ణ, హీరోయిన్ పేరు సత్యభామ, విలన్ కంసరాజు.. ఇలా మైథాలజీ మెటాఫర్ ఉంటుంది. ఇందులో నా క్యారెక్టరైజేషన్ చాలా ఎట్రాక్ట్ చేసింది. కథలో ట్విస్ట్‌లు, ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటుంది. ట్రైలర్‌లో కనిపించని చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. డివైన్ ఎలిమెంట్స్‌ని అర్జున్ గారు నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లారు.

ట్రైలర్ చూసినప్పుడు మురారిలా అనిపించింది ?

-ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు మాకు మురారి ఫీలింగ్ వచ్చింది. ఆ టేకాఫ్ అలా ఉంటుంది. కానీ, మిగతా అంతా సినిమాలో మురారి షేడ్స్ కనిపించవు.

Whats_app_banner