Ram Pothineni Skanda: రామ్ పోతినేనికి డూప్‌గా డైరెక్టర్ బోయపాటి.. కారణం చెప్పిన హీరో
Ram Pothineni About Skanda Action Scene: ఉస్తాద్ రామ్ పోతినేని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమా స్కంద. ఈ సినిమాలో ఒక యాక్షన్ సీన్లో రామ్‌కు బదులు బోయపాటి శ్రీను కనిపించారు. దానికి తాజాగా రామ్ పోతినేని కారణం చెప్పాడు.
సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల రామ్ పోతినేని స్కంద సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇటీవల నవంబర్ 3 నుంచి స్కంద చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు ఒక యాక్షన్ సీన్లో రామ్ పోతినేనికి బదులుగా మూవీ డైరెక్టర్ బోయపాటి శ్రీను కనిపించారు. దీంతో ఆడియెన్స్ షాక్ అయ్యారు. అంతేకాకుండా దానికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ నెట్టింట్లో ట్రోలింగ్ కూడా చేసేశారు.
తాజాగా ఆ ట్రోలింగ్, తనకు డూప్‌గా బోయపాటి చేయడంపై తాజాగా రామ్ పోతినేని వివరణ ఇస్తూ పోస్ట్ షేర్ చేశాడు. ఆ పోస్టులో "సెప్టెంబర్ 22, 2023. ఆరోజు నాకు ఇంకా గుర్తుంది. సమ్మర్ చాలా పీక్‌లో ఉంది. ఆ కాలంలో అత్యంత వేడిగా ఉన్న రోజుల్లో సెప్టెంబర్ 22 కూడా ఒకటి. 25 రోజుల క్లైమాక్స్ షూట్లో మూడో రోజు అయ్యేసరికి నా అరికాలి పరిస్థితి ఇది. సరిగ్గా నడవడం కూడా నా వల్ల కాలేదు" అంటూ తన కాలి ఫొటోను షేర్ చేశాడు రామ్ పోతినేని.
"కొంచెం అలా పక్కకు వెళ్లి వచ్చేసరికి నా అరి కాలి నుంచి రక్తం వస్తుంది. ఆ షాట్ ఎలాగైన సరిగ్గా తీయాలనుకున్న నా డైరెక్టర్ తనే నేరుగా దిగి షూట్ చేశారు. కంటెంట్ నచ్చుతుందా లేదా అన్నది ప్రేక్షకుల ఛాయిస్. నేను వారి అభిప్రాయాలకు విలువ ఇచ్చాను. ఇకపై కూడా ఇస్తాను. ఎందుకంటే ఇదంతా మీకోసమే. కానీ, ఈ షాట్‌ను నా కోసం చేసిన నా డైరెక్టర్‌కు ధన్యవాదాలు చెబుతున్నాను" అని రామ్ పోతినేని అసలు విషయం చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.