Devara Pre-Release Event: దేవర ప్రీ-రిలీజ్‍కు మహేశ్ బాబు రానున్నారా? ఈవెంట్ ఎప్పుడంటే..-mahesh babu may attend jr ntr devara movie pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Pre-release Event: దేవర ప్రీ-రిలీజ్‍కు మహేశ్ బాబు రానున్నారా? ఈవెంట్ ఎప్పుడంటే..

Devara Pre-Release Event: దేవర ప్రీ-రిలీజ్‍కు మహేశ్ బాబు రానున్నారా? ఈవెంట్ ఎప్పుడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 14, 2024 09:39 AM IST

Devara Pre-Release Event: దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్‍పై మంచి హైప్ ఉంది. ఈ ఈవెంట్‍కు అతిథులుగా ఎవరు వస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ ఈవెంట్‍కు సూపర్ స్టార్ మహేశ్ బాబు అథితిగా వస్తారనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలు ఇవే..

Devara Pre-Release Event: దేవర ప్రీ-రిలీజ్‍కు మహేశ్ బాబు రానున్నారా? ఈవెంట్ ఎప్పుడంటే..
Devara Pre-Release Event: దేవర ప్రీ-రిలీజ్‍కు మహేశ్ బాబు రానున్నారా? ఈవెంట్ ఎప్పుడంటే..

బోలెడు అంచనాలు ఉన్న దేవర సినిమా మరో రెండు వారాల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేయనుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఈ హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో హీరోగా నటించారు. డ్యుయల్ రోల్ చేశారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. దేవర సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍పై కూడా చాలా క్యూరియాసిటీ ఉంది. ఈ ఈవెంట్‍కు అతిథులుగా ఎవరు వస్తారా అనేది ఆసక్తి రేపుతోంది. అయితే, ఈ తరుణంలో ఓ సమాచారం చక్కర్లు కొడుతోంది.

మహేశ్‍తో మాట్లాడిన కొరటాల?

దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు రావాలని మహేశ్ బాబును దర్శకుడు కొరటాల శివ అడిగారని సమాచారం చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ విషయంపై మహేశ్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మహేశ్‍కు శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలతో మంచి హిట్‍లు ఇచ్చారు కొరటాల. వీరిద్దరి మధ్య మంచి బంధం ఉంది. దీంతో దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు మహేశ్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని వినిపిస్తోంది. అలాగే, మహేశ్, ఎన్టీఆర్ మధ్య కూడా సత్సంబంధాలు ఉన్నాయి.

దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు మహేశ్ వస్తే మరింత హైప్ వచ్చేస్తుంది. అలాగే, రాజమౌళితో చిత్రం గురించి మహేశ్ ఏమైనా హింట్ ఇస్తారా అనే ఆసక్తి కూడా పెరుగుతుంది. మరి, దేవర ఈవెంట్‍కు మహేశ్ వస్తారా లేదా అనేది చూడాలి.

ఈవెంట్ ఎప్పుడు?

దేవర సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను సెప్టెంబర్ 22వ తేదీన నిర్వహించాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‍లోనే ఈ ఈవెంట్ జరగనుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్‍లో ఈవెంట్ చేయాలని అనుకున్నా.. చివరికి హైదరాబాద్‍నే ఫిక్స్ చేసినట్టు సమాచారం.

దేవర చిత్రం నుంచి ఈ వారమే ట్రైలర్ వచ్చింది. యాక్షన్ ప్యాక్డ్‌గా ఉన్న ఈ ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అంచనాలను అందుకోవడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ఎన్టీఆర్ యాక్షన్, కొరటాల టేకింగ్ ట్రైలర్‌లో ఆకట్టుకున్నాయి. అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా మెప్పించింది. దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. హిందీలోనూ ఈ మూవీని బలంగా ప్రమోట్ చేస్తోంది టీమ్. దేవర చిత్రం సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో రిలీజ్ కానుంది.

దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రంతోనే టాలీవుడ్‍లో ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‍కు కూడా ఇదే తొలి తెలుగు చిత్రంగా ఉంది. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, శృతి మరాఠే కీలకపాత్రలు పోషించారు. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో డైరెక్టర్ కొరటాల శివ పవర్‌ఫుల్ కథ రాసుకున్నారు. ఫుల్ యాక్షన్‍తో తెరకెక్కించినట్టు ట్రైలర్‌తో అర్థమవుతోంది.

దేవర మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన మూడు పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే, ట్రైలర్‌లో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ విపరీతంగా ఆకట్టుకుంది. ట్రైలర్ ఓఎస్‍టీని కూడా మేకర్స్ తీసుకొచ్చారు.