Action Adventure OTT: ఓటీటీలోకి కృతిశెట్టి మ‌ల‌యాళం యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎందులో అంటే?-krithi shetty malayalam action adventure movie arm ott platform and release date details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Action Adventure Ott: ఓటీటీలోకి కృతిశెట్టి మ‌ల‌యాళం యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎందులో అంటే?

Action Adventure OTT: ఓటీటీలోకి కృతిశెట్టి మ‌ల‌యాళం యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎందులో అంటే?

Nelki Naresh Kumar HT Telugu
Sep 30, 2024 11:43 AM IST

Action Adventure OTT: ఏఆర్ఎమ్ మూవీతో తొలి అడుగులోనే మ‌ల‌యాళంతో పెద్ద విజ‌యాన్ని ద‌క్కించుకున్న‌ది కృతి శెట్టి. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీలో టోవినో థామ‌స్ హీరోగా న‌టించాడు. న‌వంబ‌ర్ ఫ‌స్ట్‌వీక్‌లో ఈ మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

యాక్షన్ అడ్వెంచర్ ఓటీటీ
యాక్షన్ అడ్వెంచర్ ఓటీటీ

Action Adventure OTT: ఏఆర్ఎమ్ మూవీతో హీరోయిన్‌గా మ‌ల‌యాళంలో ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. టోవినో థామ‌స్ హీరోగా యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌న‌క వ‌ర్షం కురిపిస్తోంది. కేవ‌లం 30 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ వంద కోట్ల‌కుపైనే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

తెలుగులో కూడా రిలీజ్‌...

అజ‌యాంతే రాండ‌మ్ మోష‌న‌మ్ టైటిల్‌ను ఏఆర్ఎమ్‌గా కుదిస్తూ మేక‌ర్స్ ఈ మూవీని రిలీజ్ చేశారు. టుడీతో పాటు త్రీడీ వెర్ష‌న్‌లో మ‌ల‌యాళంతో పాటు క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏఆర్ఎమ్ రిలీజైంది. మ‌ల‌యాళం ప్రేక్ష‌కుల్ని అల‌రించిన ఈ మూవీ మిగిలిన భాష‌ల్లో బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది.

రెండు నెల‌ల త‌ర్వాతే ఓటీటీలోకి...

ఏఆర్ఎమ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడ‌న్న‌ది ఆడియెన్స్‌లో ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్, రిలీజ్ డేట్ విష‌యంలో మూవీ మేక‌ర్స్ ఆచితూచి అడుగులు వేస్తోన్నారు. థియేట‌ర్ల‌లో రిలీజైన నెలన్న‌ర నుంచి రెండు నెల‌ల త‌ర్వాతే ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని భావిస్తోన్న‌ట్లు తెలిసింది.

సోనీలివ్ వ‌ర్సెస్ నెట్‌ఫ్లిక్స్‌...

ఈ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ మూవీ ఓటీటీ హ‌క్కుల కోసం నెట్‌ఫ్లిక్స్‌తో పాటు సోనీలివ్ పోటీప‌డుతోన్న‌ట్లు తెలిసింది. మ‌రో రెండు, మూడు రోజుల్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఓ క్లారిటీ రానున్న‌ట్లు తెలిసింది. న‌వంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో ఏఆర్ఎమ్ ఓటీటీలోకి రానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఓటీటీలో మ‌ల‌యాళంతో పాటు మిగిలిన ద‌క్షిణాది భాష‌ల్లో ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది.

ఏఆర్ఎమ్ క‌థ ఇదే...

ఏఆర్ ఎమ్ మూవీలో టోవినో థామ‌స్ ట్రిపుల్ రోల్‌లో క‌నిపించాడు. అజ‌య‌న్ (టోవినో థామ‌స్‌_ ఎల‌క్ట్రీషియ‌న్‌గా ప‌నిచేస్తూ బ‌తుకుతుంటాడు. అజ‌య్ తాత మ‌ణియ‌న్ (టోవినో థామ‌స్‌) దొంగ కావ‌డంతో అజ‌య‌న్‌కు ప‌ని ఇవ్వ‌డానికి ఊరివాళ్లు సంకోచిస్తుంటారు. అత‌డిని దొంగ‌గా అనుమానిస్తుంటారు. ఊరి గుడిలో ఉన్నకోట్ల విలువైన శ్రీభూతి దీపాన్ని దొంగించాల‌ని సుదేవ్‌వ‌ర్మ (హ‌రీష్ ఉత్త‌మ‌న్‌) ప్లాన్‌చేస్తాడు.

ఆ దొంగ‌తానాన్ని అజ‌య్‌పై నెట్టివేసి తాను త‌ప్పించుకోవాల‌ని అనుకుంటాడు. సుదేవ్ వ‌ర్మ ప్లాన్‌ను అజయ‌న్ ఎలా తెప్పికొట్టాడు. ఆ దీపానికి కుంజికేలుడు (టోవిన్ థామ‌స్‌) అనే యోధుడికి ఉన్న సంబంధం ఏమిటి? త‌న ఊరికే చెందిన గొప్పింటి అమ్మాయి ల‌క్ష్మిని ప్రేమించిన అజ‌య్ ఆమెను పెళ్లిచేసుకున్నాడా? అన్న‌దే అన్న‌దే ఏఆర్ ఎమ్ మూవీ క‌థ‌.

ఎనిమిదో మూవీ...

మూడు కాలాల వ్య‌వ‌ధుల్లో ద‌ర్శ‌కుడు జితిన్ లాల్ ఏఆర్ఎమ్ మూవీని తెర‌కెక్కించాడు. ఈ ఏడాది మ‌ల‌యాళంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఎనిమిదో మూవీగా ఏఆర్ ఎమ్ నిలిచింది.