OTT Telugu Web Series: ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చిన కొణిదెల నిహారిక తెలుగు వెబ్ సిరీస్.. ఏడు భాషల్లో స్ట్రీమింగ్-konidela niharika comedy web series bench life streaming on sony liv ott platform in 7 languages ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Web Series: ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చిన కొణిదెల నిహారిక తెలుగు వెబ్ సిరీస్.. ఏడు భాషల్లో స్ట్రీమింగ్

OTT Telugu Web Series: ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చిన కొణిదెల నిహారిక తెలుగు వెబ్ సిరీస్.. ఏడు భాషల్లో స్ట్రీమింగ్

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 11, 2024 09:37 PM IST

OTT Telugu Web Series: బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ సిరీస్‍కు కొణిదెల నిహారిక నిర్మాతగా వ్యవహరించారు. ఈ సిరీస్ మొత్తంగా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. బెంచ్‍లో ఉన్న ముగ్గురు ఐటీ ఉద్యోగుల చుట్టూ ఈ సిరీస్ స్టోరీ ఉంటుంది. ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమ్ అవుతోందంటే..

OTT Telugu Web Series: ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చిన కొణిదెల నిహారిక తెలుగు వెబ్ సిరీస్.. ఏడు భాషల్లో స్ట్రీమింగ్
OTT Telugu Web Series: ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చిన కొణిదెల నిహారిక తెలుగు వెబ్ సిరీస్.. ఏడు భాషల్లో స్ట్రీమింగ్

మెగా డాటర్ కొణిదెల నిహారిక నిర్మాతగా ‘బెంచ్ లైఫ్’ వెబ్ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్‍లో వైభవ్, చరణ్ పేరి, రితికా సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ కామెడీ డ్రామా సిరీస్‍కు మానసా శర్మ దర్శకత్వం వహించారు. బెంచ్‍లో ఉండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల గురించి ఈ సిరీస్ తెరకెక్కింది. బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.

స్ట్రీమింగ్ ఎక్కడంటే..

బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు (సెప్టెంబర్ 11) స్ట్రీమింగ్‍కు వచ్చింది. సెప్టెంబర్ 12న ఈ సిరీస్ వస్తుందని సోనీలివ్ గతంలో వెల్లడించింది. అయితే, ఒకరోజు ముందుగానే స్ట్రీమింగ్‍కు తెచ్చేసింది. ఈ సిరీస్‍లో ఐదు ఎపిసోడ్లు ఉన్నాయి.

ఏడు భాషల్లో..

బెంచ్‍లైఫ్ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠి భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. తెలుగులో రూపొందిన ఈ సిరీస్ మరో ఆరు భాషల డబ్బింగ్‍లో అందుబాటులోకి వచ్చింది. ఐటీ ఉద్యోగుల గురించి కావటంతో యూత్‍కు ఈ సిరీస్ బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

బెంచ్‍లైఫ్ సిరీస్‍ను డైరెక్టర్ మానస శర్మ తెరకెక్కించారు. ఈ సిరీస్‍లో వైభవ్, చరణ్, రితికాతో పాటు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, అకాంక్ష సింగ్, నయన్ సారిక, వెంకటేశ్ కాకుమాను, తనికెళ్ల భరణి కీలకపాత్రలు పోషించారు. నిహారిక కొణిదెల ఈ సిరీస్‍ను నిర్మించారు. పీకే దండి సంగీతం అందించిన ఈ సిరీస్‍కు.. ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ చేశారు.

స్టోరీలైన్

బాలు (వైభవ్), రవి (చరణ్), మీనాక్షి (రతికా సింగ్) తాము ఉద్యోగం చేస్తున్న ఐటీ కంపెనీలో బెంచ్‍లోకి వెళతారు. దీంతో పని ఏమీ లేకపోవటంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఆఫీస్‍లో ఓ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు బాలు. రవికి అప్పటికే పెళ్లయి ఫ్యామిలీతో కష్టం అని భావిస్తుంటాడు. బెంచ్‍లో ఉండటంతో బాలు, రవి, మీనాక్షి సరదాగా తిరుగుతుంటారు. అయితే కంపెనీకి ఆర్థిక కష్టాలు రావటంతో వీరి ఉద్యోగాలు పోయే పరిస్థితి వస్తుంది. మరి ఈ పరిస్థితి నుంచి వాళ్లు ఎలా బయపడ్డారనేది బెంచ్‍లైఫ్ సిరీస్‍లో ఉంటుంది. కామెడీ ప్రధానంగానే ఈ సిరీస్ సాగుతుంది.

నిహారిక ‘కమిటీ కుర్రోళ్ళు’ ఓటీటీలోకి రేపే

కొణిదెల నిహారిక నిర్మించిన రూరల్ కామెడీ మూవీ ‘కమిటీ కుర్రోళ్ళు’ బ్లాక్‍బస్టర్ అయింది. రూ.5కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ సినిమా సుమారు రూ.17కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. నిర్మాతగా తొలి చిత్రంతోనే మంచి సక్సెస్ సాధించారు నిహారిక. కమిటీ కుర్రోళ్ళు సినిమా రేపే (సెప్టెంబర్ 12) ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.

కమిటీ కుర్రోళ్ళు చిత్రంలో సందీప్ సరోజ్, ప్రసాద్ బెహరా, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, మణికంఠ పరసు, ఈశ్వర్ రాచిరాజు, లోకేశ్ కుమార్, రఘువరన్ కీలకపాత్రలు పోషించారు. ఎక్కువ శాతం కొత్త నటీనటులే ఉన్న ఈ తక్కువ బడ్జెట్ చిత్రం మంచి కలెక్షన్లతో అదరగొట్టింది. ఈ మూవీకి యధు వంశీ దర్శకత్వం వహించారు.