OTT Telugu Comedy Series: నిహారిక ప్రొడ్యూజర్‌గా ‘బెంచ్ లైఫ్’ సిరీస్.. కామెడీతో అదిరిన ట్రైలర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Bench life OTT Release date: బెంచ్ లైఫ్ తెలుగు వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేంది. సాఫ్ట్‌వేర్ ఆఫీస్‍లో బెంచ్‍లో ఉన్న ఉద్యోగులపై ఈ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ ట్రైలర్ నేడు వచ్చేసింది. స్ట్రీమింగ్ డేట్ కూడా రివీల్ అయింది.
ఐటీ ఇండస్ట్రీలోని కంపెనీలో ఏ ప్రాజెక్టులో లేని ఉద్యోగులను బెంచ్‍లో ఉన్నట్టుగా పరిగణిస్తారు. ఈ బెంచ్ లైఫ్‍పై చాలా జోక్‍లు కూడా వస్తుంటాయి. అయితే, ఐటీ ఫీల్డ్‌లో బెంచ్‍లో ఉన్న ఉద్యోగుల లైఫ్‍పై ఇప్పుడు ఏకంగా తెలుగులో వెబ్ సిరీస్ వస్తోంది. ‘బెంచ్ లైఫ్’ పేరుతో ఈ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్‍లో వైభవ్, చరణ్ పేరి, రితికా సింగ్, ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్‍ను మెగా డాటర్ కొణిదెల నిహారిక నిర్మించారు. బెంచ్ లైఫ్ సిరీస్ ట్రైలర్ నేడు (ఆగస్టు 26) వచ్చేసింది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయింది.
ట్రైలర్ ఇలా..
తమకు ఆఫీస్‍లో బెంచ్ వచ్చిందని వైభవ్, చరణ్ పేరి, రితికా సింగ్ సంతోషపడటంతో బెంచ్ లైఫ్ ట్రైలర్ షురూ అయింది. “బెంచ్ అంటే జోక్ కాదు, బెంచ్‍లో ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో తెలుసా” అని వైభవ్ చెప్పే డైలాగ్ ఉంది. ఆ తర్వాత బెంచ్‍లో ఉండే ఈ ముగ్గురు అఫీస్‍లో ఖాళీగా తిరుగుతంటారు. ఓ అమ్మాయిని ప్రేమలో పడేసే పనిలో పడతాడు వైభవ్.
ఖాళీగా ఉండటంతో అపార్ట్‌మెంట్‍లో రితికా సింగ్ చిన్నచిన్న దొంగతనాలు చేస్తుంటుంది. బెంచ్ వచ్చినందుకు గోవా వెళ్లే ప్లాన్ వేస్తాడు చరణ్ పేరి. అతడికి అప్పటికే పెళ్లి అయి ఉంటుంది. బెంచ్‍లో ఉండి ఇంటికి వెళ్లి అతడికి భార్య పనులు చెబుతూ ఉంటుంది. ఇక ఆ ముగ్గురు పని చేసే కంపెనీ ఖర్చులు తగ్గించుకునేందుకు నిర్ణయించుకుంటుంది. దీంతో ఉద్యోగులను తొలగించే లిస్టులో ఆ ముగ్గురు పేర్లు ఉంటాయి. దీంతో బెంచ్‍లో ఉన్నందుకు బాధపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సిరీస్‍లో ఉండనుంది.
బెంచ్ లైఫ్ సిరీస్‍లో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కూడా కీలకపాత్ర పోషించారు. ఆకాంక్ష సింగ్, నయన్ సారిక, వెంకటేశ్ కానుమాను, తనికెళ్ల భరణి కీరోల్స్ చేశారు.
బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్‍కు మానసా శర్మ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‍కు ఎక్కువ శాతం కామెడీతోనే తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. ఐటీ ఉద్యోగుల పరిస్థితులను రియలస్టిక్‍గా చూపించే ప్రయత్నం చేసినట్టు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. చాలా మందికి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కావటంతో ఈ సిరీస్‍కు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.
బెంచ్ లైఫ్ స్ట్రీమింగ్ డేట్
బెంచ్‍లైఫ్ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 12వ తేదీన సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ట్రైలర్‌తో పాటే స్ట్రీమింగ్ డేట్‍ను ఆ ఓటీటీ వెల్లడించింది.
‘బెంచ్ లైఫ్’ వెబ్ సిరీస్‍ను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నిహారిక కొణిదెల నిర్మించారు. పీకే దండి ఈ సిరీస్‍కు సంగీతం అందించగా.. ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ చేశారు.
నిర్మాతగా తన తొలి చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ నిహారిక ఇటీవల బ్లాక్‍బస్టర్ సాధించారు. ఈ రూరల్ కామెడీ డ్రామా సినిమా ఆగస్టు 9న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్‍తో అదరగొట్టింది. మంచి కలెక్షన్లను సాధిస్తోంది. తక్కువ బడ్జెత్‍తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.15కోట్లకు పైగా వసూళ్లతో సూపర్ హిట్‍గా నిలిచింది. ఇప్పుడు, నిహారిక నిర్మాణంలో బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో సెప్టెంబర్ 12న వస్తోంది.