Kirak Boys Khiladi Girls: కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్ గ్రాండ్ ఫినాలే - గెస్ట్‌గా స్టార్ హీరో - విన్న‌ర్స్ ఎవ‌రంటే?-kirak boys khiladi girls grand finale date and guest fixed priyanka jain anasuya bharadwaj telugu tv shows ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kirak Boys Khiladi Girls: కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్ గ్రాండ్ ఫినాలే - గెస్ట్‌గా స్టార్ హీరో - విన్న‌ర్స్ ఎవ‌రంటే?

Kirak Boys Khiladi Girls: కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్ గ్రాండ్ ఫినాలే - గెస్ట్‌గా స్టార్ హీరో - విన్న‌ర్స్ ఎవ‌రంటే?

Nelki Naresh Kumar HT Telugu
Aug 22, 2024 04:32 PM IST

Kirak Boys Khiladi Girls: కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్ గ్రాండ్ ఫినాలే డేట్‌ను స్టార్ మా అనౌన్స్ చేసింది. ఈ గ్రాండ్ ఫినాలేకు నాని గెస్ట్‌గా రానున్నాడు. ఈ గేమ్ షో ఫ‌స్ట్ సీజ‌న్ విన్న‌ర్స్‌గా ఖిలాడీ గ‌ర్ల్స్ టీమ్ నిలిచిన‌ట్లు స‌మాచారం.

కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్
కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్

Kirak Boys Khiladi Girls: కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్ షో గ్రాండ్ ఫినాలే డేట్‌ను స్టార్ మా ఛానెల్ ప్ర‌క‌టించింది. ఆగ‌స్ట్ 24, 25 తేదీల్లో శ‌ని, ఆదివారం గ్రాండ్ ఫినాలే పోటీలు జ‌రుగ‌నున్నాయి. ఈ గ్రాండ్ ఫినాలేకు స్టార్ హీరో నాని గెస్ట్‌గా రానున్నాడు.

ప్రోమోలో అర్జున్‌, ప్రియాంక జైన్ ఛాలెంజ్‌...

గ్రాండ్ ఫినాలే తాలూకు ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో అదిరిపోయే స్టెప్పుల‌తో జ‌డ్జ్‌లు అన‌సూయ‌, శేఖ‌ర్ మాస్ట‌ర్ ఎంట్రీ ఇచ్చారు. ఏడు కొండ‌ల మీదున్న ఎంక‌న్న‌సామి మీద ఒట్టు. క‌ప్పు మా చేతులో ఉంట‌ది. క్యాష్ ఈ సూట్‌కేస్‌లో ఉంట‌ది అని అర్జున్ అంబాటి ఛాలెంజ్ చేశాడు. ప్రియాంక‌జైన్ కూడా ఇన్ని వారాలు చూసి ట్రైల‌ర్ మాత్ర‌మే..ఇప్పుడుంటుంది అస‌లైన క్లైమాక్స్ అంటూ కిరాక్ బాయ్స్‌కు ప్ర‌తిస‌వాల్ విసిరింది.

నాని ఎంట్రీ...

నాని ఎంట్రీతో ఎగ్జైట్‌మెంట్ ఆపుకోలేని సౌమ్య‌రావు అత‌డిని హ‌గ్ చేసుకున్న‌ది. నాని మ్యారీడ్ అని సౌమ్య‌రావుపై యాంక‌ర్ శ్రీముఖి సెటైర్లు వేసింది. అందుకు ప‌ర్లేదు అని సౌమ్య‌రావు జ‌వాబు ఇవ్వ‌గా...నాని కూడా నాకు ఏం ప‌ర్లేదు అని స‌మాధానం ఇవ్వ‌డం ప్రోమోలో న‌వ్వుల‌ను పంచుతోంది. గ్రాండ్ ఫినాలేలేదు...నాలుగేళ్ల కాలేజీ లైఫ్‌కు ఫేర్‌వెల్‌లా ఉంద‌ని కంటెస్టెంట్స్ సంద‌డి చూసి నాని కామెంట్స్ చేశాడు.

ఖిలాడీ గ‌ర్ల్స్ టీమ్ విన్న‌ర్స్‌...

ఈ గ్రాండ్ ఫినాలేలో ఖిలాడీ గ‌ర్ల్స్ టీమ్ విన్న‌ర్స్‌గా నిలిచిన‌ట్లు స‌మాచారం. ఫైన‌ల్‌లో కిరాక్ బాయ్స్ టీమ్‌ను ప‌లు గేమ్స్‌లో ఖిలాడీ గ‌ర్ల్స్ ఓడించిన‌ట్లు చెబుతోన్నారు. అన‌సూయ స‌పోర్ట్‌తో ఖిలాడీ గ‌ర్ల్స్ టీమ్ ఫ‌స్ట్ సీజ‌న్ క‌ప్ అందుకున్న‌ట్లు తెలిసింది. విన్న‌ర్స్‌కు నాని స్వ‌యంగా క‌ప్ అంద‌జేయ‌నున్న‌ట్లు స‌మాచారం. కిరాక్ బాయ్స్ - ఖిలాడీ గ‌ర్ల్స్ షో సెకండ్ సీజ‌న్ డేట్‌ను ఫైన‌ల్ రోజు రివీల్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

కంటెస్టెంట్స్ వీళ్లే...

కిరాక్ బాయ్స్‌...ఖిలాడీ గ‌ర్ల్స్‌లో షోలో బాయ్స్ టీమ్ నుంచి అర్జున్ అంబాటి, అమీర్ దీప్ చౌద‌రి, నిఖిల్‌, గౌత‌మ్‌, శ్రీక‌ర్‌, టేస్జీ తేజ‌, యాద‌మ‌రాజు, ర‌వితేజ‌, చైతూ, కిర‌ణ్ గౌడ కంటెస్టెంట్స్‌లో పాల్గొన్నారు. గ‌ర్ల్స్ టీమ్ నుంచి ప్రియాంక‌జైన్‌, శోభాశెట్టి, ఆయేషా, ప్రేర‌ణ‌, విష్ణుప్రియ‌, ప‌ల్ల‌వి గౌడ‌, రీతూ చౌద‌రి, సౌమ్య‌రావు, గోమ‌తి, దీపిక పాల్గొన్నారు.

అన‌సూయ రీఎంట్రీ...

రెండేళ్ల క్రితం వ‌ర‌కు తెలుగులో టాప్ యాంక‌ర్స్‌లో ఒక‌రిగా కొన‌సాగింది అన‌సూయ‌. జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షోకు దాదాపు తొమ్మిదేళ్ల పాటు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించింది. జ‌బ‌ర్ధ‌స్థ్‌తో పాటు ప‌లు టీవీ షోస్‌తో బుల్లితెర స్టార్‌గా తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అన‌సూయ. సినిమాల కార‌ణంగా రెండేళ్లుగా టీవీషోల‌కు దూరంగా ఉంటోంది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్ షోతో మ‌ళ్లీ టీవీల్లోకి రీఎంట్రీ ఇచ్చింది.

ఐదు సినిమాలు...

టాలీవుడ్‌లో నెగెటివ్‌, పాజిటివ్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ అన‌సూయ ఫుల్ బిజీగా ఉంది. గ‌త ఏడాది తెలుగులో అన‌సూయ న‌టించిన ఐదు సినిమాలు రిలీజ‌య్యాయి. మైఖేల్‌, రంగ‌మార్తండ‌, విమానం, పెద‌కాపు, ప్రేమ విమానం సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేసింది. సెకం

పుష్ప‌లో విల‌న్‌...

ప్ర‌స్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పుష్ప 2లో విల‌న్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. దాక్ష‌య‌ణిగా ఫ‌స్ట్ పార్ట్‌కు మించి సీక్వెల్‌లో అన‌సూయ విల‌నిజం ఉండనుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అన‌సూయ లీడ్ ఓల్‌లో న‌టించిన ఆరి మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ రెండు సినిమాల‌తో పాటు తెలుగులో మ‌రికొన్ని సినిమాల్లో అన‌సూయ న‌టిస్తోంది.