Sreemukhi: అజిత్ కంటే ముందు గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్ శ్రీముఖిదే - రిలీజ్‌కు నోచుకోని తెలుగు యాంక‌ర్ బోల్డ్ మూవీ-why tollywood anchor sreemukhi good bad ugly movie shelved ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sreemukhi: అజిత్ కంటే ముందు గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్ శ్రీముఖిదే - రిలీజ్‌కు నోచుకోని తెలుగు యాంక‌ర్ బోల్డ్ మూవీ

Sreemukhi: అజిత్ కంటే ముందు గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్ శ్రీముఖిదే - రిలీజ్‌కు నోచుకోని తెలుగు యాంక‌ర్ బోల్డ్ మూవీ

Nelki Naresh Kumar HT Telugu
May 21, 2024 09:44 AM IST

Sreemukhi: గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్‌తో యాంక‌ర్ శ్రీముఖి తెలుగులో ఓ బోల్డ్ ల‌వ్‌స్టోరీ మూవీ చేసింది. 2017లో షూటింగ్ పూర్త‌యిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో మాత్రం రిలీజ్ కాలేదు. కార‌ణం ఏంటంటే?

శ్రీముఖి
శ్రీముఖి

Sreemukhi: ప్ర‌స్తుతం తెలుగులో ప‌లు టీవీ షోస్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది శ్రీముఖి. టాలీవుడ్‌లో బిజీ యాంక‌ర్స్‌లో ఒక‌రిగా చెలామ‌ణి అవుతోంది. ఓ వైపు టీవీ షోస్ చేస్తూనే అడ‌పాద‌డ‌పా సినిమాల్లో క‌నిపిస్తోంది. గ‌త ఏడాది చిరంజీవి భోళా శంక‌ర్‌లో ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది శ్రీముఖి.

హీరోయిన్‌గా శ్రీముఖి...

2017లోనే శ్రీముఖి తెలుగులో హీరోయిన్‌గా ఓ సినిమా చేసింది. కానీ ఆమెకు ల‌క్ క‌లిసి రాలేదు. ఆ మూవీ షూటింగ్ పూర్త‌యినా థియేట‌ర్ల‌లో మాత్రం రిలీజ్ కాలేదు. న‌టుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇస్తూ గుడ్ బ్యాడ్ అగ్లీ పేరుతో ఓ మూవీని రూపొందించారు. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీలో శ్రీముఖి లీడ్ రోల్‌లో న‌టించింది. కాంతార కిషోర్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. గుడ్ బ్యాడ్ అగ్లీని షార్ట్ క‌ట్ చేస్తూ గూగ్లీ పేరుతో మూవీని ప్ర‌మోట్ చేశారు.

ట్రైల‌ర్ రిలీజ్‌...

2017లో ఈ చిన్న సినిమా ట్రైల‌ర్‌తో ఆడియెన్స్‌లో ఆస‌క్తిని రేకెత్తించింది. గుడ్ బ్యాడ్ అగ్లీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూనే ఈ సినిమాకు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశాడు. ఈ సినిమాపై హైప్ రావ‌డానికి బుల్లితెర‌పై శ్రీముఖికి ఉన్న క్రేజ్ కూడా ఓ కార‌ణ‌మైంది.

షూటింగ్ పూర్త‌యి ఏడేళ్లు...

గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ పూర్త‌యిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. థియేట‌ర్ల‌లో ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కానీ ఏమైందో ఏమో షూటింగ్ పూర్త‌యి ఏడేళ్లు అయినా సినిమా మాత్రం రిలీజ్‌కు నోచుకోలేదు. కానీ ఈ మూవీ ట్రైల‌ర్ మాత్రం ఇప్ప‌టికీ యూట్యూబ్‌లో క‌నిపిస్తుంది.

ఐదు నిమిషాల ట్రైల‌ర్‌...

గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైల‌ర్‌ను ఐదు నిమిషాల నిడివితో క‌ట్ చేసి అప్ప‌ట్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. కానీ ఆ ట్రెండ్ కూడా ఈ మూవీ రిలీజ్‌కు ఉప‌యోగ‌ప‌డ‌లేదు. బిజినెస్ స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోవ‌డంతోనే ఈ మూవీ రిలీజ్‌కు నోచుకోలేద‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. అలా శ్రీముఖి హీరోయిన్‌గా న‌టించిన గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ కానీ సినిమాల జాబితాలో చేరింది.

హ‌య్యెస్ట్ రెమ్యున‌రేష‌న్‌

ప్ర‌స్తుతం శ్రీముఖి తెలుగులో డ్యాన్స్ ఐకాన్‌, ఆదివారం విత్ స్టార్ మా ప‌రివారం, మిస్ట‌ర్ అండ్ మిసెస్‌తో పాటు సారంగ‌ద‌రియా టీవీ షోల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. తెలుగులో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న యాంక‌ర్స్‌లో ఒక‌రిగా శ్రీముఖి నిలిచింది.

అల్లు అర్జున్ జులాయితో ఎంట్రీ...

అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన జులాయి సినిమాతో యాక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీముఖి. నేను శైల‌జ‌, నాని జెంటిల్‌మ‌న్‌, 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలాతో పాటు ప‌లు సినిమాలు చేసింది. బుల్లితెర‌పై స్టార్‌గా తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్న శ్రీముఖి వెండితెర‌పై మాత్రం అనుకున్న స్థాయిలో పేరుప్ర‌ఖ్యాతులు సొంతం చేసుకోలేక‌పోయింది.

మామామ‌శ్చీంద్ర…

గుడ్ బ్యాడ్ అగ్లీ త‌ర్వాత చాలా కాలం త‌ర్వాత మెగాఫోన్ ప‌ట్టిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఇటీవ‌లే మామామ‌శ్చీంద్ర పేరుతో ఓ మూవీని తెర‌కెక్కించారు. సుధీర్ బాబు ట్రిపుల్ రోల్‌లో న‌టించిన ఈ ప్ర‌యోగాత్మ‌క మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్