Kalki 2898 AD OTT: ఓటీటీ రిలీజ్ ప్లాన్‍ను మార్చుకున్న కల్కి సినిమా మేకర్స్! స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే..-kalki 2898 ad ott release set to delay on amazon prime video and netflix platforms kalki ott prabhas ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2898 Ad Ott: ఓటీటీ రిలీజ్ ప్లాన్‍ను మార్చుకున్న కల్కి సినిమా మేకర్స్! స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే..

Kalki 2898 AD OTT: ఓటీటీ రిలీజ్ ప్లాన్‍ను మార్చుకున్న కల్కి సినిమా మేకర్స్! స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 30, 2024 06:53 PM IST

Kalki 2898 AD OTT: కల్కి 2898 ఏడీ సినిమా కలెక్షన్లలో దుమ్మురేపుతోంది. భారీ వసూళ్లను సాధిస్తోంది. కాగా. ఈ చిత్రం ముందుగా నిర్ణయించిన దాని కంటే ఆలస్యంగా ఓటీటీలోకి రానుందని సమాచారం బయటికి వచ్చింది.

Kalki 2898 AD OTT: ఓటీటీ రిలీజ్ ప్లాన్‍ను మార్చుకున్న కల్కి సినిమా మేకర్స్!.. ఎప్పుడు రావొచ్చంటే..
Kalki 2898 AD OTT: ఓటీటీ రిలీజ్ ప్లాన్‍ను మార్చుకున్న కల్కి సినిమా మేకర్స్!.. ఎప్పుడు రావొచ్చంటే..

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ సినిమా అంచనాలను నిలబెట్టుకొని అదరగొడుతోంది. బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతూ భారీ కలెక్షన్లను సాధిస్తోంది ఈ మైథో సైన్స్ ఫిక్షన్ చిత్రం. జూన్ 27న ఈ చిత్రం రిలీజ్ కాగా.. మూడు రోజుల్లోనే రూ.400కోట్ల వసూళ్ల మార్క్ దాటేసింది. ప్రభాస్ సహా స్టార్ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా, కల్కి 2898 ఏడీ సినిమా ఓటీటీ రిలీజ్ ప్లాన్‍ను మేకర్స్ మార్చుకున్నట్టు సమాచారం బయటికి వచ్చింది.

ఆలస్యంగా.. రెండు ఓటీటీల్లో..

కల్కి 2898 ఏడీ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. ఈ మూవీ హిందీ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ సొంతం చేసుకుంది. జూలై నెలాఖర్లోనే కల్కి చిత్రాన్ని ఓటీటీ స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని మేకర్స్ ముందుగా అనుకున్నారట. అయితే ఇప్పుడు ఆ ప్లాన్‍లో మార్పులు చేసినట్టు తెలుస్తోంది.

ఎప్పుడు రావొచ్చు?

కల్కి 2898 ఏడీ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో థియేటర్లలో లాంగ్ రన్ ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో ఓటీటీ రిలీజ్‍ను ఆలస్యం చేసేందుకు డిసైడ్ అయ్యారు. సెప్టెంబర్ రెండో వారంలో ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

కల్కి 2 ఇలా!

కల్కి 2898 ఏడీ మూవీకి సీక్వెల్ కూడా ఫిక్స్ అయింది. కల్కి 2 రానుంది. సీక్వెల్ మూవీలో లోకనాయకుడు కమల్ హాసన్‍కు ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉంటుంది. తాను ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న సీరమ్‍ను సుప్రీం యాస్కిన్ (కమల్ హాసన్) తీసుకోవడంతో కల్కి 2898 ఏడీ ముగిసింది. తనది కల్కి 2 చిత్రంలో ముఖ్యమైన పాత్ర అని కమల్ కూడా చెప్పారు. క్యామియో రోల్‍లో కనిపించిన దుల్కర్ సల్మాన్‍ కూడా సీక్వెల్‍లో ఓ కీలక పాత్రగా ఉంటుందని టాక్. దీపికా పదుకొణ్‍ది సీక్వెల్‍లోనూ మెయిన్ రోల్‍గా ఉండనుంది. భైరవ (ప్రభాస్) గురించి ఆశ్చర్యకరమైన విషయాన్ని అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) తెలుసుకోవడంతో కల్కి 2898 ఏడీ ముగిసింది. మొత్తంగా కల్కి సీక్వెల్‍కు హైప్ విపరీతంగా ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో భారీగా కలిగించింది.

కల్కి 2కు సంబంధించి 60 శాతం పూర్తయిందని నిర్మాత అశ్వినీదత్ ఇటీవల చెప్పారు. అయితే, ఇంకా కీలకమైన పోర్షన్స్ షూటింగ్ చేయాల్సి ఉందని, విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదని వెల్లడించారు.

కల్కి 2898 ఏడీ సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.415 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. అంచనాలను నిలబెట్టుకుంటూ భారీ వసూళ్లను సాధిస్తోంది. పాజిటివ్ టాక్ ఉండటంతో కలెక్షన్ల జోరు కొనసాగే అవకాశం ఉంది.

భారత పురాణాల ఆధారంగా సైన్స్ ఫిక్షన్ మూవీగా అద్బుత విజువల్స్‌తో కల్కి 2898 ఏడీ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. భారీ బడ్జెట్‍తో వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. భారత సినీ ఇండస్ట్రీని ఈ మూవీ మరోస్థాయికి తీసుకెళ్లిందంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.

WhatsApp channel