Kalki Record: అక్కడ ఆల్‍టైమ్ రికార్డు సృష్టించిన కల్కి 2898 ఏడీ సినిమా.. కొనసాగుతున్న కలెక్షన్ల హోరు
Kalki 2898 AD Collections: కల్కి 2898 ఏడీ సినిమా కలెక్షన్ల హోరు కొనసాగుతూనే ఉంది. బాక్సాఫీస్‍ను ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ షేక్ చేస్తోంది. ఈ క్రమంలో నార్త్ అమెరికాలో కల్కి సినిమా ఓ ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది.
కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కొన్ని రికార్డులను సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ మైథో సైన్స్ ఫిక్షన్ మూవీకి మొదటి నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. జూన్ 27న రిలైజన ఈ చిత్రం తొలి రోజు నుంచి భారీ వసూళ్లను సాధిస్తోంది. ఇండియాతో పాటు ఓవర్సీస్‍లోనూ కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. ఈ తరుణంలో కల్కి 2898 ఏడీ సినిమా నార్త్ ఇండియాలో ఓ ఆల్‍టైమ్ రికార్డు సృష్టించింది.
రికార్డు ఇదే..
కల్కి 2898 ఏడీ సినిమాకు నార్త్ అమెరికా (అమెరికా, కెనడా)లో మొదటి నుంచి బంపర్ కలెక్షన్లు వస్తున్నాయి. ప్రీమియర్ల నుంచే ఈ చిత్రం రికార్డుల వేట మొదలుపెట్టింది. తాజాగా ఇప్పుడు ఈ మూవీ ఓ ఆల్‍టైమ్ రికార్డు సృష్టించింది. నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన భారతీయ మూవీగా కల్కి చరిత్ర నెలకొల్పింది. ఈ విషయాన్ని డిస్ట్రిబ్యూషన్ సంస్థ అధికారికంగా వెల్లడించింది.
నార్త్ అమెరికాలో 5 రోజుల్లోనే 12 మిలియన్ డాలర్ల (సుమారు రూ.100కోట్లు) మార్కును కల్కి 2898 ఏడీ సినిమా దాటేసింది. దీంతో అక్కడ ఫాస్టెస్ట్ 12 మిలియన్ డాలర్స్ సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. ఇంకా కల్కి జోరు విపరీతంగా కొనసాగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా..
కల్కి 2898 ఏడీ సినిమా జోరు అంతటా కొనసాగుతోంది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లో సుమారు రూ.625 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. రిలీజైన ప్రతీ చోట ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలో హిందీలోనూ కళ్లు చెదిరే కలెక్షన్లను దక్కించుకుంటోంది. పాజిటివ్ టాక్ ఉండటంతో ఈ చిత్రానికి లాంగ్ రన్ ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్‍తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ క్లైమాక్స్ అద్భుతంగా ఉండటంతో పాటు ప్రేక్షకులకు చాలా ఆసక్తిని మిగిల్చింది. దీంతో సీక్వెల్‍గా రానున్న కల్కి 2పై అంచనాలు మరింత భారీగా ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో శోభన, దిశా పటానీ, సస్వత ఛటర్జీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి కీరోల్స్ చేశారు. అర్జునుడిగా క్యామియో రోల్‍లో విజయ్ దేవరకొండ కనిపించారు. ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్ కూడా క్యామియో పాత్రలు చేశారు.
కల్కి 2898 ఏడీ చిత్రంతో భారతీయ సినీ ఇండస్ట్రీని మరోస్థాయికి తీసుకెళ్లారని దర్శకుడు నాగ్ అశ్విన్‍పై ప్రశంసలు వస్తున్నాయి. దీంతో కల్కి సీక్వెల్‍పై ఆయనపై మరింత అంచనాల భారం ఉండనుంది. కల్కి సినిమాటిక్ యూనివర్స్ కూడా ప్రకటించారు నాగీ. కల్కి సీక్వెల్ షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తయిందని నిర్మాత అశ్వినీదత్ ఇటీవలే చెప్పారు. అయితే, కీలకమైన పోర్షన్ల షూటింగ్ ఇంకా జరగాల్సి ఉందని అన్నారు.