(1 / 7)
ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు కల్కి 2898 ఏడీలో ప్రధాన పాత్రలు పోషించిన ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ హాజరయ్యారు. రానా దగ్గుబాటి హోస్ట్ చేశారు. అయితే, ఈ ఈవెంట్‍లో ఓ సరదా విషయం జరిగింది.
(2 / 7)
గర్భిణిగా ఉన్న దీపికా పదుకొణ్ స్టేజ్ వద్ద మెట్లు దిగబోయారు. దీంతో సాయం చేసేందుకు ఆమె చేయిపట్టుకున్నారు ప్రభాస్. రానా కూడా ఆమె దగ్గరికి వెళ్లారు. దీపికకు తాను కూడా సాయం చేస్తానంటూ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ముందుకు వచ్చారు. ప్రభాస్‍ను పట్టుకున్నారు. ఇదంతా చాలా సరదాగా సాగింది. ఇలా ప్రభాస్‍ను అమితాబ్ టీజ్ చేశారు. దీపిక కూడా బాగా నవ్వారు.
(3 / 7)
దీపికకు సాయం చేసేందుకు ప్రభాస్, అమితాబ్ పోటీ పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఈ సరదా సన్నివేశం అభిమానులకు తెగనచ్చేసింది.
(4 / 7)
ఈ ఈవెంట్‍కు ఫామ్ ఫిట్టింగ్ బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చారు దీపికా పదుకొణ్. త్వరలోనే దీపిక - రణ్‍వీర్ సింగ్ తల్లిదండ్రులు కానున్నారు.
(5 / 7)
ఈవెంట్‍లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. బ్లాక్ టీషర్ట్, దానిపై బ్లాక్ షర్ట్, జీన్స్ ధరించి స్టైలిష్ లుక్‍తో దుమ్మురేపారు రెబల్ స్టార్.
(6 / 7)
బ్లాక్ ఔట్‍ఫిట్ ధరించారు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్. కల్కి 2898 ఏడీ సినిమాలో నటించడం తన అదృష్టమంటూ.. దర్శకుడు నాగ్ అశ్విన్‍ను ప్రశంసించారు.
(7 / 7)
తమిళ దిగ్గజ నటుడు, లోకనాయకుడు కమల్ హాసన్.. మోనోక్రమ్ సూట్ ధరించి రెట్రో లుక్‍లో కల్కి 2898 ఏడీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు హాజరయ్యారు. తనకు విలన్‍గా నటించడం ఇష్టమని అన్నారు. కల్కిలో తనది నెగెటివ్ రోల్ అని చెప్పారు కమల్.
ఇతర గ్యాలరీలు