Kalki 2898 AD day 5 box office collections: ఐదో రోజు తగ్గిన కల్కి 2898 ఏడీ కలెక్షన్లు.. అయినా భారీగానే..
Kalki 2898 AD day 5 box office collections: కల్కి 2898 ఏడీ మూవీ ఐదో రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు భారీగా తగ్గాయి. సోమవారం (జులై 1) కావడంతో ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా కలెక్షన్లు పడిపోయాయి.
Kalki 2898 AD day 5 box office collections: ఇండియన్ సినిమా గతంలో ఎప్పుడూ చూడని ఓ భిన్నమైన స్టోరీతో వచ్చి ఓ విజువల్ వండర్ గా నిలుస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ ఐదో రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు ఐదో రోజు తగ్గాయి. ఫస్ట్ వీకెండ్ ముగిసి సోమవారం (జులై 1) రావడంతో సగానికిపైనే కలెక్షన్లు పడిపోవడం గమనార్హం. అయినా మూవీ రేంజ్ కు తగినట్లే కాస్త మెరుగైన కలెక్షన్లే వచ్చాయి.
కల్కి 2898 ఏడీ ఐదో రోజు కలెక్షన్లు
ప్రభాస్, దీపికా, అమితాబ్, కమల్ హాసన్ నటించిన ఈ కల్కి 2898 ఏడీ మూవీ ఐదు రోజులు కలిపి ఇండియాలో ఏకంగా రూ.343 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. ఐదో రోజు ఈ సినిమా ఇండియాలో రూ.34.6 కోట్లు వసూలు చేసినట్లు sacnilk.com వెల్లడించింది. నాలుగో రోజైన ఆదివారం (జూన్ 30) ఈ కలెక్షన్లు రూ.88.2 కోట్లు కాగా.. సోమవారం సగానికి సగం తగ్గాయి.
అయితే ఐదో రోజు తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్లు రావడం విశేషం. తెలుగులో ఈ మూవీకి రూ.14.5 కోట్లు రాగా.. హిందీలో రూ.16.5 కోట్లు వచ్చాయి. తమిళంలో రూ.2 కోట్లు, కన్నడలో రూ.0.3 కోట్లు, మలయాళంలో రూ.1.3 కోట్లు వసూలు చేసింది. తొలి రోజు ఇండియాలో రూ.95.3 కోట్లు వసూలు చేసిన కల్కి 2898 ఏడీ మళ్లీ ఆ స్థాయి వసూళ్లు మాత్రం సాధించలేకపోయింది.
నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్లకుపైగా వసూలు చేసిన ప్రభాస్ మూవీ.. ఫస్ట్ వీకెండ్ అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో జవాన్ (రూ.520 కోట్లు)ను మించిపోయింది. ఇప్పటికీ హిందీ బెల్ట్ లో కల్కి మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. సాధారణ ప్రేక్షకులే కాదు అక్కడి సెలబ్రిటీలు కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కల్కి 2898 ఏడీని చూసిన అశ్వత్థామ
కల్కి 2898 ఏడీ మూవీలో అశ్వత్థామ పాత్ర పోషించిన బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్ మొత్తానికి ఐదో రోజు ఈ సినిమాను చూశాడు. ఈ విషయాన్ని అభిషేక్ బచ్చన్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. సోమవారం (జులై 1) ఉదయాన్నే తాము ఈ సినిమా చూసినట్లు చెబుతూ ఇది చూసిన తర్వాత తన మెదడు పేలిపోయిందన్నట్లుగా ఓ ఎమోజీ పోస్ట్ చేశాడు.
కల్కి 2898 ఏడీ మూవీకి తొలి రోజు నుంచే అన్ని వర్గాల నుంచి పాజటివ్ టాక్ వస్తోంది. ఫస్ట్ హాఫ్ చాలా నిదానంగా, బోరింగా సాగినా.. సెకండాఫ్ మాత్రం ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ముఖ్యంగా చివరి అరగంట గూస్‌బంప్స్ తెప్పించేస్తున్నాయి. అరుపులతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. హాలీవుడ్ కు ఏమాత్రం తగ్గకుండా తీసిన స్టంట్స్, ఫైట్ సీన్స్ ప్రేక్షకులను అబ్బుర పరుస్తున్నాయి.
ఇక మూవీలో అతిథి పాత్రల్లో వచ్చే రాజమౌళి, ఆర్జీవీ, దుల్కర సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, ఫరియా అబ్దుల్లాలాంటి వాళ్లు కనిపించినప్పుడు కూడా థియేటర్లలో ప్రేక్షకులు కేరింతలు కొడుతున్నారు.