Prabhas vs Shah Rukh fans: ప్రభాస్, షారుక్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో రచ్చరచ్చ.. అసలు ఏం జరిగింది?-prabhas shah rukh khan fans social media war over kalki 2898 ad jawan box office collections ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Vs Shah Rukh Fans: ప్రభాస్, షారుక్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో రచ్చరచ్చ.. అసలు ఏం జరిగింది?

Prabhas vs Shah Rukh fans: ప్రభాస్, షారుక్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో రచ్చరచ్చ.. అసలు ఏం జరిగింది?

Hari Prasad S HT Telugu
Jul 01, 2024 09:04 PM IST

Prabhas vs Shah Rukh fans: ప్రభాస్, షారుక్ ఖాన్ ఫ్యాన్స్ మధ్య ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. కల్కి 2898 ఏడీ, జవాన్ సినిమాల ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల విషయంలో వీళ్లు గొడవ పడుతున్నారు.

 ప్రభాస్, షారుక్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో రచ్చరచ్చ.. అసలు ఏం జరిగింది?
ప్రభాస్, షారుక్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో రచ్చరచ్చ.. అసలు ఏం జరిగింది?

Prabhas vs Shah Rukh fans: ఏ సినిమా ఇండస్ట్రీ అయినా ఇద్దరు టాప్ హీరోల అభిమానుల మధ్య యుద్ధం సహజం. కానీ ఇప్పుడు సౌత్, నార్త్ ఇండస్ట్రీల హీరోల అభిమానులు సోషల్ మీడియాలో గొడవ పడుతున్నారు. దీనికి కారణం ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లే. ముఖ్యంగా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయి అతని ప్రతి సినిమా కోట్ల వర్షం కురిపిస్తుండటంతో ఫ్యాన్స్ వార్ ముదురుతోంది.

కల్కి 2898 ఏడీ వర్సెస్ జవాన్

ప్రభాస్, షారుక్ ఖాన్ అభిమానుల మధ్య గొడవకు కల్కి 2898 ఏడీ, జవాన్ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల మధ్య పోలికే ప్రధాన కారణమైంది. కల్కి 2898 ఏడీ మూవీ తొలి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.555 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసినట్లు మేకర్సే వెల్లడించారు. ఈ లెక్కన రూ.520 కోట్లతో జవాన్ మూవీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసేసిందని ప్రభాస్ ఫ్యాన్స్ పోస్టులు చేశారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో అతిపెద్ద ఫస్ట్ వీకెండ్ వసూళ్లు సాధించిన సినిమా కల్కి 2898 ఏడీ మూవీనే అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తేల్చేశారు. అయితే దీనికి షారుక్ ఫ్యాన్స్ దీటుగా జవాబిచ్చారు. ముఖ్యంగా సుమిత్ కాడెల్ అనే ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ మొదటి నుంచీ పనిగట్టుకొని ఈ కల్కి 2898 ఏడీపై నెగటివ్ ప్రచారం చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ ను చాలా చెత్తగా చూపించారని, అమితాబ్ బచ్చనే అన్నీ తానై నడిపాడని అతడు రిలీజ్ రోజు రివ్యూ రాశాడు.

ఇక ఇప్పుడు ఈ సినిమా జవాన్ కలెక్షన్లను మించిపోయిందని అంటున్న సమయంలో బాక్సాఫీస్ లెక్కలను తారుమారు చేశారన్నట్లుగా పరోక్షంగా ఆరోపించాడు. "ఓ గొప్ప విజయాన్ని మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జవాన్ మూవీ నాలుగు రోజుల్లోనే రూ.520 కోట్లు వసూలు చేసింది. సౌత్ నుంచి ఎలాంటి మద్దతు లేకుండా, బాక్సాఫీస్ నంబర్లను తారుమారు చేయకుండానే. జవాన్ తర్వాత ఏ ఇండియన్ సినిమా ఈ నంబర్ల దరిదాపుల్లోకి రాలేదు" అని సుమిత్ పోస్ట్ చేశాడు.

కల్కి 2898 ఏడీ కలెక్షన్ల సునామీ

షారుక్ ఖాన్ జవాన్ నుంచి మించలేదంటూ అతని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నా.. అధికారిక లెక్కల ప్రకారం చూసినా కూడా ఈ సినిమా రూ.555 కోట్లు వసూలు చేసింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్ల వసూళ్లతో సంచలనం రేపిన కల్కి మూవీ.. రెండో రోజు కాస్త తగ్గినా మళ్లీ మూడు, నాలుగు రోజుల్లో దూసుకెళ్లింది. దీంతో ఫస్ట్ వీకెండ్లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీస్ లో జవాన్ రికార్డును బ్రేక్ చేసింది.

అంతేకాదు ఇంతకుముందు ప్రభాస్ నటించిన సలార్ మూవీ కూడా మంచి హిట్ సాధించింది. అతడు ఉంటే చాలు సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా కోట్ల వర్షం కురుస్తుందన్న అంచనాలు బలపడుతున్నాయి. బాలీవుడ్ స్టార్లకు కూడా దీటుగా ప్రభాస్ గ్రాఫ్ పెరిగిపోయింది. ఇది సహజంగా నార్త్ అభిమానులకు మింగుడు పడటం లేదని అర్థమవుతోంది.

WhatsApp channel