Jawan Collections Day 24: జవాన్ సినిమాకు ఇప్పటి వరకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయంటే? ఓవర్సీస్‍లోనూ భారీగా..
Jawan Collections Day 24: బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా ఇంకా కలెక్షన్లలో జోరు కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 7న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రారంభం నుంచి వసూళ్లలో జోరు చూపిస్తోంది. 24 రోజుల్లో ఈ మూవీ ఎంత కలెక్షన్లను రాబట్టిందో ఇక్కడ చూడండి.
(1 / 5)
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ఇంకా కలెక్షన్లలో జోరు చూపిస్తోంది. సెప్టెంబర్ 7న ఈ మూవీ రిలీజ్ కాగా వసూళ్లలో సత్తాచాటింది. 24 రోజుల్లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో లెక్కలు బయటికి వచ్చాయి.
(2 / 5)
జవాన్ సినిమా 24 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1,068 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఈ విషయాన్ని ఈ మూవీని నిర్మించిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‍మెంట్స్ ప్రకటించింది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ అయింది.
(3 / 5)
జవాన్ సినిమా భారత్‍లో ఇప్పటి వరకు రూ.597.83 కోట్ల నెట్ కలెక్షన్లు (రూ.707 కోట్ల గ్రాస్) సాధించింది. విదేశాల్లో (ఓవర్సీస్) ఏకంగా రూ.361.35 కోట్ల (43.55 మిలియన్ డాలర్లు) గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. ఓవర్సీస్‍లోనూ బంపర్ హిట్ కొట్టింది.
(4 / 5)
షారుఖ్ నటించిన పఠాన్ కలెక్షన్లను ఇప్పుడు జవాన్ దాటేసింది. వరుస సెలవులు ఉండటంతో కలెక్షన్లు కాస్త పుంజుకునే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు