OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న కాజల్ అగర్వాల్ సినిమా.. అప్పుడే ఆ మార్క్ దాటేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ-kajal aggarwal crime action thriller satyabhama movie crossed 100 million streaming minutes on amazon prime video ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఓటీటీలో దుమ్మురేపుతున్న కాజల్ అగర్వాల్ సినిమా.. అప్పుడే ఆ మార్క్ దాటేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ

OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న కాజల్ అగర్వాల్ సినిమా.. అప్పుడే ఆ మార్క్ దాటేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 03, 2024 03:13 PM IST

Satyabhama OTT Streaming: సత్యభామ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది. థియేటర్లలో మోస్తరుగా ఆడిన ఈ యాక్షన్ చిత్రం ఓటీటీలో దూసుకెళుతోంది. ఈ మూవీ అప్పుడే ఓ మైల్‍స్టోన్ దాటేసింది.

OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న కాజల్ అగర్వాల్ సినిమా.. అప్పుడే ఆ మార్క్ దాటేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ
OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న కాజల్ అగర్వాల్ సినిమా.. అప్పుడే ఆ మార్క్ దాటేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో ‘సత్యభామ’ చిత్రం వచ్చింది. ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించారు కాజల్. ఈ మూవీ జూన్ 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. సత్యభామ చిత్రానికి ఎక్కువ శాతం పాజిటివ్ టాక్ వచ్చింది. మోస్తరుగా కలెక్షన్లను రాబట్టుకుంది. సత్యభామ మూవీ ఇప్పుడు ఓటీటీలో దూసుకెళుతోంది. అప్పుడే ఓ మైలురాయిని దాటింది.

‘100’ దాటేసి..

సత్యభామ సినిమా జూన్ 28వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చింది. ముందస్తు ప్రచారం లేకుండానే ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఆరంభం నుంచే ఈ మూవీకి ప్రైమ్ వీడియో ఓటీటీలో భారీగా వ్యూస్ వచ్చాయి. దీంతో ఆరంభం నుంచి టాప్-5లోనే ట్రెండింగ్‍లోనే ఉంటోంది.

సత్యభామ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఓ మైల్‍స్టోన్ దాటింది. ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటేసింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. సత్యభామ ర్యాంపేజ్ అంటూ పోస్టర్ తీసుకొచ్చింది. “100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటిపోయింది. ప్రైమ్ వీడియోలో సత్యభామను చూడండి. యాక్షన్ డ్రామాలో లీనమవండి” అంటూ ఈ చిత్రాన్ని నిర్మించిన ఆరమ్ ఆర్ట్స్ ట్వీట్ చేసింది.

సత్యభామ మూవీ గురించి..

సత్యభామ మూవీకి సుమన్ చిక్కల దర్శకత్వం వహించారు. అతడి టేకింగ్, కథనం ఆకట్టుకుంది. పోలీస్ ఆఫీసర్ సత్యభామగా కాజల్ అదరగొట్టారు. యాక్షన్‍లోనూ దుమ్మురేపారు. ఇంటెన్స్ యాక్టింగ్‍తో మెప్పించారు. హిట్ 1, హిట్ 2, మేజర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శశికిరణ్ తిక్కా ఈ మూవీకి స్క్రీన్‍ప్లే బాధ్యతలు నిర్వర్తించారు. ఓ నిర్మాతగానూ వ్యవహరించారు. దీంతో సత్యభామ చిత్రానికి మరింత హైప్ వచ్చింది.

సత్యభామ చిత్రానికి మంచి టాక్ వచ్చినా ఆశించిన రేంజ్‍లో కలెక్షన్లు దక్కలేదు. జూన్ 7న ఈ చిత్రం రిలీజ్ కాగా.. మనమే, లవ్ మౌళి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద పోటీగా నిలిచాయి. సత్యభామ మూవీని ఆరమ్ ఆర్ట్స్ బ్యానర్‌పై శశికిరణ్ తిక్కా, బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

సత్యభామ స్టోరీ లైన్

గృహ హింసకు గురైన ఓ మహిళకు న్యాయం చేసేందుకు ఏసీపీ సత్యభామ (కాజల్ అగర్వాల్) పోరాడటం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. హసీనా అనే అమ్మాయి సత్యభామ వద్ద గృహ హింస కేసు పెడుతుంది. అయితే, ఆమెకు ధైర్యం చెప్పి మళ్లీ భర్త దగ్గరకు పంపిస్తుంది సత్యభామ. అయితే, భర్త చేతిలో హసీనా హత్యకు గురవుతుంది. దీంతో హసీనాను చంపిన ఆ వ్యక్తిని పట్టుకునేందుకు సత్యభామ రంగంలోకి దిగుతారు. ఈ క్రమంలో అతడి గురించి మరిన్ని నిజాలు తెలుస్తాయి. ఆ హంతుకుడిని సత్యభామ పట్టుకుందా.. ఎదురైన సవాళ్లు ఏవి అనే అంశాలు సత్యభామ సినిమాలో ప్రధానంగా ఉంటాయి. ఈ మూవీలో కాజల్ నటన ప్రేక్షకులను మెప్పించింది. ట్విస్టులు, కథనం కూడా ఓకే అనిపించింది. కథ విషయంలోనే కాస్త కొత్తదనం కొరవడినట్టు అనిపిస్తుంది.

WhatsApp channel