Manamey vs Satyabhama: ఈ ఫ్రైడే బాక్సాఫీస్ విన్న‌ర్ శ‌ర్వానంద్ - కాజ‌ల్ స‌త్య‌భామ‌కు షాకింగ్ క‌లెక్ష‌న్స్‌-sharwanand manamey vs kajal aggarwal satyabhama day 1 collections tollywood box office report ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manamey Vs Satyabhama: ఈ ఫ్రైడే బాక్సాఫీస్ విన్న‌ర్ శ‌ర్వానంద్ - కాజ‌ల్ స‌త్య‌భామ‌కు షాకింగ్ క‌లెక్ష‌న్స్‌

Manamey vs Satyabhama: ఈ ఫ్రైడే బాక్సాఫీస్ విన్న‌ర్ శ‌ర్వానంద్ - కాజ‌ల్ స‌త్య‌భామ‌కు షాకింగ్ క‌లెక్ష‌న్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Jun 08, 2024 12:13 PM IST

Manamey vs Satyabhama: ఈ శుక్ర‌వారం రిలీజైన సినిమాల్లో శ‌ర్వానంద్ మ‌న‌మే అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. తొలిరోజు ఈ మూవీ రెండు కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. కాజ‌ల్ స‌త్య‌భామ మూవీకి యాభై ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు చెబుతోన్నారు.

మ‌న‌మే వ‌ర్సెస్ స‌త్య‌భామ‌
మ‌న‌మే వ‌ర్సెస్ స‌త్య‌భామ‌

Manamey vs Satyabhama: ఈ శుక్ర‌వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా ప‌ది సినిమాలు పోటీప‌డ్డాయి. అందులో శ‌ర్వానంద్ మ‌న‌మేతో పాటు కాజ‌ల్ స‌త్య‌భామ ఎక్కువ‌గా బ‌జ్‌ను క్రియేట్ చేశాయి. ఈ రెండు సినిమాల మ‌ధ్యే పోటీ ప్ర‌ధానంగా నెల‌కొంది. ఫ‌స్ట్ డే మ‌న‌మే మూవీకి మిక్స్‌డ్ టాక్ రాగా...స‌త్య‌భామ థ్రిల్ల‌ర్ జాన‌ర్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది.

మ‌న‌మే క‌లెక్ష‌న్స్ ఇవే...

శ‌ర్వానంద్ మ‌న‌మే మూవీ తొలి రోజు నాలుగు కోట్ల ఇర‌వై ల‌క్ష‌ల‌కు పైగా గ్రాస్‌ను, రెండు కోట్ల ఐదు ల‌క్ష‌ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్‌ను సొంతం చేసుకున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఈ సినిమా ఎక్కువ‌గా అట్రాక్ట్ చేస్తుండ‌టంతో శ‌ని, ఆదివారాల్లో క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి.

శ‌ర్వానంద్‌, కృతిశెట్టి కాంబోలోతెర‌కెక్కిన ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌ను భారీగా నిర్వ‌హించారు. రామ్‌చ‌ర‌ణ్ టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌డం, ప‌లువురు అగ్ర‌నాయ‌కానాయిక‌లు సోష‌ల్ మీడియాలో మ‌న‌మే సినిమా గురించి ట్వీట్స్ వేయ‌డంతో ఈ వీక్‌లో రిలీజ్ అయిన సినిమాల్లో మ‌న‌మేపైనే ఎక్కువ‌గా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దాదాపు 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో మ‌న‌మే రిలీజ్ అయ్యింది.

మిక్స్‌డ్ టాక్‌...

కంటెంట్ వీక్ కావ‌డంతో తొలిరోజు మ‌న‌మే మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. కామెడీ వ‌ర్క‌వుట్ అయినా ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ విష‌యంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డిన‌ట్లు ఆడియెన్స్ చెబుతోన్నారు. అందువ‌ల్లే ఈ సినిమా క‌లెక్ష‌న్స్ ఆశించిన స్థాయిలో రాలేద‌ని చెబుతున్నారు.

పెళ్లికి ముందే...

విక్ర‌మ్‌, సుభ‌ద్ర‌ల‌పై పెళ్లికి ముందే ఓ బాబును పెంచాల్సిన బాధ్య‌త‌ప‌డుతుంది. ఈ క్ర‌మంలో వారి మ‌ధ్య ఎదుర‌య్యే గొడ‌వ‌లు, సంఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో మ‌న‌మే సినిమాను తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య‌. మ‌న‌మే మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. ఒకే ఒక జీవితం అనంత‌రం దాదాపు రెండేళ్ల విరామం త‌ర్వాత శ‌ర్వానంద్ మ‌న‌మే మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు.

ఫ‌స్ట్ టైమ్ పోలీస్ రోల్‌...

తెలుగు కెరీర్‌లో ఫ‌స్ట్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ స‌త్య‌భామ శుక్ర‌వారం రిలీజైంది. ఈ సినిమా తొలిరోజు దాదాపు కోటి ఇర‌వై ల‌క్ష‌ల‌కుపైగా గ్రాస్‌ను, యాభై ల‌క్ష‌ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. శ‌ని, ఆదివారాల్లో క‌లెక్ష‌న్స్ స్ట‌డీగా ఉండే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

మ‌న‌మే సినిమాకు నెగెటివ్ టాక్ రావ‌డం, శుక్ర‌వారం రిలీజైన మిగిలిన సినిమాల‌పై పెద్ద‌గా బ‌జ్ లేక‌పోవ‌డం స‌త్య‌భామ‌కు క‌లిసివ‌చ్చింది. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీతో సుమ‌న్ చిక్కాల డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. గూఢ‌చారి ఫేమ్ శ‌శి కిర‌ణ్ తిక్కా ఈ మూవీకి స్క్రీన్‌ప్లేను అందించారు.

కాజ‌ల్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు...

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీకి హ్యూమ‌న్ ట్రాఫికింగ్ లాంటి అంశాల‌ను తెర‌కెక్కించిన ఈ మూవీలో కాజ‌ల్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. క‌థ‌లోని మ‌లుపుల‌తో పాటు క‌థ‌నాన్ని ఎంగేజింగ్‌గా న‌డిపించిన తీరుపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. స‌త్య‌భామ‌లో న‌వీన్‌చంద్ర‌, ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

టీ20 వరల్డ్ కప్ 2024