Manamey Twitter Review: మనమే ట్విట్టర్ రివ్యూ -శర్వానంద్ మూవీకి డిజాస్టర్ టాక్ -మరో ఫ్యామిలీ స్టార్ అంటూ ట్వీట్స్
Manamey Twitter Review: శర్వానంద్, కృతిశెట్టి తొలిసారి జంటగా నటించిన మనమే ఈ శుక్రవారం(జూన్ 7న) రిలీజైంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసింది
Manamey Twitter Review: శర్వానంద్, కృతిశెట్టి జంటగా నటించిన మనమే మూవీ ఈ శుక్రవారం (నేడు) థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. మనమే మూవీ ఓవర్‌సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?
నెగెటివ్ టాక్
ఓవర్‌సీస్ ప్రీమియర్స్ నుంచి మనమే సినిమాకు ఊహించిన టాక్ వస్తోంది. సినిమాపై నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తోన్నాయి. సినిమా చాలా బోరింగ్‌గా ఉందని, ఎమోషన్స్, కామెడీతో పాటు లవ్‌స్టోరీ సరిగ్గా వర్కవుట్ కాలేదని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. రెగ్యులర్ టెంప్లేట్ ఫ్యామిలీ మూవీగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మనమే సినిమాను తెరకెక్కించాడని అంటున్నారు.
శర్వానంద్ ఎనర్జీ...
శర్వానంద్ ఎనర్జీ ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని నిలబెట్టిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హీరో, హీరోయిన్లతో పాటు ఓ చిన్నారి...కేవలం ముగ్గురి క్యారెక్టర్స్ చుట్టే కథ మొత్తం తిరుగుతుందని అంటున్నారు. కీలకమైన సెకండాఫ్‌లో మాత్రం దర్శకుడు పూర్తిగా పట్టుతప్పాడని, క్యారెక్టర్స్ మధ్య ఎమోషనల్ కనెక్టివిటీని సరిగ్గా బిల్డ్ చేయలేకపోయాడని ట్వీట్స్ చేస్తున్నారు. ఫ్యామిలీ సినిమాల్లో కనిపించే సెంటిమెంట్, డ్రామా పూర్తిగా సెకండాఫ్‌లో మిస్సయిందని చెబుతున్నారు.
విలనిజం వీక్...
శర్వానంద్, చిన్నారి మధ్య సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయని చెబుతోన్నారు. కొన్ని కామెడీ సీన్స్ మాత్రం హిలేరియస్‌గా నవ్విస్తాయని అంటున్నారు. హీరోకు ధీటుగా విలన్ క్యారెక్టర్ లేకపోవడం సినిమాకు మైనస్‌గా మారిందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. రాహుల్ రవీంద్రన్ విలనిజం వీక్‌గా ఉందని కామెంట్ చేశాడు.
కృతిశెట్టితో శర్వానంద్ కెమిస్ట్రీ....
క్వాలిటీ మేకింగ్, బ్యూటిఫుల్ లొకేషన్స్‌తో మనమే మెస్మరైజ్ చేస్తుందని, అయితే కథ విషయంలో మాత్రం డిసపాయింట్ అవుతారని చెబుతోన్నారు. మనమే మూవీలో గత సినిమాలకు మించి స్టైలిష్‌గా శర్వానంద్ కనిపించాడని, కృతిశెట్టితో అతడి కెమిస్ట్రీ ఆకట్టుకుంటుటుందని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. తన క్యారెక్టర్‌కు శర్వానంద్ వందశాతం న్యాయం చేశాడని చెబుతోన్నారు.
కృతిశెట్టి పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సీరత్ కపూర్ క్యారెక్టర్ గ్లామర్ కోసమే వాడుకున్నట్లుగా ఉందని అంటున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ పాటలు, బీజీఎమ్ ఈ సినిమాకు కొంత వరకు ప్లస్ పాయింట్ అయ్యిందని చెబుతోన్నారు.