Krithi Shetty: ల‌వ్ టుడే హీరోతో కృతిశెట్టి రొమాన్స్ - ల‌వ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ మొద‌లుపెట్టిన విఘ్నేష్ శివ‌న్‌-krithi shetty to play female lead in pradeep ranganathan vignesh shivan love insurance corporation movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krithi Shetty: ల‌వ్ టుడే హీరోతో కృతిశెట్టి రొమాన్స్ - ల‌వ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ మొద‌లుపెట్టిన విఘ్నేష్ శివ‌న్‌

Krithi Shetty: ల‌వ్ టుడే హీరోతో కృతిశెట్టి రొమాన్స్ - ల‌వ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ మొద‌లుపెట్టిన విఘ్నేష్ శివ‌న్‌

Nelki Naresh Kumar HT Telugu
Dec 15, 2023 08:15 AM IST

Krithi Shetty: ల‌వ్ టుడే హీరో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌తో కృతిశెట్టి రొమాన్స్ చేయ‌బోతున్న‌ది. విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు ల‌వ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

కృతిశెట్టి
కృతిశెట్టి

Krithi Shetty: బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్‌ల‌తో టాలీవుడ్‌కు దూర‌మైన కృతిశెట్టి త‌మిళంలో మాత్రం చ‌క్క‌టి అవ‌కాశాల్ని ద‌క్కించుకుంటోంది. తాజాగా కోలీవుడ్‌లో మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ది కృతిశెట్టి. ల‌వ్ టుడే హీరో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌తో రొమాన్స్ చేయ‌బోతున్న‌ది. న‌య‌న‌తార భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ మూవీకి ల‌వ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

yearly horoscope entry point

గురువారం ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ల‌వ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్‌కు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. ఎస్‌జేసూర్య‌, యోగిబాబు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్ట‌బోతున్నారు. కాథు వ‌కుల రెండు కాద‌ల్ త‌ర్వాత విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా ఇది. అజిత్‌తో ఓ సినిమాను విఘ్నేష్ శివ‌న్ అనౌన్స్‌చేశాడు. కానీ అజిత్ ఇమేజ్‌కు త‌గ్గ క‌థ కుద‌ర‌క‌పోవ‌డంతో ఈ సినిమా ఆగిపోయింది.

శివ‌కార్తికేయ‌న్‌తో అనుకొని…

ల‌వ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్‌ను తొలుత శివ‌కార్తికేయ‌న్‌తో చేయాల‌ని విఘ్నేష్ శివ‌న్ అనుకున్నాడు. అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమాను నిర్మించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కానీ అనివార్య కార‌ణాల శివ‌కార్తికేయ‌న్ సినిమా నుంచి త‌ప్పుకోవ‌డంతో ప్ర‌దీప్ రంగ‌నాథ్‌ను హీరోగా తీసుకున్నాడు విఘ్నేష్ శివ‌న్‌.

వారియ‌ర్‌తో ఎంట్రీ...

రామ్ పోతినేని ది వారియ‌ర్ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. ఈ సినిమా ప‌రాజ‌యం పాలైన అవ‌కాశాలు మాత్రం భారీగానే అందుకుంటోంది. ప్ర‌స్తుతం కార్తి, జ‌యంర‌విల‌తో సినిమాలు చేస్తోంది. ఈ సినిమాలో సెట్స్‌పై ఉండ‌గానే ల‌వ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్‌లో అవ‌కాశాన్ని ద‌క్కించుకున్న‌ది.

Whats_app_banner