Manamey Movie: మ‌న‌మే మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే - ఇక నుంచి ఛార్మింగ్ స్టార్‌గా శ‌ర్వానంద్‌-charming star sharwanand manamey movie pre release business and break even target ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manamey Movie: మ‌న‌మే మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే - ఇక నుంచి ఛార్మింగ్ స్టార్‌గా శ‌ర్వానంద్‌

Manamey Movie: మ‌న‌మే మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే - ఇక నుంచి ఛార్మింగ్ స్టార్‌గా శ‌ర్వానంద్‌

Nelki Naresh Kumar HT Telugu
Jun 06, 2024 01:58 PM IST

Manamey Movie: శ‌ర్వానంద్‌కు గ‌త కొన్నాళ్లుగా స‌రైన స‌క్సెస్‌లు లేక‌పోయినా మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జ‌రిగింది. దాదాపు 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకురాబోతోంది.

మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్
మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్

Manamey Movie: శ‌ర్వానంద్‌, కృతిశెట్టి జంట‌గా న‌టించిన మ‌న‌మే మూవీ జూన్ 7న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఈ వారం రిలీజ్ అవుతోన్న సినిమాల్లో అత్య‌ధిక బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో మ‌న‌మే రిలీజ్ అవుతోంది.

మ‌హానుభావుడు త‌ర్వాత‌...

శ‌ర్వానంద్‌కు గ‌త కొన్నేళ్లుగా స‌రైన విజ‌యాలు లేవు. 2017లో రిలీజైన మ‌హానుభావుడు త‌ర్వాత శ‌ర్వానంద్ న‌టించిన సినిమాలేవి బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్‌లుగా నిల‌వ‌లేక‌పోయాయి.

ప‌డి ప‌డి లేచే మ‌న‌సు, జాను, ఆడ‌వాళ్లు మీకే జోహార్లు సినిమాల‌కు బాగుంద‌నే టాక్ వ‌చ్చిన వ‌సూళ్ల ప‌రంగా నిరాశ‌ప‌రిచాయి. శ‌ర్వానంద్ గ‌త మూవీ ఒకే ఒక జీవితం హిట్ టాక్‌ను తెచ్చుకొని అత‌డిని గ‌ట్టెక్కించింది. అయితే ఈ మూవీ కూడా ప‌ది కోట్ల లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

ప‌న్నెండు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌...

గ‌త సినిమాల రిజ‌ల్ట్‌ల‌తో సంబంధం లేకుండా మ‌న‌మే మూవీ థియేట్రిక‌ల్ బిజినెస్ భారీగా జ‌రిగింది. మ‌న‌మే వ‌ర‌ల్డ్ వైడ్ థ్రియేట్రిక‌ల్ హ‌క్కులు దాదాపు 11.50 కోట్ల‌కు అమ్ముడుపోయాయి. నైజాంలో అత్య‌ధికంగా3.50 కోట్ల వ‌ర‌కు ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది.

తెలుగు రాష్ట్రాల థియేట్రిక‌ల్ హ‌క్కులు ద్వారా నిర్మాత‌ల‌కు ప‌ది కోట్ల వ‌ర‌కు డ‌బ్బులు వ‌చ్చిన‌ట్లు చెబుతోన్నారు. ఓవ‌ర్‌సీస్‌లో కోటిన్న‌ర‌కు థియేట్రిక‌ల్ రైట్స్ అమ్మ‌కాలు జ‌రిగిన‌ట్లు చెబుతోన్నారు. మొత్తంగా 11.50 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌ర‌గ్గా...12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజ్ అవుతోన్న‌ట్లు చెబుతోన్నారు.

భారీ పోటీ...

శుక్ర‌వారం మ‌న‌మేతో పాటు కాజ‌ల్ అగ‌ర్వాల్ స‌త్య‌భామ‌, పాయ‌ల్ రాజ్‌పుత్ ర‌క్ష‌ణ‌, న‌వ‌దీప్ ల‌వ్ మౌళి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటితో పాటు మ‌రో రెండు చిన్న సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. వీట‌న్నింటి పోటీని త‌ట్టుకొని మ‌న‌మే ఏ మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌బ‌డుతుంది అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌న‌మే మూవీ తెలుగు రాష్ట్రాల్లో 450కిపైగా థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం.

ఛార్మింగ్ స్టార్‌...

మ‌న‌మే మూవీ నుంచి శ‌ర్వానంద్ పేరుకు ముందు ఛార్మింగ్ స్టార్ అనే ట్యాగ్ క‌న‌బ‌డ‌నుంది. మ‌న‌మే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ‌ర్వానంద్‌కు ఛార్మింగ్ స్టార్ అనే బిరుదును ఇచ్చారు మూవీ ప్రొడ్యూస‌ర్ టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌. మ‌న‌మే మూవీ టైటిల్ కార్డ్స్‌లో శ‌ర్వానంద్ పేరు ముందు ఛార్మింగ్ స్టార్ అనే బిరుదు క‌నిపించ‌బోతున్న‌ది.

తొలుత మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పిఠాపురంలో నిర్వ‌హించాల‌ని సినిమా యూనిట్ భావించింది. కానీ చివ‌రి నిమిషంలో అనుమ‌తులు ల‌భించ‌క‌పోవ‌డంతో హైద‌రాబాద్‌లో జ‌రిపారు. స‌క్సెస్ పార్టీని పిఠాపురంలో నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. మ‌న‌మే మూవీకి హేషమ్ అబ్దుల్ వ‌హాబ్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.

ఏడాది త‌ర్వాత‌...

క‌స్ట‌డీ త‌ర్వాత దాదాపు ఏడాది విరామం అనంత‌రం తెలుగులో కృతిశెట్టి న‌టిస్తోన్న సినిమా ఇది. ఉప్పెన‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ‌కు కొన్నాళ్లుగా స‌రైన విజ‌యాలు లేవు. మ‌న‌మేపైనే కృతిశెట్టి భారీగా ఆశ‌లు పెట్టుకున్న‌ది.

టీ20 వరల్డ్ కప్ 2024