Manamey: పిఠాపురంలో మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్? - చీఫ్ గెస్ట్‌గా మెగా పవర్ స్టార్ - ఈవెంట్ డేట్ ఇదే?
Manamey Pre Release Event: శర్వానంద్ హీరోగా నటిస్తోన్న మనమే మూవీ జూన్ 7న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పిఠాపురంలో నిర్వహించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వేడుకకు రామ్ చరణ్ చీఫ్ గెస్ట్‌గా రానున్నట్లు సమాచారం.
Manamey Pre Release Event: పిఠాపురం ఎన్నికల ఫలితాలు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. వైసీసీ వర్గాలు మాత్రం వంగా గీతా విజయం సాధిస్తుందని అంటున్నారు.
ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం దాదాపుగా టాలీవుడ్ మొత్తం ప్రచారం చేసింది. మెగా హీరోతో పాటు కొందరు నటీనటులు, ప్రొడ్యూసర్లు ప్రత్యక్షంగా పిఠాపురంలో ప్రచారం చేశారు. టాలీవుడ్ హీరోలు నానితో పాటు మరికొందరు పవన్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.
మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్...
పవన్ కళ్యాణ్ పోటీతో పిఠాపురం ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది. తాజాగా శర్వానంద్ హీరోగా నటిస్తోన్న మనమే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పిఠాపురంలో నిర్వహించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఎలెక్షన్స్ రిజల్ట్ వెలువడిన తర్వాత రోజే జూన్ 5న మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పిఠాపురంలో జరిపేందుకు మూవీ వర్గాలు ప్రయత్నాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఇంకా అనుమతులు రానట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ చీఫ్ గెస్ట్...
మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. శర్వానంద్‌తో ఉన్న అనుబంధంతోనే రామ్‌చరణ్ ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా రావడానికి అంగీకరించినట్లు చెబుతోన్నారు. మనమే ట్రైలర్‌ను ఇటీవల రామ్‌చరణ్ రిలీజ్ చేశాడు.ఒక్క రోజులోనే ఈ ట్రైలర్ 2.5 మిలియన్లకుపైగా వ్యూస్‌ను రాబట్టింది.
జూన్ 7న రిలీజ్...
మనమే మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తోన్నాడు. జూన్ 7న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో శర్వానంద్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. మనమే మూవీకి ఖుషి ఫేమ్ హేషం అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. మనమే సినిమాలో పదహారు పాటలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగులో అత్యధిక పాటలు ఉన్న మూవీగా మనమే రికార్డ్ నెలకొల్పనుంది.
కస్టడీ తర్వాత...
కస్టడీ తర్వాత దాదాపు ఏడాది విరామం తర్వాత కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న మూవీ ఇది. ఉప్పెనతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. ఫస్ట్ మూవీతోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ మూవీ వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు సానా నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి.మనమే రిజల్ట్‌పైనే కృతి శెట్టి ఆశలు పెట్టుకున్నది.
ఒకే ఒక జీవితం...
మరోవైపు తెలుగులో లాంగ్ గ్యాప్ తర్వాత ఒకే ఒక జీవితం సినిమాతో హిట్టు అందుకున్నాడు శర్వానంద్. ఈ సినిమా తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న శర్వానంద్ మనమేతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మనమేతో పాటు తెలుగులో మరో రెండు సినిమాలు చేస్తోన్నాడు శర్వానంద్. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.