Premalu OTT Response: ప్రేమలు.. ఓవర్‌రేటెడ్ మూవీ - హైప్ తప్ప ఏం లేదు - ఓటీటీలో బ్లాక్‌బస్టర్ మూవీకి మిక్స్‌డ్ టాక్
Premalu OTT Response: థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ప్రేమలు మూవీకి ఓటీటీలో మాత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రేమలో ఓవర్‌రేటెడ్ హైప్ మూవీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నాడు.
Premalu OTT Response: ప్రేమలు మలయాళంలో చిన్న సినిమాగా రిలీజై ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. కేవలం మూడు కోట్ల బడ్జెట్‌తో ఎలాంటి స్టార్‌కాస్ట్ లేకుండా రిలీజైన ఈ సినిమా ఏకంగా 135 కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నది. తెలుగులోనూ ఈ మూవీని లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి తనయుడు ఎస్.ఎస్ కార్తికేయ రిలీజ్ చేశాడు. తెలుగు వెర్షన్ కూడా ఇరవై కోట్లకుపైనే వసూళ్లను దక్కించుకున్నది. తెలుగులో రిలీజైన మలయాళం డబ్బింగ్ మూవీస్‌లో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా రికార్డ్ నెలకొల్పింది.
ఆహా ఓటీటీలో...
ఇటీవలే ప్రేమలు మూవీ ఓటీటీలోకి వచ్చింది. తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో రిలీజవ్వగా...తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది.
ప్రమోషన్స్‌లో రాజమౌళి...
కార్తికేయ తెలుగులో ఈ మూవీని రిలీజ్ చేయడంతో కొడుకు కోసం రాజమౌళి ప్రేమలు తెలుగు ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. ప్రేమలు మూవీని ఆకాశానికి ఎత్తాడు. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వించిన మూవీ ఇదని, యాక్టర్స్ అందరూ పోటీపడి నటించారంటూ మెచ్చుకున్నాడు.
మలయాళం దర్శకుడి కథతో అందరూ ప్రేమలో పడతారంటూ సినిమాపై హైప్‌ను పెంచాడు. రాజమౌళి మెచ్చుకోవడంతో ఈ సినిమాలో నిజంగానే ఏదో కొత్తదనం ఉందని అందరూ అనుకున్నారు. థియేటర్లలో మిస్సయిన వారంతా ఎగ్జైటింగ్‌గా ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం ఎదురుచూశారు.
తక్కువ స్ట్రీమింగ్ వ్యూస్...
కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కు మాత్రం ఆడియెన్స్ షాకిస్తున్నారు. థియేటర్లలో హిట్టయిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం ఫట్‌గా నిలిచింది. గత వారం ఓటీటీలో రిలీజైన గామి, ఓమ్ భీమ్ బుష్ కంటే ప్రేమలు మూవీకి అతి తక్కువ స్ట్రీమింగ్ వ్యూస్ వచ్చినట్లు సమాచారం.
హైప్ తప్ప ఏం లేదు...
థియేటర్లలో కలెక్షన్స్ వర్షం కురిపించిన ఈ సినిమాకు ఓటీటీలో మాత్రం మిక్స్‌డ్ రెస్ఫాన్స్ వస్తోంది. ప్రేమలో ఓవర్ రేటెడ్ మూవీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో హైప్ తప్ప కథ, కథనాల పరంగా ఎలాంటి కొత్తదనం లేదంటూ చెబుతోన్నారు. ఇలాంటి రొటీన్ లవ్‌స్టోరీస్ మలయాళం ఆడియెన్స్‌కు కొత్త కావచ్చు కానీ...తెలుగు ప్రేక్షకులకు మాత్రం కాదని కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమలు మూవీ కథ పాతదేనని, ఎన్నో సినిమాల్లో వచ్చిన కథనే తీసుకొని ఈ సినిమా చేశాడని అంటున్నారు.
రాజమౌళి బాగుందని చెప్పడం వల్లే...
రాజమౌళి బాగుందని చెప్పడం వల్లే ఈ సినిమా చూశానని, చూసిన తర్వాత చాలా డిసపాయింట్ అయ్యానని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. ఓ మలయాళ సినిమాను హైదరాబాద్‌లో తీయడం కొత్త అది తప్ప ప్రేమలు కథ మాత్రం కొత్తది కాదని మరో నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. నిబ్బా నిబ్బీలతో కూడిన యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ అని, టైమ్‌పాస్ మూవీ తప్పితే క్లాసిక్ మాత్రం కాదని ఓ నెటిజన్ అన్నాడు.
బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ…
మరికొందరు నెటిజన్లు మాత్రం జెన్యూన్‌గా తీసిన బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ, తెలుగులో వచ్చే రొడ్డకొట్టుడు మూవీస్‌తో పోలీస్లే బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రేమలు మూవీలో నస్లీన్ కే గఫూర్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించారు. గిరీష్ ఏడీ దర్శకత్వం వహించాడు. మళయాళంలో ఈ మూవీని స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ తన స్నేహితులతో కలిసి నిర్మించాడు.
టాపిక్