Gangs Of Godavari Motha: విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి ఐటమ్ బీట్.. మాస్ ఆడియెన్స్‌కు ట్రీట్-vishwak sen gangs of godavari movie motha song released ayesha khan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gangs Of Godavari Motha: విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి ఐటమ్ బీట్.. మాస్ ఆడియెన్స్‌కు ట్రీట్

Gangs Of Godavari Motha: విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి ఐటమ్ బీట్.. మాస్ ఆడియెన్స్‌కు ట్రీట్

Sanjiv Kumar HT Telugu
Mar 25, 2024 03:09 PM IST

Gangs Of Godavari Motha Song Released: ఇటీవల గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ నటించిన మరో లేటెస్ట్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా నుంచి ఇప్పటికే సుట్టంలా సూసి అనే పాట రిలీజ్ కాగా తాజాగా మోత అనే ఐటమ్ సాంగ్ విడుదల అయింది.

విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి ఐటమ్ బీట్.. మాస్ ఆడియెన్స్‌కు ట్రీట్
విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి ఐటమ్ బీట్.. మాస్ ఆడియెన్స్‌కు ట్రీట్

Gangs Of Godavari Motha Song Out Now: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ.. పలు విజయాలను ఖాతాలో వేసుకుంటూ.. ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే మరో వైవిధ్యమైన సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ఆయన మాస్‌ని మెప్పించే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు.

ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన స్వరపరిచిన ఆల్బమ్ నుంచి విడుదలైన ''సుట్టంలా సూసి'' అనే మెలోడీ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాటకు యూట్యూబ్‌లో దాదాపు 50 మిలియన్ల వీక్షణలతో చార్ట్ బస్టర్‌గా నిలిచింది. పాట వైరల్ కావడంతోపాటు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి "మోత" అనే మరో ఆకర్షణీయమైన పాటను విడుదల చేశారు మేకర్స్. యువన్ శంకర్ రాజా తనదైన శైలిలో మాస్‌ని మెప్పించేలా ఈ పాటను స్వరపరిచారు. అభిమానుల్లో ఉత్సాహం నింపేలా ఉన్న ఈ పాట.. థియేటర్లలో మోత మోగించడం ఖాయం అనేలా ఉంది. ప్రముఖ గీత రచయిత, ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం ఈ పాటని మరోస్థాయికి తీసుకెళ్లింది. పాట సందర్భానికి తగ్గట్టుగా పదాల అల్లికతో మరోసారి మాయ చేశారు.

అలాగే ఎం.ఎం. మానసి గాత్రం ఈ మోత గీతానికి మరింత అందం తీసుకొచ్చింది. హోలీ రోజున "మోత" పాటను విడుదల చేసి, పండగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చింది చిత్ర బృందం. ఇక అందాల తార అయేషా ఖాన్ ఈ ప్రత్యేక పాట కోసం విశ్వక్ సేన్‌తో కలిసి తెరను పంచుకోవడం అదనపు ఆకర్షణగా నిలిచింది. అయేషా ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ సినీ ప్రేమికులందరికీ ప్రత్యేక ట్రీట్‌లా ఉండనుంది. కాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో అందాల భామ నేహా శెట్టి హీరోయిన్‌గా చేస్తుండగా.. టాలెంటెడ్ హీరోయిన్ అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ మూవీకి వెంకట్ ఉప్పుటూరి, గోపీ చంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అనిత్ మధాడి కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాకి కృష్ణ చైతన్య రచన, దర్శకత్వం వహిస్తున్నారు. చీకటి ప్రపంచంలో సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన ఓ వ్యక్తి ప్రయాణంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా మే 17, 2024న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందిస్తుందని నిర్మాతలు ఎంతో నమ్మకంగా ఉన్నారు.

ఇదిలా ఉంటే, విశ్వక్ సేన్ వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ఇటీవలే గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. ఇందులో అఘోరాగా విశ్వక్ సేన్ ఆకట్టున్నాడు. డిఫరెంట్ జోనర్‌లో వచ్చిన గామి తెలుగు ఆడియెన్స్‌కు బాగానే కనెక్ట్ అయిందని చెప్పొచ్చు.

టీ20 వరల్డ్ కప్ 2024