Family Star Day 1 Collections: ఫ్యామిలీ స్టార్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - లైగ‌ర్ కంటే ఎన్ని కోట్లు త‌క్కువ వ‌చ్చాయంటే?-vijay deverakonda family star day 1 collections liger vs family star collections ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Family Star Day 1 Collections: ఫ్యామిలీ స్టార్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - లైగ‌ర్ కంటే ఎన్ని కోట్లు త‌క్కువ వ‌చ్చాయంటే?

Family Star Day 1 Collections: ఫ్యామిలీ స్టార్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - లైగ‌ర్ కంటే ఎన్ని కోట్లు త‌క్కువ వ‌చ్చాయంటే?

Nelki Naresh Kumar HT Telugu
Apr 06, 2024 10:23 AM IST

Family Star Day 1 Collections: ఫ్యామిలీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో ఫ‌స్ట్ డే అతి త‌క్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. తొలిరోజు లైగ‌ర్ కంటే ఏకంగా 27 కోట్ల త‌క్కువ క‌లెక్ష‌న్స్‌ను ఫ్యామిలీ స్టార్ రాబ‌ట్టింది.

ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ డే  కలెక్షన్స్
ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ డే కలెక్షన్స్

Family Star Day 1 Collections: ఫ్యామిలీ స్టార్ మూవీతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు విజయ్ దేవరకొండ. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా కథాంశంతో దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టించింది. దిల్‌రాజు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు.

ఫ‌స్ట్ షో నుంచే నెగెటివ్ టాక్‌...

2024లో తెలుగు ప్రేక్ష‌కుల్లో అత్యంత ఆస‌క్తిని రేకెత్తించిన సినిమాల్లో ఒక‌టిగా భారీ అంచ‌నాల న‌డుమ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఫ్యామిలీస్టార్‌ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ నుంచే నెగెటివ్ టాక్‌ను మూట‌గ‌ట్టుకున్న‌ది. ప‌ర‌శురామ్ అందించిన క‌థ‌, అత‌డి టేకింగ్‌తో పాటు సినిమాలోని కామెడీ, సెంటిమెంట్ సీన్స్‌ను సోష‌ల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

విజ‌య్ కెరీర్‌లో లోయెస్ట్‌...

నెగెటివ్ టాక్ ఎఫెక్ట్ సినిమా క‌లెక్ష‌న్స్‌పై ప‌డిన‌ట్లు స‌మాచారం. శుక్ర‌వారం రోజు ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 5.75 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో అతి త‌క్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది. నైజాంలో ఈ మూవీ మూడు కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం.

లైగ‌ర్‌తో పోలిస్తే...

విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌త మూవీ లైగ‌ర్ ఫ‌స్ట్ డే 33 కోట్ల క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. నెగెటివ్ టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డ్ క‌లెక్ష‌న్స్‌ను లైగ‌ర్ ద‌క్కించుకున్న‌ది. లైగ‌ర్ తో క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఫ్యామిలీ స్టార్ ఏ మాత్రం పోటీప‌డ‌లేక‌పోయింది. లైగ‌ర్ కంటే దాదాపు ఇర‌వై కోట్ల వ‌ర‌కు త‌క్కువ‌గానే ఫ్యామిలీస్టార్‌కు క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.

ఫ్యామిలీ స్టార్ క‌థ ఇదే...

గీత‌గోవిందం త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో గోవ‌ర్ధ‌న్ అనే మిడిల్ క్లాస్ యువ‌కుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ క‌నిపించాడు. ఇంటి బాధ్య‌త‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోన్న గోవ‌ర్ధ‌న్ జీవితంలోకి ఇందు ఎలా వ‌చ్చింది? ఇందును ప్రేమించిన గోవ‌ర్ధ‌న్ ఆమెకు ఎందుకు బ్రేక‌ప్ చెప్పాడు?

జాబ్ కోసం గోవ‌ర్ధ‌న్ అమెరికా వెళ్ల‌గా అత‌డి వెంట ఇందు ఎందుకు వ‌చ్చింది? అపార్థాలు తొల‌గి గోవ‌ర్ధ‌న్‌, ఇందు ఎలా ఒక్క‌ట‌య్యార‌న్న‌దే ఫ్యామిలీ స్టార్ క‌థ‌. ఫ్యామిలీ స్టార్‌లో గీత‌గోవింద ఛాయ‌లు క‌నిపిస్తున్నాయ‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. త‌న ప్ర‌తి సినిమాలో ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ను స‌హ‌జంగా చూపించే ప‌ర‌శురామ్ ఇందులో మాత్రం చాలా ఆర్టిఫీషియ‌ల్‌గా ఆ సీన్స్ రాసుకున్నాడ‌ని అంటున్నారు.

జెర్సీ ద‌ర్శ‌కుడితో...

ఫ్యామిలీ స్టార్ మూవీలో జ‌గ‌ప‌తిబాబు, దివ్యాంశ కౌశిక్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ మూవీకి గోపిసుంద‌ర్ మ్యూజిక్ అందించాడు. మ్యూజిక్ కూడా ఫ్యామిలీ స్టార్ మూవీకి మైన‌స్ అయ్యింది. ఫ్యామిలీ స్టార్ త‌ర్వాత జేర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరితో యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ మూవీ చేయ‌బోతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకానుంది. ఫ్యామిలీ స్టార్ ప్ర‌మోష‌న్స్ ముగించుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం దుబాయ్ టూర్‌లో ఉన్నాడు. ర‌ష్మిక మంద‌న్న బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ కోసం అత‌డు దుబాయ్ వెళ్లిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

IPL_Entry_Point