Kushi Pre Release Business: ఖుషి ప్రీ రిలీజ్ బిజినెస్ - బ్రేక్ ఈవెన్ టార్గెట్ లైగర్ కంటే తక్కువే
Kushi Pre Release Business: లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్లో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన మూవీగా ఖుషి నిలిచింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
Kushi Pre Release Business: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి మూవీ సెప్టెంబర్ 1న పాన్ ఇండియన్ లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భార్యాభర్తల మధ్య ఉండే అపోహాల్ని, అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా దర్శకుడు శివ నిర్వాణ ఖుషి మూవీని తెరకెక్కిస్తోన్నాడు. లైగర్ డిజాస్టర్‌గా మిగిలినా విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. వరల్డ్ వైడ్‌గా యాభై మూడు కోట్ల వరకు ఖుషి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 40 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. కర్ణాటక రాయచూర్‌లలో ఐదున్నర కోట్లు, ఓవర్సీస్లో ఎనిమిది కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ పూర్తయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఈ లవ్ స్టోరీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 54 కోట్లుగా ఫిక్సయినట్లు చెబుతోన్నారు.
విజయ్ కెరీర్లో సెకండ్ హయ్యెస్ట్...
లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా ఖుషి నిలిచింది. లైగర్ మూవీ థియేట్రికల్ రైట్స్ 90 కోట్లకు అమ్ముడుపోయాయి.
రొటీన్ స్టోరీ కారణంగా అందులో సగం వసూళ్లను కూడా లైగర్ రాబట్టలేకపోయింది. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా 53 కోట్లతో లైగర్ తర్వాత ఖుషి సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. అంతే కాకుండా టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోల సినిమాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాల్లో లైగర్, ఖుషి టాప్ ప్లేస్‌లో ఉన్నాయి.
మహానటి తర్వాత...
మహానటి తర్వాత విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. హీషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించాడు. బుధవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బుకింగ్స్ ప్రారంభంకానున్నాయి.