Vishwak Sen: జాతి రత్నాలు డైరెక్టర్‌తో మాస్ కా దాస్ విశ్వక్ సినిమా.. షూటింగ్ ఎప్పటి నుంచంటే!-jathi ratnalu director anudeep kv and vishwak sen teaming up for movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Sen: జాతి రత్నాలు డైరెక్టర్‌తో మాస్ కా దాస్ విశ్వక్ సినిమా.. షూటింగ్ ఎప్పటి నుంచంటే!

Vishwak Sen: జాతి రత్నాలు డైరెక్టర్‌తో మాస్ కా దాస్ విశ్వక్ సినిమా.. షూటింగ్ ఎప్పటి నుంచంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 04, 2024 08:22 PM IST

Vishwak Sen: జాతి రత్నాలు డైరెక్టర్ కేవీ అనుదీప్‍తో విశ్వక్‍సేన్ సినిమా ఖరారైనట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీపై ప్రకటన రానుంది. ఎప్పుడు షూటింగ్ మొదలుకానుందో అంచనాలు కూడా వెలువడ్డాయి.

Vishwak Sen: జాతి రత్నాలు డైరెక్టర్‌తో మాస్ కా దాస్ విశ్వక్ సినిమా.. షూటింగ్ ఎప్పటి నుంచంటే!
Vishwak Sen: జాతి రత్నాలు డైరెక్టర్‌తో మాస్ కా దాస్ విశ్వక్ సినిమా.. షూటింగ్ ఎప్పటి నుంచంటే!

జాతిరత్నాలు సినిమాతో దర్శకుడు కేవీ అనుదీప్‍కు చాలా పాపులారిటీ వచ్చింది. ఆ చిత్రం బ్లాక్‍బస్టర్ అవటంతో పాటు ఈవెంట్లలో ఆయన హావభావాలు, స్పీచ్‍లతో ఫేమస్ అయ్యారు. జాతిరత్నాలు చిత్రాన్ని ఔట్ అండ్ ఔట్ కామెడీతో తీర్చిదిద్ది స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు అనుదీప్. రెండో చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆ తర్వాత శివకార్తికేయన్‍తో తెరకెక్కించిన ప్రిన్స్ చిత్రం ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. ఇప్పుడు మాస్ కా దాస్ విశ్వక్‍సేన్‍తో కేవీ అనుదీప్ సినిమా ఫిక్స్ అయిందనే సమాచారం బయటికి వచ్చింది.

షూటింగ్ ఆ నెల నుంచే!

విశ్వక్‍సేన్, కేవీ అనుదీప్ కాంబినేషన్ సెట్ అయిందని తెలుస్తోంది. అనుదీప్ చెప్పిన కథకు విశ్వక్ ఓకే చెప్పేశారట. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది. 14రీల్స్ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై అనిల్ సుంకర ఈ మూవీని నిర్మించనున్నారని తెలుస్తోంది. అక్టోబర్‌లో ఈ మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.

ఈ సినిమాను కూడా కామెడీ ఎంటర్‌టైనర్‌గానే అనుదీప్ తెరకెక్కించే అవకాశాలు ఉంటాయి. ఇటీవల కొన్ని విభిన్నమైన సినిమాలు చేస్తున్న విశ్వక్.. పూర్తిస్థాయి కామెడీ మూవీని ట్రై చేసేందుకు అనుదీప్‍కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. విశ్వక్‍సేన్ ఎనర్జీకి అనుదీప్ పంచ్‍లు తోడైతే ఎంత జోష్ ఉంటుందో చూడాలి.

విశ్వక్‍కు రెండు హిట్లు

మాస్ కా దాస్ విశ్వక్‍సేన్‍ను ఈ ఏడాది రెండు హిట్లు వచ్చాయి. ప్రయోగాత్మక చిత్రం గామి అంచనాలకు మంచి వసూళ్లను సాధించింది. ఈ చిత్రంలో అఘోరగా విభిన్న పాత్రలో నటించారు విశ్వక్. ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ అడ్వెంచర్ డ్రామా మూవీకి విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. మార్చి 8న రిలీజైన గామి చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.25కోట్ల వరకు వసూళ్లను రాబట్టి హిట్‍గా నిలిచింది.

విశ్వక్‍సేన్ హీరోగా నటించిన మాస్ రూరల్ యాక్షన్ డ్రామా సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 31వ తేదీన రిలీజ్ అయింది. వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం మంచి హైప్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ ఆకట్టుకోవడం, విశ్వక్ మాస్ అవతారంతో ఈ చిత్రంపై అంచనాలను బాగా ఏర్పడ్డాయి. అందుకు తగట్టే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం సూపర్ ఓపెనింగ్ అందుకుంది. ఓవరాల్‍గా మంచి కలెక్షన్లతో హిట్‍గా గట్టెక్కింది. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. విశ్వక్‍కు జీడీగా నేహా శెట్టి నటించగా.. అంజలి ఓ కీలకపాత్ర చేశారు.

నెక్ట్స్ మూవీ

విశ్వక్‍సేన్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ అనే యాక్షన్ డ్రామా సినిమా చేస్తున్నారు. విశ్వక్ నుంచి తదుపరి రానున్న సినిమా ఇదే. ఈ చిత్రానికి తేజ ముల్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా నటిస్తున్నారు.

‘లైలా’లో లేడీ గెటప్‍లో విశ్వక్

లైలా అనే సినిమా కూడా చేస్తున్నారు విశ్వక్‍సేన్. ఈ చిత్రంలో విశ్వక్ లేడీ గెటప్‍లో కనిపించనున్నారు. ఇందుకు సంబంధించి ఓ ప్రీ-లుక్ కూడా వచ్చింది. లేడీ గెటప్‍లో విశ్వక్‍ ముఖాన్ని కాస్త రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. లైలా మూవీని 2025 ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.

WhatsApp channel