Gaami Day 2 Collections: బాక్సాఫీస్ వద్ద గామి మూవీ జోరు.. రెండు రోజుల వసూళ్లు ఇవే-gaami 2 days collections vishwak sen adventure drama movie continues good run at box office ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Gaami 2 Days Collections Vishwak Sen Adventure Drama Movie Continues Good Run At Box Office

Gaami Day 2 Collections: బాక్సాఫీస్ వద్ద గామి మూవీ జోరు.. రెండు రోజుల వసూళ్లు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 10, 2024 02:07 PM IST

Gaami 2 Days Collections: గామి సినిమా మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. రెండో రోజు కూడా జోరు కొనసాగించింది. ఈ ప్రయోగాత్మక చిత్రానికి రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్ల వివరాలివే..

Gaami Day 2 Collections: బాక్సాఫీస్ వద్ద గామి మూవీ జోరు.. రెండు రోజుల వసూళ్లు ఇవే
Gaami Day 2 Collections: బాక్సాఫీస్ వద్ద గామి మూవీ జోరు.. రెండు రోజుల వసూళ్లు ఇవే

Gaami Collections: మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ ప్రధాన పాత్ర పోషించిన గామి చిత్రంపై చాలా ప్రశంసలు వస్తున్నాయి. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, మంచి ఎక్స్‌రియన్స్ ఇస్తోందంటూ పాజిటివ్ టాక్ వస్తోంది. భారీ అంచనాల మధ్య మార్చి 8వ తేదీన గామి థియేటర్లలోకి అడుగుపెట్టింది. ట్రైలర్ తర్వాత మంచి బజ్ ఏర్పడటంతో భారీ ఓపెనింగ్ సాధించింది. అయితే, రెండో రోజు కూడా ఈ చిత్రం పట్టునిలుపుకుంది. బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగించింది.

రెండు రోజుల కలెక్షన్లు

గామి చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.15.1 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. తొలి రోజు సుమారు రూ.9 కోట్లను సాధించిన ఈ మూవీ.. రెండో రోజు రూ.6 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. రెండో రోజూ కూడా జోరు చూపింది.

గామి రెండు రోజుల్లో రూ.15.1 కోట్లు సాధించిందని ఈ చిత్రాన్ని సమర్పించిన వీ సెల్యూలాయిడ్ నేడు (మార్చి 10) అధికారికంగా వెల్లడించింది. పాజిటివ్ మౌత్ టాక్‍తో దూసుకెళుతోందని పేర్కొంది. “అంతటా చాలా స్ట్రాంగ్‍గా గామి నడుస్తోంది. పాజిటివ్ టాక్‍తో ప్రపంచవ్యాప్తంగా రెండో రోజుల్లో రూ.15.1 కోట్ల గ్రాస్‍ను కలెక్ట్ చేసింది. ఈ వారం సినిమాకు వెళ్లాలనుకునే వారికి ఇది ఫస్ట్ చాయిస్‍గా ఉంది” అని వీ సెల్యూలాయిడ్ ట్వీట్ చేసింది.

భీమా, ప్రేమలు తెలుగు చిత్రాలు పోటీగా వచ్చినా గామి సినిమా అదరగొట్టింది. భారీ అంచనాలకు తగ్గట్టే వసూళ్లను రాబడుతోంది. భీమా చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడం కూడా గామికి కలిసి వచ్చింది.

ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాగా గామి వచ్చింది. దర్శకుడు విద్యాధర్ కగిత ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆరేళ్ల పాటు ఈ చిత్రం కోసం ఆయన శ్రమించారు. ఈ మూవీలో విజువల్స్, వీఎఫ్‍ఎక్స్, టేకింగ్ హైలైట్‍గా నిలిచాయి. కథలోని ఓ ట్విస్ట్ కూడా బాగా వర్కౌట్ అయింది. గామి విజువల్ ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉందనే టాక్ వచ్చింది.

గామి చిత్రంలో విశ్వక్‍సేన్ యాక్టింగ్‍పై ప్రశంసలు వస్తున్నాయి. శంకర్ అనే అఘోర పాత్రను ఆయన పోషించారు. వేదనను అనుభవిస్తూ.. సమస్యను పరిష్కరించుకునేందుకు పోరాడే వ్యక్తిగా విశ్వక్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. అతడి కెరీర్లో ఇది అత్యుత్తమంగా నిలిచిపోతుందనే కామెంట్లు వస్తున్నాయి. గామి మూవీలో చాందినీ చౌదరి, అభినయ, హారిక పెద్ద, మహమ్మద్ సమాద్, దయానంద్ రెడ్డి కీలకపాత్రలు పోషించారు.

విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, నరేశ్ కుమారన్ మ్యూజిక్ కూడా గామి మూవీకి పెద్ద ప్లస్ అయ్యాయి. కార్తిక్ శబరీశ్ నిర్మించిన ఈ చిత్రాన్ని వీ సెల్యూలాయిడ్ సమర్పించింది. తక్కువ బడ్జెట్‍లోనే హైక్వాలిటీతో ఈ చిత్రాన్ని తీసుకురావడంపై డైరెక్టర్ విద్యాధర్ కగితపై ప్రశంసలు వస్తున్నాయి.

స్టోరీ బ్యాక్‍డ్రాప్

శంకర్ (విశ్వక్‍సేన్) అనే అఘోరకు మానవ స్పర్శతో ఇబ్బంది ఉంటుంది. దీన్ని పరిష్కరించుకునేందుకు హిమాలయాల్లోని మాలి పత్రాలను దక్కించుకునేందుకు సాహసోపేతమైన ప్రయాణం చేస్తాడు. ఈ క్రమంలోనే జాన్వీ (చాందినీ చౌదరి) పరిచయం అవుతుంది. దేవదాసి దుర్గ (అభినయ) కూతురు ఉమ (హారిత), సీటీ 333 (మహమ్మద్ సమాద్) కథలు కూడా ఉంటాయి. అయితే, వీరికి శంకర్‌కు మధ్య ఉన్న లింక్ ఏంటి? మాలి పత్రాలను దక్కించుకొని తన సమస్యను శంకర్ పరిష్కరించుకున్నాడా? అనేవే గామి మూవీ కథలో ముఖ్య అంశాలుగా ఉన్నాయి.

IPL_Entry_Point