Indian 2 Release: భారతీయుడు 2 సినిమా రిలీజ్‍పై అఫీషియల్ అప్‍డేట్.. కానీ!-indian 2 movie release official update kamal hasan and shankar movie set to release in june but date not confirmed yet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Indian 2 Release: భారతీయుడు 2 సినిమా రిలీజ్‍పై అఫీషియల్ అప్‍డేట్.. కానీ!

Indian 2 Release: భారతీయుడు 2 సినిమా రిలీజ్‍పై అఫీషియల్ అప్‍డేట్.. కానీ!

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 06, 2024 06:44 PM IST

Indian 2 Release Update: ఇండియన్ 2 సినిమా విడుదలపై అధికారిక ప్రకటన చేసింది మూవీ టీమ్. కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఏ నెలలో రిలీజ్ కానుందో ఫిక్స్ అయింది.

Indian 2 Release: ‘భారతీయుడు 2’ సినిమా రిలీజ్‍పై అఫీషియల్ అప్‍డేట్.. కానీ!
Indian 2 Release: ‘భారతీయుడు 2’ సినిమా రిలీజ్‍పై అఫీషియల్ అప్‍డేట్.. కానీ!

Indian 2 Movie: సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఇండియన్ 2 (తెలుగులో భారతీయుడు 2) ముందు వరుసలో ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో లోక నాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీకి తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. 1996లో వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‍గా భారతీయుడు 2 వస్తోంది. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎందరూ నిరీక్షిస్తుండగా.. ఈ విషయంపై అధికారిక అప్‍డేట్‍ను నేడు (ఏప్రిల్ 6) ఇచ్చింది మూవీ టీమ్.

ఆ నెలలోనే..

ఇండియన్ 2 (భారతీయుడు 2) సినిమాను ఈ ఏడాది జూన్‍లో రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. దీంతో ఈ మూవీ ఎప్పుడొస్తుందా అనే నిరీక్షణకు ఓ సమాధానం దొరికింది. అయితే, జూన్‍లో తీసుకొస్తామని చెప్పినా.. కానీ తేదీని మాత్రం మూవీ టీమ్ ఖరారు చేయలేదు.

“సేనాపతి తిరిగి వచ్చేస్తున్నాడు.. సిద్ధంగా ఉండండి! జూన్‍లో ఇండియన్ 2 తుఫానుకు అంతా సిద్ధమైంది. ఈ ఎపిక్ మూవీ కోసం మీ క్యాలెండర్లలో మార్క్ చేసి పెట్టుకోండి” అంటూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ నేడు ట్వీట్ చేసింది.

కొత్త పోస్టర్

ఇండియన్ 2 జూన్‍లో వస్తుందంటూ కొత్త పోస్టర్‌ను మూవీ టీమ్ వెల్లడించింది. దీంట్లో తెల్ల వెంట్రుకలు ఉన్న కమల్ హాసన్ తెలుపు చొక్కా, పంచె ధరించారు. ఆయన చేతులు వెనక్కి ఉండగా.. వాటికి సంకెళ్లు వేసి ఉన్నాయి. ఈ పోస్టర్ బ్యాక్‍గ్రౌండ్‍లో పసుపు, ఆరెంజ్ కలర్స్ ఉన్నాయి. కొందరు ఉన్నా.. బ్లాక్‍లో వారు హైలైట్ అయి ఉన్నారు.

అయితే, ఇండియన్ 2 సినిమా జూన్‍లో రిలీజవుతుందని ఖరారు చేసినా.. తేదీని వెల్లడించకపోవడంపై కొందరు అభిమానులు నిరాశవ్యక్తం చేశారు. తేదీని కూడా త్వరగా ఖరారు చేస్తే బెస్ట్ అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, జూన్ 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఇతర చిత్రాల పోటీ సహా మరిన్ని అంశాల ఆధారంగా మూవీ టీమ్ తేదీని ప్రకటించే ఛాన్స్ ఉంది.

అవినీతి అధికారులను మట్టుబెడుతూ దేశం కోసం పాటుపడే ఒకప్పటి స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా ఇండియన్ చిత్రంలో కమల్ హాసన్ నటించారు. 28 ఏళ్ల క్రితం వచ్చిన ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ విజయం సాధించింది. సేనాపతి పాత్ర కల్ట్ క్యారెక్టర్‌గా నిలిచిపోయింది. ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్‍గా ఇండియన్ 2 వస్తోంది. ఆ చిత్రానికి కొనసాగింపుగానే ఉండనుంది. ఇటీవలే వచ్చిన గ్లింప్స్ అదిరిపోయింది.

ఇండియన్ 2 గురించి..

ఇండియన్ 2 చిత్రంలో కమల్ హాసన్‍తో పాటు కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, ఎస్‍జే సూర్య, రకుల్ ప్రీత్ సింగ్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్స్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ నిర్మించారు.

IPL_Entry_Point