IMDb top rated Korean Dramas: ఐఎండీబీలో అత్యుత్తమ రేటింగ్ ఉన్న టాప్ కొరియన్ వెబ్ సిరీస్, మూవీస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?-imdb top rated korean drama web series squid game parasite pachinko oldboy crash landing on you on netflix prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Imdb Top Rated Korean Dramas: ఐఎండీబీలో అత్యుత్తమ రేటింగ్ ఉన్న టాప్ కొరియన్ వెబ్ సిరీస్, మూవీస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?

IMDb top rated Korean Dramas: ఐఎండీబీలో అత్యుత్తమ రేటింగ్ ఉన్న టాప్ కొరియన్ వెబ్ సిరీస్, మూవీస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Sep 30, 2024 04:48 PM IST

IMDb top rated Korean Dramas: ఐఎండీబీలో టాప్ రేటింగ్ ఉన్న కొరియన్ మూవీస్, వెబ్ సిరీస్ ఇక్కడ ఇస్తున్నాం. మరి వీటిని ఏ ఓటీటీల్లో చూడాలో తెలుసుకోండి. ఇప్పటి వరకూ మీరు ఎన్ని చూశారు? ఏవైనా మిస్ అయి ఉంటే వాటిని వెంటనే చూడటానికి ప్లాన్ చేయండి.

ఐఎండీబీలో అత్యుత్తమ రేటింగ్ ఉన్న టాప్ కొరియన్ వెబ్ సిరీస్, మూవీస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?
ఐఎండీబీలో అత్యుత్తమ రేటింగ్ ఉన్న టాప్ కొరియన్ వెబ్ సిరీస్, మూవీస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?

IMDb top rated Korean Dramas: కొరియన్ డ్రామాస్ కి ఇండియా ప్రేక్షకులు కూడా పెద్ద అభిమానులన్న విషయం తెలుసు కదా. ఓటీటీల కారణంగా గత కొన్నేళ్లుగా కొరియన్ మూవీస్, వెబ్ సిరీస్ ను ఇక్కడి ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐఎండీబీలో టాప్ రేటింగ్ ఉన్న కొరియన్ మూవీస్, వెబ్ సిరీస్ ఏవి? ఏ ఓటీటీల్లో వాటిని చూడాలన్నది ఇక్కడ తెలుసుకోండి.

టాప్ రేటెడ్ కొరియన్ డ్రామాస్

ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ).. సినిమాలు, వెబ్ సిరీస్ ల రేటింగ్ కు ప్రామాణికంగా భావిస్తారు. సాధారణ ప్రేక్షకులే రేటింగ్ ఇచ్చే వెబ్ సైట్ ఇది. మరి ఇందులో మంచి రేటింగ్ ఉన్న కొరియన్ మూవీస్, వెబ్ సిరీస్ ఏవో చూద్దాం.

రిప్లై 1988 - నెట్‌ఫ్లిక్స్

రిప్లై 1988 ఓ కొరియన్ వెబ్ సిరీస్. అత్యుత్తమ ఐఎండీబీ రేటింగ్ ఈ సిరీస్ సొంతం. ఏకంగా 9.1 రేటింగ్ తో ప్రేక్షకుల ఆదరణ సంపాదించింది. 1980ల నేపథ్యంలో సాగే సిరీస్ ఇది. ఒకే వీధిలో నివసించే ఐదుగురు ఫ్రెండ్స్, వాళ్ల ఫ్యామిలీస్ చుట్టూ తిరిగే మనసును హత్తుకునే వెబ్ సిరీస్ ఇది. నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.

సిగ్నల్ - నెట్‌ఫ్లిక్స్

సిగ్నల్ 8.8 ఐఎండీబీ రేటింగ్ ఉన్న కొరియన్ వెబ్ సిరీస్. రెండు వేర్వేరు కాలాలకు చెందిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లను ఓ వాకీ టాకీ ఎలా కలుపుతుంది? దాని ద్వారా వాళ్లు కేసులను ఎలా పరిష్కరిస్తారన్నది ఇందులో చూడొచ్చు. దీనిని ఆధారంగా చేసుకొనే హిందీలో గ్యారా గ్యారా అనే సిరీస్ వచ్చింది. సిగ్నల్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

క్రాష్ ల్యాండింగ్ ఆన్ యు - నెట్‌ఫ్లిక్స్

2019-20ల్లో వచ్చిన కొరియన్ వెబ్ సిరీస్ క్రాష్ ల్యాండింగ్ ఆన్ యు 8.7 ఐఎండీబీ రేటింగ్ సాధించింది. ఇదొక రొమాంటిక్ సిరీస్. సౌత్ కొరియాకు చెందిన ఓ ధనవంతురాలు అనుకోకుండా నార్త్ కొరియాలో ల్యాండై అక్కడి ఆర్మీ ఆఫీసర్ తో ఎలా ప్రేమలో పడుతుందన్నది చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్ ఉంది.

పారాసైట్ - సోనీలివ్

పారాసైట్ ఆస్కార్ విన్నింగ్ కొరియన్ మూవీ. ఈ సినిమాకు ఐఎండీబీలో 8.6 రేటింగ్ ఉంది. ఓ నిరుపేద కుటుంబం ఓ సంపన్న కుటుంబం నివసించే ఇంట్లోకి వెళ్లి వాళ్లపై ఆధారపడి ఓ పరాన్నజీవిలా ఎలా జీవిస్తుందో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఈ మూవీ సోనీలివ్ ఓటీటీలో చూడొచ్చు.

విన్సెంజో - నెట్‌ఫ్లిక్స్

విన్సెంజో ఓ లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ కు ఐఎండీబీలో 8.5 రేటింగ్ ఉంది. ఇటలీకి చెందిన ఓ లాయర్, ఓ పవర్ ఫుల్ కార్పొరేషన్ చుట్టూ తిరిగే సిరీస్ ఇది. నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.

స్క్విడ్ గేమ్ - నెట్‌ఫ్లిక్స్

2021లో వచ్చిన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ఆకట్టుకుంది. ఈ ఏడాది సెకండ్ సీజన్ కూడా రాబోతోంది. ఈ సిరీస్ కు ఐఎండీబీలో 8.4 రేటింగ్ ఉంది. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

ఓల్డ్ బాయ్ - అమెజాన్ ప్రైమ్ వీడియో

ఓల్డ్ బాయ్ 2003లో రిలీజైన ఓ కొరియన్ మూవీ. చేయని తప్పుకు 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించే ఓ వ్యక్తి చుట్టూ తిరిగే యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమాకు 8.3 రేటింగ్ ఉండగా.. ప్రస్తుతం ప్రైమ్ వీడియో ఓటీటీలో చూడొచ్చు.

పచింకో - ఆపిల్ టీవీ

పచింకో ఓ డ్రామా వెబ్ సిరీస్. 2017లో ఇదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా ఈ సిరీస్ ను 2022లో తెరకెక్కించారు. అమెరికాకు వలస వెళ్లిన ఓ కొరియన్ కుటుంబం నాలుగు తరాల చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ సిరీస్ కు ఐఎండీబీలో 8.3 రేటింగ్ ఉంది. ఆపిల్ టీవీలో ఈ సిరీస్ చూడొచ్చు.