OTT Tamil Movie: ఓటీటీలోకి తెలుగుతోపాటు ఏడు భాషల్లో వస్తున్న బ్లాక్‌బస్టర్ తమిళ మూవీ.. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్-ott tamil movie vaazhai to stream in telugu on disney plus hotstar from october 11th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Tamil Movie: ఓటీటీలోకి తెలుగుతోపాటు ఏడు భాషల్లో వస్తున్న బ్లాక్‌బస్టర్ తమిళ మూవీ.. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Tamil Movie: ఓటీటీలోకి తెలుగుతోపాటు ఏడు భాషల్లో వస్తున్న బ్లాక్‌బస్టర్ తమిళ మూవీ.. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

Hari Prasad S HT Telugu
Sep 25, 2024 07:52 PM IST

OTT Tamil Drama Movie: ఓటీటీలోకి ఓ బ్లాక్‌బస్టర్ తమిళ మూవీ తెలుగుతోపాటు మరో ఆరు భాషల్లో రాబోతోంది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.40 కోట్లు వసూలు చేసి సినీ పండితులను ఆశ్చర్యపరిచింది.

ఓటీటీలోకి తెలుగుతోపాటు ఏడు భాషల్లో వస్తున్న బ్లాక్‌బస్టర్ తమిళ మూవీ.. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్
ఓటీటీలోకి తెలుగుతోపాటు ఏడు భాషల్లో వస్తున్న బ్లాక్‌బస్టర్ తమిళ మూవీ.. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Tamil Drama Movie: తమిళంలో ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చిన మంచి వసూళ్లు సాధించిన మూవీ వాళై (Vaazhai). గత నెల థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిల్డ్రన్స్ డ్రామా మూవీ.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి రాబోతోంది.

వాళై ఓటీటీ రిలీజ్ డేట్

తమిళ సినిమా వాళై ఆగస్ట్ 23న థియేటర్లలో రిలీజైంది. మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్ 11 నుంచి తమిళం, తెలుగుతోపాటు హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ.. ఇలా మొత్తంగా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ఊహించని సక్సెస్ సాధించిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది.

వాళై మూవీ గురించి..

వాళై మూవీని కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఏకంగా రూ.40 కోట్లు వసూలు చేసి ఆశ్చర్య పరిచింది. తమిళంలో వాళై అంటే అరటి పండు. ఇదొక పిల్లల డ్రామా మూవీ. 12 ఏళ్ల వయసున్న శివనందన్, అతని తల్లి, సోదరి, స్నేహితుడి చుట్టూ తిరుగుతుంది.

అరటి తోటనే నమ్ముకుని బతికే వీళ్లు తమ జీవితాల్లో ఎదుర్కొనే సవాళ్లను ఈ వాళై సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. గతంలో కర్ణన్, మామన్నన్ లాంటి హిట్ సినిమాలు అందించిన మారి సెల్వరాజ్.. ఈ వాళై మూవీతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తమిళ ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది.

హాట్‌స్టార్ లేటెస్ట్ మూవీస్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ మధ్య కాలంలో వివిధ భాషల సినిమాలను వరుసగా తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ వారంలోనే అలా మూడు సినిమాలు ఈ ఓటీటీలోకి వచ్చాయి.

హిందీలో ఈ ఏడాది రిలీజై మంచి హిట్ కొట్టిన కిల్, ముంజ్యాలాంటి సినిమాలతోపాటు మలయాళం హిట్ కామెడీ మూవీ వాజా కూడా ప్రస్తుతం హాట్‌స్టార్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ వాళై అనే తమిళ హిట్ మూవీని కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది.