Squid Game 2: స్క్విడ్ గేమ్ సీజన్ 2పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ - టీజర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన నెట్‌ఫ్లిక్స్
Squid Game 2: స్క్విడ్ గేమ్ 2 డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. కాగా ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ రివీల్ చేసింది. టీజర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. సోషల్ మీడియాలో నెట్‌ఫ్లిక్స్ పోస్ట్ చేసిన కొత్త పోస్టర్ ఆసక్తిని పంచుతోంది.
Squid Game 2: వరల్డ్ వైడ్‌గా ఓటీటీ ఆడియెన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న వెబ్‌సిరీస్‌లలో స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఒకటి. ఫస్ట్ సీజన్ పెద్ద విజయాన్ని సాధించడంతో సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. స్క్విడ్ గేమ్ సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. సీజన్ 2 రిలీజ్ డేట్‌ను ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్‌చేసింది. డిసెంబర్ 26 నుంచి వరల్డ్ వైడ్‌గా ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది.
స్క్విడ్ గేమ్ సీజన్ 2 టీజర్...
కాగా స్క్విడ్ గేమ్ సీజన్ 2కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ వెబ్‌సిరీస్ స్పెషల్ టీజర్‌ను గురువారం రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నది. ఇందులో ఆటలో ఓడిపోయిన 392 నంబర్ జెర్సీ వ్యక్తిని గేమ్ నిర్వహకులు చంపేసినట్లుగా ఈ పోస్టర్‌లో చూపించారు.
అతడి డెడ్‌బాడీని ఈడ్చుకెళుతున్నట్లుగా ఈ పోస్టర్‌లో చూపించారు. రక్తంతో నిండి ఉన్న ఈ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది. ది గేమ్ విల్ నాన్ స్టాప్ అంటూ పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది. రెడీ ఫర్ ది నెక్స్ట్ లెవెల్ అంటూ పోస్టర్‌కు నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన క్యాప్షన్ సిరీస్‌పై ఉన్న హైప్‌ను మరింత పెంచుతోంది. సీజన్‌లో గేమ్స్ ఎలా ఉండబోతున్నాయన్నది టీజర్‌లో హింట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.
గేమ్ రూల్స్ డిఫరెంట్...
స్క్విడ్ గేమ్ సీజన్ 2లో లీ జంగ్ జే, వి హ జూన్, గాంగ్ యో కీతో పాటు పలువురు కొరియన్ యాక్టర్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సీజన్ 2లో స్క్విగ్ గేమ్ రూల్స్ డిఫరెంట్‌గా ఉండబోతున్నట్లు సమాచారం. ఫస్ట్ సీజన్‌కు మించి ట్విస్ట్‌లు, టర్న్‌లతో సీజన్ 2 సాగుతుందని మేకర్స్ చెబుతోన్నారు.
సీజన్ వన్ మాదిరిగానే సీజన్ 2లో కూడా స్క్విడ్ గేమ్‌లో 456 మంది పాల్గొంటారని, ఇందులో ఎవరు విన్నర్‌గా నిలుస్తారు? ఈ 456 మంది ప్రాణాలతో ఉండేది ఎవరన్నది ఉత్కంఠను పంచుతుందని చెబుతోన్నారు. రియల్ గేమ్స్‌తో ఈ సిరీస్ సాగనున్నట్లు సమాచారం.
వ్యూయర్‌షిప్ రికార్డులు...
2021లో రిలీజైన స్క్విడ్ గేమ్ సిరీస్ వ్యూయర్‌షిప్ పరంగా ఓటీటీలో గత రికార్డులు మొత్తం తిరగరాసింది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక మంచి వీక్షించిన వెబ్‌సిరీస్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. స్క్విడ్ గేమ్‌కు 1.65 బిలియన్ల స్ట్రీమింగ్ వ్యూస్‌తో వచ్చాయి
స్క్విడ్ గేమ్ ఆటలో
ఆర్థిక ఇబ్బందులు, అప్పులతో సతమతమవుతోన్న 456 మంది స్క్విడ్ గేమ్ ఆటలో పాల్లొంటారు. ఈ గేమ్ రూల్స్ విచిత్రంగా ఉంటాయి. ఓడిపోయిన వారిని చంపేస్తుంటారు. సింపుల్ గేమ్స్‌తో మొదలైన ఆటలో చివరకు ఇద్దరే ఎలా మిగిలారు? విజేతగా ఎవరు నిలిచారు? డబ్బు కోసం గేమ్‌లో పాల్గొన్న వారు ఒకరినొకరు ఎలా మోసం చేసుకున్నారు అన్నదే ఈ సీరిస్ కథ.
ఆడియెన్స్‌కు సిరీస్ ద్వారా థ్రిల్‌ను పంచుతూనే దక్షిణకొరియాలో ఉన్న పేద, ధనికుల మధ్య ఉన్న అంతరాలు, పెట్టుబడిదారి వ్యవస్థను స్క్విడ్ గేమ్‌లో దర్శకుడు హ్యాంగ్ డాంగ్ హ్యాక్ చూపించాడు. స్క్విడ్ గేమ్‌లో లీ జంగ్ జే, పార్క్ హే సూ, హోయాన్ జంగ్ కీలక పాత్రల్లో నటించారు.
భారతీయ భాషల్లో...
మొత్తం తొమ్మిది ఎపిసోడ్స్‌తో స్క్విడ్ గేమ్ ఫస్ట్ సీజన్ రూపొందింది. సీజన్ 2లో కూడా తొమ్మిది ఎపిసోడ్స్ ఉంటాయని సమాచారం. స్క్విడ్ గేమ్ సీజన్ 2ను కొరియన్, ఇంగ్లీష్‌తో పాటు భారతీయ భాషలన్నింటిలో రిలీజ్ కానున్నట్లు సమాచారం.