Aata Sandeep Movie: హీరోగా ఆట సందీప్ రీఎంట్రీ - ది షార్ట్‌క‌ట్ పోస్ట‌ర్‌పై నెటిజ‌న్ల ట్రోల్స్ - కార‌ణం ఇదే-netizens troll on bigg boss aata sandeep the shortcut movie poster ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aata Sandeep Movie: హీరోగా ఆట సందీప్ రీఎంట్రీ - ది షార్ట్‌క‌ట్ పోస్ట‌ర్‌పై నెటిజ‌న్ల ట్రోల్స్ - కార‌ణం ఇదే

Aata Sandeep Movie: హీరోగా ఆట సందీప్ రీఎంట్రీ - ది షార్ట్‌క‌ట్ పోస్ట‌ర్‌పై నెటిజ‌న్ల ట్రోల్స్ - కార‌ణం ఇదే

Nelki Naresh Kumar HT Telugu
Jan 03, 2024 09:30 AM IST

Aata Sandeep Movie: బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు ఆట సందీప్‌. టైటిల్ పేవ‌రేట్ల‌లో ఒక‌రిగా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆట సందీప్ ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ షో ద్వారా వ‌చ్చిన క్రేజ్‌తో ఆట సందీప్ హీరోగా రీఎంట్రీ ఇస్తున్నాడు.

ఆట సందీప్
ఆట సందీప్

Aata Sandeep Movie: బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7లో తొలి కంటెంస్టెంట్‌గా హౌజ్‌లోకిఎంట్రీ ఇచ్చాడు ఆట సందీప్. టైటిల్ ఫేవ‌రేట్ల‌లో ఒక‌రిగా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన ఆట సందీప్ ఊహించ‌ని విధంగా ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అయ్యాడు. ఆరంభంలో గేమ్ బాగా ఆడిన సందీప్ ఆ త‌ర్వాత తేలిపోయాడు.

బిగ్‌బాస్ సీజ‌న్ 7లో ఫైన‌ల్ వ‌ర‌కు చేరుకోలేక‌పోయినా సందీప్ ఈ షో ద్వారా పాపుల‌ర్ అయ్యాడు. బిగ్‌బాస్ ద్వారా వ‌చ్చిన క్రేజ్‌ను ఉప‌యోగించుకుంటూ కొత్త సినిమాను అనౌన్స్‌చేశాడు ఆట సందీప్‌. ది షార్ట్‌క‌ట్ పేరుతో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమా కొత్త పోస్ట‌ర్‌ను ఇటీవ‌ల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు ఆట సందీప్‌.

ఈ పోస్ట‌ర్‌లో రివాల్వ‌ర్ ప‌ట్టుకొని ఆట సందీప్ క‌నిపిస్తున్నాడు. అంతే కాకుండా ఈ పోస్ట‌ర్‌పై బిగ్‌బాస్ బెస్ట్ సంచాల‌క్ ఆట సందీప్‌...కేఎస్ ప్ర‌కాష్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు రాసి ఉంది. ఈ పోస్ట‌ర్‌ను నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బెస్ట్ సంచాల‌క్ అన్న‌ది అవార్డా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.బెస్ట్ సంచాల‌క్ అంటూ పోస్ట‌ర్‌లో రాసుకోవ‌డం ఏంటి అంటూ విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు.

గ‌తంలో ఆట సందీప్ ల‌వ్ యూ టూ అనే సినిమా చేశాడు. ఆట సందీప్ భార్య జ్యోతి ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. ప‌లు సినిమాల‌కు కొరియోగ్రాఫ‌ర్‌గా ఆట సందీప్ వ‌ర్క్ చేశాడు.

Whats_app_banner